MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Relationship
  • దేశంలో పెరుగుతోన్న వివాహేత‌ర సంబంధాలు.. హైద‌రాబాద్ స్థానం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

దేశంలో పెరుగుతోన్న వివాహేత‌ర సంబంధాలు.. హైద‌రాబాద్ స్థానం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Relationship: దేశంలో వివాహేతర సంబంధాలపై ఆసక్తి చూపుతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. పట్టణ ప్రాంతాల్లో సంబంధాల తీరు మారుతోందని వెల్లడైంది. ప్రముఖ ఎక్స్‌ట్రామారిటల్ డేటింగ్ యాప్ గ్లీడెన్ సర్వేలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jun 13 2026, 03:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వివాహేతర సంబంధాల్లో బెంగళూరు మొదటి స్థానం
Image Credit : Gemini AI

వివాహేతర సంబంధాల్లో బెంగళూరు మొదటి స్థానం

Infidelity Study 2025లో గ్లీడెన్ అధ్యయనం ప్రకారం, దేశంలో వివాహేతర సంబంధాల కోసం ఎక్కువ మంది యాప్‌ను ఉపయోగిస్తున్న నగరంగా బెంగళూరు నిలిచింది. మొత్తం యూజర్లలో 18 శాతం మంది బెంగళూరుకు చెందినవారే ఉన్నారు. ఇక్కడ ఎక్కువగా 30 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన ఉద్యోగులు, వ్యాపారవేత్తలు ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తున్నట్లు అధ్యయనం పేర్కొంది. 12 నగరాల్లో 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు గల 1,510 మందిపై ఈ సర్వే నిర్వహించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
హైదరాబాద్‌కు రెండో స్థానం.. టాప్ నగరాల జాబితా ఇదే
Image Credit : Getty

హైదరాబాద్‌కు రెండో స్థానం.. టాప్ నగరాల జాబితా ఇదే

ఈ అధ్యయనంలో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. మొత్తం యాప్ వినియోగదారుల్లో 17 శాతం మంది హైదరాబాద్‌కు చెందినవారని వెల్లడైంది. ఆ తర్వాత ఢిల్లీ 11 శాతం, ముంబై 9 శాతం, పుణే 7 శాతంతో తదుపరి స్థానాల్లో ఉన్నాయి. యాప్ వినియోగదారుల్లో 65 శాతం మంది పురుషులు కాగా, 35 శాతం మంది మహిళలు ఉన్నట్లు రిపోర్ట్ తెలిపింది. 

Related Articles

Related image1
Facts: అమెరికాలో ఇళ్ల‌పై నీటి ట్యాంకులు ఎందుకు క‌నిపించ‌వో తెలుసా.?
Related image2
Raincoat: వర్షంలో బయటకు వెళ్తుంటారా.? ఈ బాల్ ఉంటే చాలు అస్స‌లు త‌డ‌వ‌రు
35
ఈ సంబంధాలు ఎందుకు పెరుగుతున్నాయి.?
Image Credit : Getty

ఈ సంబంధాలు ఎందుకు పెరుగుతున్నాయి.?

గ్లీడెన్ ప్రతినిధుల ప్రకారం, చాలా మంది కేవలం శారీరక సంబంధాల కోసం కాకుండా భావోద్వేగ పరమైన అనుబంధం కోసం ఈ తరహా ప్లాట్ ఫామ్స్  ఆశ్రయిస్తున్నారు. దాంపత్య జీవితంలో భావోద్వేగ లోటు, భాగస్వామితో సరైన అనుబంధం లేకపోవడం, ఒంటరితనం వంటి కారణాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని అధ్యయనం చెబుతోంది. ముఖ్యంగా ఉద్యోగ స్థలాలు, సోషల్ మీడియా, డేటింగ్ యాప్‌లు కొత్త పరిచయాలకు ప్లాట్ ఫామ్ గా మారుతున్నాయని పేర్కొంది.

45
మహిళల భాగస్వామ్యం భారీగా పెరుగుతోంది
Image Credit : Pixabay

మహిళల భాగస్వామ్యం భారీగా పెరుగుతోంది

ఈ తరహా ప్లాట్‌ఫామ్‌లలో మహిళల భాగస్వామ్యం కూడా గణనీయంగా పెరుగుతోందని అధ్యయనం వెల్లడించింది. గత రెండు సంవత్సరాల్లో మహిళా వినియోగదారుల సంఖ్య 148 శాతం పెరిగినట్లు గ్లీడెన్ పేర్కొంది. ఇది పట్టణ ప్రాంతాల్లో సంబంధాలపై మారుతున్న దృక్పథాన్ని ప్రతిబింబిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్న మహిళలు కూడా ఈ ప్లాట్ ఫామ్ల‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు రిపోర్టులో వెల్లడైంది.

55
మానసిక నిపుణులు ఏమంటున్నారు?
Image Credit : Getty

మానసిక నిపుణులు ఏమంటున్నారు?

మానసిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, వివాహేతర సంబంధాల వెనుక ప్రధాన కారణం ఒంటరితనం, భావోద్వేగ శూన్యత. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన మద్ధతు లేదా అర్థం చేసుకోవడం లభించకపోతే కొందరు ఇతర సంబంధాల వైపు ఆకర్షితులవుతారని చెబుతున్నారు. అధ్యయనం ప్రకారం, భారతీయ వినియోగదారులు రోజుకు సగటున ఒకటి నుంచి గంటన్నర వరకు ఈ తరహా యాప్‌లలో గడుపుతున్నారు. ఇదే సమయంలో మరో అంతర్జాతీయ డేటింగ్ యాప్ నిర్వహించిన అధ్యయనంలో తమిళనాడులోని కాంచీపురం కూడా వివాహేతర సంబంధాల హాట్‌స్పాట్‌గా నిలిచినట్లు వెల్లడైంది.

గమనిక: ఈ వివరాలు సంబంధిత యాప్‌లు నిర్వహించిన సర్వేలు, అధ్యయనాల ఆధారంగా వెల్లించ‌డ‌మైంది. ఇవి మొత్తం సమాజ పరిస్థితిని ప్రతిబింబిస్తాయని భావించకూడదు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
బంధుత్వం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Relationship : ఆంటీలతోనే యువకుల అక్రమసంబంధం.. ఎందుకో తెలుసా..?
Recommended image2
Hyderabad లో రొమాన్స్ రోడ్లు..! ఈ ఓపెన్ రోడ్లను ఓయో రూంలు చేసేశారుగా..!
Recommended image3
ఆఫీసులో ప్రేమ‌లో ప‌డుతున్న వారి సంఖ్య ఎంతో తెలుసా.? స‌ర్వేలో ఆస‌క్తిక‌ర విష‌యాలు
Related Stories
Recommended image1
Facts: అమెరికాలో ఇళ్ల‌పై నీటి ట్యాంకులు ఎందుకు క‌నిపించ‌వో తెలుసా.?
Recommended image2
Raincoat: వర్షంలో బయటకు వెళ్తుంటారా.? ఈ బాల్ ఉంటే చాలు అస్స‌లు త‌డ‌వ‌రు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved