రోజు చేస్తున్నా సంతానం కలగడం లేదా.. అయితే మీరు ఏం తప్పులు చేస్తున్నారో తెలుసుకోండి!
పెళ్లయి చాలా సంవత్సరాలు గడిచినా పిల్లలు పుట్టకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే పిల్లలు పుట్టకపోవడానికి భార్య భర్తలిద్దరి బాధ్యత (Responsibility) ఉంటుంది.
తాజాగా ఒక సంస్థ చేపట్టిన పరిశోధనలో (Research) మొదట పురుషుడిలోని వీర్యకణాల సంఖ్యను పరీక్షించగా 15 మిలియన్ల వరకూ ఉన్నాయని తేలింది. కానీ కొన్ని రోజుల క్రితం రెండోసారి వీర్యపరీక్ష (Semen test) చేయించినప్పుడు, రెండు మిలియన్లకు వీర్యకణాల సంఖ్య పడిపోయినట్టు తేలింది. అయితే ఇంతలో వీర్యకణాల సంఖ్య తగ్గిపోవడానికి కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఆయనకు కొంతకాలం కిందట దగ్గు, జలుబు వంటి కరోనా లక్షణాలు (Corona features) కనిపించి వాటంతట అవి తగ్గిపోయాయి. అయితే వీర్య కణాల సంఖ్య కరోనా ఇన్ఫెక్షన్ కి మధ్య సంబంధం ఉందా అని పరిశోధనలు చేపట్టారు. కానీ ఈ పరిశోధనలో తేలింది ఏమనగా కరోనాకి వీర్యకణాల సంఖ్య తగ్గడానికి సంబంధం లేదని తేలింది. అయితే మరొకసారి చేపట్టిన పరిశోధనలో వృషణాలపైన (Testicles) కరోనా ప్రభావం కొంత వరకు ఉందని తేలింది.
వీటి కారణంగా కొంత వరకు వీర్యకణాల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే సరైన స్పష్టత (Clarity) అనేది లేదు. కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన పురుషులకు శారీరక శ్రమ, వ్యాయామం లేకపోవడం కూడా వారిలో పురుష వీర్యకణాల సంఖ్య తగ్గే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. పురుషులు ఇంటికే పరిమితం కావడంతో వారిలో హార్మోన్ల లోపం (Hormonal deficiency), విటమిన్ డి లోపం ఏర్పడి వీర్యకణాల సంఖ్య తగ్గే అవకాశం కూడా ఉంటుంది.
కాబట్టి విటమిన్ సప్లిమెంట్లు (Vitamin Supplements) వాడుతూ, వీర్యకణాల వృద్ధికి మందులు కూడా వాడవలసి ఉంటుంది. అయితే పురుషులు మద్యపానం, ధూమపానం వంటి చెడు అలవాట్లకు (Bad habits) మానుకుని సరైన చికిత్స తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే పురుషులలో వీర్యకణాల సంఖ్య వృద్ధికి రోజూ కొంత సమయం యోగ చేయడం తప్పనిసరి అని వైద్యులు చెబుతున్నారు.
నిత్యం యోగా (Yoga) చేస్తే మందుల వాడకం లేకుండా సహజసిద్ధమైన పద్ధతిలో పురుషులలో వీర్యకణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని తాజాగా ఒక సంస్థ చేపట్టిన పరిశోధనలో తేలింది. దీంతో మహిళ గర్భందాల్చి పండంటి బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉంటుంది. వారు సంతాన ప్రాప్తిని (Parental access) పొందగలుగుతారు.