భార్యభర్తలంటే.. విరుష్క జోడిలా ఉండాలి..!
ఇద్దరూ.. ఒకరికరు మర్యాద ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. ప్రేమ పెరగొచ్చు.. తగ్గొచ్చు.. కానీ.. ఒకిరపై మరొకరు ఇచ్చిపుచ్చుకునే గౌరవం మాత్రం ఎప్పుడూ అలానే ఉంటుంది.
భార్యభర్తలంటే ఇలా ఉండాలి.. అలా ఉండాలి అని అందరూ చెబుతుంటారు. కానీ పర్ఫెక్ట్ కపుల్ కి ఉదాహరణగా చెప్పాలంటే మాత్రం విరాట్, అనుష్కల పేర్లే చెప్పాలి. ఏ జంటైనా.. వీరిని ఫాలో అయితే.. ఎలాంటి అరమరికలు లేకుండా ఆనందంగా ఉండొచ్చు. ఇంతకీ ఈ విరుష్క జోడి నుంచి ప్రతి కపుల్ ఏం నేర్చుకోవచ్చో ఓసారి చూసేద్దామా.
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు ఇద్దరూ పెద్ద సెలబ్రెటీలు. ఎప్పుడూ వారి వారి పనుల్లో బిజీగా ఉంటారు. అయినా.. పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే మాత్రం ఇద్దరూ.. పబ్లిక్ ఫిగర్లు అయినా.. ప్రైవసీ మొయిన్ టైన్ చేస్తుంటారు. ఇదే వీరి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. వారి వ్యక్తిగత జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారు. ఎవరినీ వారి జీవితంలోకి రానివ్వరు.
నిజమైన రిలేషన్ షిప్ కి.. ఒకరొకరు తోడు ఉన్నామనే భావన ఉండాలి. ఈ విషయంలో.. విరాట్, అనుష్క ల నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. వీరిద్దరి ప్రతి విషయంలోనూ ఒకరికొకరు తోడుగా ఉంటారు.
అంతేకాదు.. ఇద్దరూ.. ఒకరికరు మర్యాద ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. ప్రేమ పెరగొచ్చు.. తగ్గొచ్చు.. కానీ.. ఒకిరపై మరొకరు ఇచ్చిపుచ్చుకునే గౌరవం మాత్రం ఎప్పుడూ అలానే ఉంటుంది.
అనుష్క, విరాట్ లు ఎక్కడికి వెళ్లినా.. ఇద్దరూ కలిసి ప్రయాణం చేస్తారు. ఒకవేళ కుదరకపోతే.. ఒకరు ముందు వెళ్లినా.. మరొకరు అక్కడకు చేరుకుంటారు. అక్కడ దొరికిన సమయంలో.. ఇద్దరూ కలిసి ప్రయాణిస్తుంటారు. ఇలా చేయడం వల్ల బంధం మరింత బలపడుతుంది.
విరుష్క జోడి.. ఒకరికొకరు క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తుంటారు. అలా చేయడం వల్ల.. ఇద్దరి మధ్య బంధం మరింత బలపడే అవకాశం ఉంటుంది.
చాలా మంది ఆలోచించరు. కానీ.. ఇది దంపతులకు చాలా ముఖ్యం. ఒకరిని మరొకరు ఎంకరేజ్ చేసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా పబ్లిక్ లో ఉన్నప్పుడు.. ఈ విషయంలో కరెక్ట్ గా ఉండాలాి. దాని వల్ల వారిలో కాన్ఫిడెన్స్ పెంచినవారు అవుతారు.
ఇక.. దంపతులు.. తమ పార్ట్ నర్ తమకు అన్ని విషయాల్లో తోడు ఉంటారు అనే నమ్మకం కలిగినప్పుడు.. వారి బంధంలో ఇన్ సెక్యురిటీ ఫీలింగ్స్ అనేవి రాకుండా ఉంటాయి. బంధం బలపడుతుంది.
ముఖ్యంగా.. దంపతుల మధ్య పారదర్శకత ఉండాలి. ఇద్దరూ ఆనందంగా ఉండాలి. సంతోషంగా నవ్వుతూ ఉండాలి. ఇద్దరూ ఒకరి కోసం మరొకరు అన్నట్లుగా బతకాలి.
అంతేకాకుండా.. ఇద్దరూ వేర్వేరు విభాగాల్లో ప్రొఫెనల్స్.. ఈ నేపథ్యంలో.. వీరు తమ పార్ట్నర్స్ ని, వారు చేస పనిని కూడా గుర్తించాలి. గౌరవించాలి. అప్పుడే.. వారు ఆనందంగా ఉంటారు.