సెక్స్: వీళ్లంతా కలయికకు ఎందుకు దూరమౌతున్నారు..?
రోటీన్ లైఫ్ లో పడిపోయి.. ఉదయం లేవడం, తినడం, బ్రష్ చేసుకోవడం, స్నానం చేయడం లాగానే.. సెక్స్ ని కూడా రోటీన్ చేసుకోవడం వల్ల కలయిక పట్ల ఆసక్తి తగ్గిపోతుందట.
sex life
పెళ్లైన కొత్తలో శృంగారం పట్ల అందరికీ ఆసక్తి ఉంటుంది. ప్రతి నిమిషం ఈ విషయం గురించే ఆలోచించడం లాంటివి చేస్తుంటారు. ఆ సమయంలో ఇదొక థ్రిల్ ఫీలింగ్ కలిగిస్తుంది. ఇంట్లో అందరూ ఉన్నా రహస్యంగా మాట్లాడుకోవాలని ప్రయత్నించడం.. చాటుగా రొమాన్స్ చేయడం లాంటివి చేయాలని పరితపిస్తుంటారు.
ఆ తర్వాత.. కొన్నేళ్లకు.. ఇంట్లో దంపతులు మాత్రమే ఉన్నా.. వారి మధ్య నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. ఇద్దరి మధ్య గడపడానికి ఎంత ఏకాంత సమయం ఉన్నా.. వారు దానిని వినియోగించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో.. దంపతుల మధ్య ఎడబాటు పెరిగిపోతోంది. అసలు.. దంపతులంతా.. శృంగారాన్ని ఎందుకు దూరం పెడుతున్నారు..? దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం..
sex
సెక్స్ లైఫ్ కి దంపతులు దూరం కావడానికి.. వారి రోటీన్ లైఫ్ కూడా కారణమట. రోటీన్ లైఫ్ లో పడిపోయి.. ఉదయం లేవడం, తినడం, బ్రష్ చేసుకోవడం, స్నానం చేయడం లాగానే.. సెక్స్ ని కూడా రోటీన్ చేసుకోవడం వల్ల కలయిక పట్ల ఆసక్తి తగ్గిపోతుందట.
sex
కొందరికీ సెక్స్ విషయంలో రోజు రోజుకీ ఉత్సాహం తగ్గిపోవడం వల్ల కూడా ఇలా పూర్తిగా దూరం పెట్టేస్తారట. ఫోర్ ప్లేకి చోటు ఇవ్వకుండా.. కేవలం సెక్స్ కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల కూడా దంపతులు కలయిక లో పాల్గొనడం పూర్తిగా తగ్గించేస్తున్నారట.
ఇక కొందరి ఇంట్లో పిల్లలు, పెద్దవాళ్లు ఉంటారు. ఈ నేపథ్యంలో.. ఎక్కడ తమ కలియికను పిల్లలు చూసేస్తారా అని కొందరు.. గది దాటి బయటకు ఎక్కడ పెద్దవాళ్లకు వినపడుతుందా అని మరి కొందరు.. సెక్స్ విషయంలో దూరంగా ఉంటారట. కలయికలో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నా.. పరిస్థితులు కుదరక కలయిక ను దూరం పెడుతున్నారట.
కొందరు దంపతులు.. పిల్లలు పుట్టకుండా ఉండేందుకు బర్త్ కంట్రోల్ పిల్స్ వాడుతూ ఉంటారు. అయితే.. ఆ ట్యాబ్లెట్స్ కారణంగా కూడా సెక్స్ పట్ల ఆసక్తి తగ్గిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చాలా మంది ఒప్పుకోని నిజం ఏమిటంటే.. పెళ్లి తర్వాత.. సెక్స్ కారణంగా తమ శరీరంలో మార్పులు చోటుచేసుకుంటాయని అనుకుంటారట. అందుకే ఫిట్ గా ఉండాలని జిమ్ వెంట పరుగులు తీస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే సెక్స్ కి దూరంగా ఉండాలని ప్రయత్నిస్తుంటారట. ఇది కూడా దంపతులు సెక్స్ లైఫ్ కి దూరం కావడానికి కారణమౌతుందట.