MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Raincoat: వర్షంలో బయటకు వెళ్తుంటారా.? ఈ బాల్ ఉంటే చాలు అస్స‌లు త‌డ‌వ‌రు

Raincoat: వర్షంలో బయటకు వెళ్తుంటారా.? ఈ బాల్ ఉంటే చాలు అస్స‌లు త‌డ‌వ‌రు

Raincoat: వర్షాకాలంలో ఎప్పుడు వర్షం పడుతుందో చెప్పడం కష్టం. బయటకు వెళ్లిన సమయంలో ఆకస్మికంగా వర్షం కురిస్తే తడవకుండా ఉండేందుకు ప్ర‌తీ చోటుకి రెయిన్ కోట్ తీసుకెళ్ల‌డం క‌ష్టం. అలాంటి వారి కోస‌మే అమెజాన్‌లో ఓ అద్భుత‌మైన ప్రొడ‌క్ట్ అందుబాటులో ఉంది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jun 12 2026, 09:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చిన్న బాల్‌లో రెయిన్‌కోట్
Image Credit : Amazon.in

చిన్న బాల్‌లో రెయిన్‌కోట్

మీటూ డిస్పోబుల్ ఎమ‌ర్జెన్సీ బాల్ రెయిన్ కోట్ (MeeTo Disposable Emergency Ball Raincoat) పేరుతో చిన్న బాల్ రూపంలో ఉండే ఈ రెయిన్‌కోట్‌ను బ్యాగ్, పర్స్ లేదా బెల్ట్‌కు తగిలించుకుని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ఈ ఉత్పత్తి ప్రత్యేకత దాని డిజైన్. సాధారణ రెయిన్‌కోట్‌ల మాదిరిగా ఎక్కువ స్థలం ఆక్రమించదు. చిన్న గుండ్రటి బాల్ ఆకారంలో ప్యాక్ చేస్తారు. అవసరం వచ్చినప్పుడు బాల్‌ను తెరిస్తే అందులో ఉన్న రెయిన్‌కోట్‌ను వెంటనే ఉపయోగించుకోవచ్చు. అందుకే దీనిని ఎమర్జెన్సీ రెయిన్‌కోట్‌గా పిలుస్తారు. ధర విషయానికొస్తే అమెజాన్ లో కేవలం రూ. 139కే అందుబాటులో ఉంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు..
Image Credit : Amazon.in

ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు..

ఈ రెయిన్‌కోట్ PVC మెటీరియల్‌తో త‌యారు చేస్తారు. నీరు లోపలికి రాకుండా రక్షణ కల్పిస్తుంది. బరువు చాలా తక్కువగా ఉండటంతో ప్రయాణాల్లో, ఆఫీస్‌కు వెళ్లేటప్పుడు, స్కూల్ బ్యాగ్‌లో లేదా ట్రెక్కింగ్ సమయంలో సులభంగా తీసుకెళ్లవచ్చు. కీచైన్ తరహా హుక్ ఉండటం వల్ల బ్యాక్‌ప్యాక్, హ్యాండ్‌బ్యాగ్ లేదా బెల్ట్‌కు తగిలించుకోవచ్చు.

Related Articles

Related image1
Facts: అమెరికాలో ఇళ్ల‌పై నీటి ట్యాంకులు ఎందుకు క‌నిపించ‌వో తెలుసా.?
Related image2
వాన‌కు త‌డుస్తాయి, ఎండ‌కు ఎండుతాయి.. అయినా రైలు ప‌ట్టాలు ఎందుకు తుప్పు ప‌ట్ట‌వో తెలుసా?
35
పురుషులు, మహిళలు ఇద్దరికీ సరిపోతుంది
Image Credit : Amazon.in

పురుషులు, మహిళలు ఇద్దరికీ సరిపోతుంది

ఈ రెయిన్‌కోట్ ఫ్రీ సైజ్‌లో అందుబాటులో ఉంటుంది. పురుషులు, మహిళలు ఇద్దరూ ఉపయోగించవచ్చు. హుడ్‌తో కూడిన డిజైన్ ఉండటం వల్ల తల, మెడ భాగాలు కూడా వర్షం నుంచి రక్షణ పొందుతాయి. ఎరుపు, పింక్, పసుపు, నీలం, తెలుపు, ఊదా వంటి ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది.

45
ఎలాంటి సందర్భాల్లో ఉపయోగపడుతుంది?
Image Credit : Amazon.in

ఎలాంటి సందర్భాల్లో ఉపయోగపడుతుంది?

ఈ ఎమర్జెన్సీ రెయిన్‌కోట్‌ను అనేక సందర్భాల్లో ఉపయోగించవచ్చు. ట్రావెలింగ్, ట్రెక్కింగ్, క్యాంపింగ్, సైక్లింగ్, ఫిషింగ్, జాగింగ్, స్పోర్ట్స్ ఈవెంట్స్, కచేరీలు, బహిరంగ కార్యక్రమాలు, థీమ్ పార్కులు, వాటర్ పార్కులు, ఆకస్మిక వర్షం పడినప్పుడు వెంటనే ధరించేందుకు ఇది మంచి ప్రత్యామ్నాయంగా ఉంటుంది.

55
పిల్లలు, ప్రయాణికులకు మంచి ఎంపిక
Image Credit : Amazon.in

పిల్లలు, ప్రయాణికులకు మంచి ఎంపిక

పిల్లలు స్కూల్‌కు వెళ్లేటప్పుడు లేదా కుటుంబంతో బయటకు వెళ్లినప్పుడు ఎప్పుడైనా వర్షం పడే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఈ బాల్ రెయిన్‌కోట్ ఉపయోగపడుతుంది. పెద్ద రెయిన్‌కోట్ మోసుకెళ్లాల్సిన అవసరం లేకుండా చిన్న బాల్ రూపంలో ఎప్పుడూ వెంట ఉంచుకోవచ్చు. తక్కువ స్థలం ఆక్రమించడం, తక్కువ బరువు, నీటి నిరోధకత వంటి లక్షణాలు దీనిని బెస్ట్ ప్రొడ‌క్ట్‌గా మార్చాయి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
జీవనశైలి
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
News Paper Reuse: పాత న్యూస్ పేపర్లు పారేస్తున్నారా? ఇంట్లో ఎన్ని రకాలుగా వాడొచ్చో తెలుసా?
Recommended image2
Balcony Decor: ఈ రాజస్థానీ థీమ్ వల్ల మీ బాల్కనీ లుక్కే మారిపోద్ది
Recommended image3
Litchi Benefits: ఎముకలు ధృడంగా ఉండాలంటే ఈ ఒక్క పండు తింటే చాలు
Related Stories
Recommended image1
Facts: అమెరికాలో ఇళ్ల‌పై నీటి ట్యాంకులు ఎందుకు క‌నిపించ‌వో తెలుసా.?
Recommended image2
వాన‌కు త‌డుస్తాయి, ఎండ‌కు ఎండుతాయి.. అయినా రైలు ప‌ట్టాలు ఎందుకు తుప్పు ప‌ట్ట‌వో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved