Relationship: మంచి భర్తను కోరుకుంటున్నారా.. అయితే ఈ లక్షణాలు మీలో ఉన్నాయా?
Relationship: మంచి భార్యకి ఉండవలసిన లక్షణాలను గురించే పురాణాలలో చెప్పారు కానీ మంచి భర్తకి ఉండవలసిన లక్షణాలను గురించి చెప్పలేదు. కానీ మంచి భర్త అవ్వాలంటే ఈ లక్షణాలు మీలో లేకుండా చూసుకోమంటున్నారు రిలేషన్ ఎక్స్పర్ట్స్ అవి ఏంటో చూద్దాం.
దాంపత్య జీవితంలో ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ముందుకు సాగుతుంటేనే సంసారం సాఫీగా సాగుతుంది. ఒకరి కోసం మరొకరు అనే ఫీలింగ్ తో సంసారం చేస్తేనే ఆ కాపురం కలకాలం నిలబడుతుంది. కాపురం నిలబడటం కోసం భార్యలోనే కాదు భర్తలో కూడా మంచి లక్షణాలు ఉండాలి.
ఒక మంచి భర్త లో ఎలాంటి లక్షణాలు ఉండకూడదో చెప్తున్నారు రిలేషన్ ఎక్స్పర్ట్స్ అవేంటో చూద్దాం. ఒక భార్య తన భర్త దగ్గర నుంచి నిజాయితీని, గౌరవాన్ని కోరుకుంటుంది. నిజంగా మీరు ఒక మంచి భర్త అనిపించుకోవాలి అంటే మీ భార్యతో నిజాయితీగా ప్రవర్తించండి.
ఆమెని, ఆమె మాటని గౌరవించండి. నిజాయితీగా లేని ఒక భర్తని ఏ ఆడది అంతా సులువుగా యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి భార్య అంటే లక్ష్యం లేకపోవడం, ఆమెని గౌరవించకపోవడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే మార్చుకోండి. అలాగే మగవాడిలో మెచ్యూరిటీ మెంటాలిటీ లేకపోతే ఆ సంసారం ఒడిదుడుకులలో పడుతుంది.
ప్రతి విషయాన్ని మెచ్యూర్డ్ గా ఆలోచించకుండా కన్ఫ్యూజ్ అయ్యే భర్త ఆ సంసారానికి న్యాయం చేయలేడు కాబట్టి మెచ్యూరిటీగా ఉండటానికి ప్రయత్నించండి. ఒక మంచి భర్తకి ఫ్యూచర్ ప్లానింగ్ చాలా అవసరం ఎందుకంటే తన భార్యకి భవిష్యత్తులో భద్రత కల్పించవలసిన బాధ్యత ఆ భర్తదే.
ఇక వీటన్నింటి కన్నా ముఖ్యమైనది తన భార్యకి అన్నివేళలా సపోర్టుగా ఉండడం. ఒక ఆడదానికి తన భర్త అవసరం అయినప్పుడు సపోర్టు ఇవ్వకపోతే అతను ఎన్నటికీ మంచి భర్త కాలేడు. కాబట్టి మీ భార్యకి అన్నివేళలా నేనున్నాను అనే ధైర్యాన్ని ఇచ్చి మంచి భర్త అవ్వండి.
Image: Getty Images
ఒక ఆడది తను కష్టంలో ఉన్నప్పుడు తన భర్త చేతి సాయం కోరుకుంటుంది. భార్యని తన మానాన తనని వదిలేయకుండా ఆమెకి కాస్త చేతి సాయం అందిస్తే ఖచ్చితంగా మీ భార్య మిమ్మల్ని మెచ్చుకుంటుంది. మంచి భర్త అంటుంది.