TATA Tiago: క్లచ్ నొక్కి నొక్కి కాలు నొప్పి పుడుతుందా.? ఈ కారు కొంటే బిందాస్.
TATA Tiago: పెరుగుతోన్న ట్రాఫిక్ నేపథ్యంలో ఆటోమేటిక్ కార్లను ఉపయోగిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. పదే పదే గేర్ మార్చాల్సిన పనిలేకుండా ఉండే ఈ కార్లు ఎంతో ఉపయోగపడుతాయి. అలాంటి ఒక బెస్ట్ బడ్జెట్ కార్లలో టాటా టియాగో XTA AMT ఒకటి.

టాటా టియాగో XTA AMT ధర ఎంత?
టాటా మోటార్స్ విడుదల చేసిన Tata Tiago XTA AMT ఒక పాపులర్ ఆటోమేటిక్ హ్యాచ్‌బ్యాక్ కారు. నగరంలో డ్రైవింగ్ సులభంగా ఉండేలా AMT గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ. 6,31,290గా ఉంది. అయితే RTO ఛార్జీలు రూ. 51,561, ఇన్సూరెన్స్ రూ. 31,721 కలుపుకొని ఆన్‌రోడ్ ధర రూ. 7,14,572 అవుతుంది.
ఇంజిన్, పవర్, మైలేజ్ వివరాలు
ఈ కారులో టాటా కంపెనీకి చెందిన 1.2 లీటర్ Revotron పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది సిటీ డ్రైవింగ్‌కి సరిపడే పవర్ ఇస్తుంది.
* ఇంజిన్ సామర్థ్యం : 1199 cc
* గరిష్ట పవర్ : 85 bhp @ 6000 rpm
* గరిష్ట టార్క్ : 113 Nm @ 3300 rpm
* సిలిండర్లు : 3
* గేర్‌బాక్స్ : 5-Speed AMT ఆటోమేటిక్
* డ్రైవ్ టైప్ : FWD
మైలేజ్ విషయానికి వస్తే, కంపెనీ తెలిపిన ప్రకారం ఇది సుమారు 19 kmpl వరకు ఇంధన సామర్థ్యాన్ని ఇస్తుంది.
ఇందులో 35 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది.
డిజైన్, బూట్ స్పేస్
Tata Tiago చిన్న ఫ్యామిలీకి సరిపోయే హ్యాచ్‌బ్యాక్ కారు. సిటీ రోడ్లలో డ్రైవింగ్‌కు అనుకూలంగా డిజైన్ చేశారు.
* పొడవు : 3767 mm
* వెడల్పు : 1677 mm
* ఎత్తు : 1535 mm
* వీల్‌బేస్ : 2400 mm
* గ్రౌండ్ క్లియరెన్స్ : 170 mm
* బూట్ స్పేస్ : 242 లీటర్లు
* సీటింగ్ సామర్థ్యం : 5 మంది
ముఖ్యమైన ఫీచర్లు, భద్రత
Tata Tiago XTA AMTలో డ్రైవర్‌కు ఉపయోగపడే అనేక ఫీచర్లు ఉన్నాయి. ఈ కారులో ఉన్న ప్రధాన ఫీచర్ల విషయానికొస్తే. మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ ప్లే, రియర్ కెమెరా, పవర్ స్టీరింగ్, ఎయిర్ కండీషనర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఇక భద్రత విషయానికొస్తే ఇందులో ఏబీఎస్ (Anti-lock Braking System), డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్, ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్, డిస్క్ ఫ్రంట్ బ్రేక్స్, డ్రమ్ రియర్ బ్రేక్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఎన్ని కలర్స్‌లో లభిస్తోందంటే.?
ఈ వేరియంట్ మార్కెట్లో 6 కలర్స్ లో లభిస్తుంది. ఓషన్ బ్లూ, ప్రిస్టన్ వైట్, టొర్నడో బ్లూ, సూపర్‌నోవా కాపర్, అరిజోనా బ్లూ, డైటోనా గ్రే వంటి కలర్స్‌లో తీసుకొచ్చారు. ఈ ధర పరిధిలో టియాగోకు కొన్ని కార్లు పోటీనిస్తున్నాయి. వీటిలో ప్రధానంగా టాటా పంచ్ ప్యూర్ ప్లస్ ఎఎమ్‌టీ రూ. 7.55 లక్షలు, టాటా అల్ట్రోజ్ ప్యూర్ ఏఎమ్‌టీ రూ. 7.58 లక్షలు, మారుతి సుజికి స్విఫ్ట్ వీఎక్స్ఐ ఏఎమ్‌టీ రూ. 7.4 లక్షలుగా ఉన్నాయి.

