MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • పిల్లల కోసం హెల్తీ లంచ్ బాక్స్ ఐడియాస్ ఇవిగో..!

పిల్లల కోసం హెల్తీ లంచ్ బాక్స్ ఐడియాస్ ఇవిగో..!

పిల్లలు ఆరోగ్యంగా పెరగాలంటే పోషకాలతో కూడిన ఆహారం ఇవ్వడం అవసరం. ముఖ్యంగా మధ్యాహ్న భోజనం పిల్లల ఎదుగుదలపై ఎక్కువ ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి పిల్లలకు మధ్యాహ్నం ఎలాంటి ఫుడ్ పెట్టాలో.. ఏది పెట్టకూడదో ఇక్కడ చూద్దాం. 

2 Min read
Author : Kavitha G
Published : Nov 20 2025, 06:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
హెల్తీ లంచ్ బాక్స్ ఐడియాస్
Image Credit : Getty

హెల్తీ లంచ్ బాక్స్ ఐడియాస్

పిల్లల ఆరోగ్య వికాసానికి రోజువారీ లంచ్ బాక్స్ ఎంతో కీలకమైనది. పిల్లల శరీరానికి అవసరమైన శక్తి, మేథస్సు, రోగనిరోధక శక్తి వంటివి మధ్యాహ్నం తీసుకునే ఆహారంతో నేరుగా సంబంధం కలిగి ఉంటాయి. ప్రత్యేకించి స్కూల్‌కు వెళ్లే సమయంలో పిల్లలు ఎక్కువ సమయం బయట గడుపుతారు కాబట్టి, సరైన పోషణతో కూడిన లంచ్ బాక్స్ వారి శరీరానికి నిరంతర శక్తినిచ్చి, చదువుపై దృష్టి నిలకడగా ఉండేలా చేస్తుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఈ సమస్యలు దూరం..
Image Credit : Getty

ఈ సమస్యలు దూరం..

సాధారణంగా పిల్లలు ప్రాసెస్డ్ స్నాక్స్‌కి ఎక్కువగా ఆకర్షితులవుతారు. కానీ ఇంట్లో తయారు చేసిన హెల్తీ లంచ్ బాక్స్.. వారి శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. అంతేకాదు అలసట, జీర్ణ సమస్యలు, ఏకాగ్రత లోపం, తరచూ ఆకలి వేయడం వంటి సమస్యలను దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

Related Articles

Related image1
పిల్లల బ్రెయిన్ చురుకుగా పనిచేయాలంటే పేరెంట్స్ ఏం చేయాలో తెలుసా?
Related image2
పిల్లలకు హార్ట్ ఎటాక్ రావడానికి కారణాలు ఏంటో తెలుసా?
36
పోషకాలతో కూడిన ఆహారం
Image Credit : Getty

పోషకాలతో కూడిన ఆహారం

హెల్తీ లంచ్ బాక్స్ అంటే ఒకటి, రెండు మంచి ఐటమ్స్ పెట్టడం కాదు. పిల్లల శరీరానికి అవసరమైన పోషకాలను సమతుల్యంగా ఇవ్వడం. పోషకాహార నిపుణుల ప్రకారం.. ఒక లంచ్ బాక్స్‌లో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు అన్నీ ఉండటం ముఖ్యం. కార్బోహైడ్రేట్లు పిల్లలకు తక్షణ శక్తినిస్తాయి. ప్రోటీన్లు ఆసక్తిని పెంచడానికి, శరీర వికాసానికి సహాయపడతాయి. ఫైబర్ పుష్కలంగా ఉన్న ఆహారాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మంచి ఫ్యాట్స్ మెదడు అభివృద్ధికి తోడ్పడుతాయి. 

46
లంచ్ బాక్స్ లో ఏం పెట్టాలంటే?
Image Credit : Getty

లంచ్ బాక్స్ లో ఏం పెట్టాలంటే?

పిల్లల లంచ్ బాక్స్ లో చపాతీ, అన్నం, ఉప్మా, బ్రౌన్ రైస్, పప్పు, పెరుగు, పచ్చి కూరగాయలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ వంటివి పెట్టాలి. ఇవి పిల్లల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా ఇష్టపడే వేయించిన పదార్థాలు, అధిక ఉప్పు, చక్కెర ఉన్న ప్యాకేజ్డ్ స్నాక్స్‌ను వీలైనంతవరకు తగ్గించడం మంచిదని సూచిస్తున్నారు. ఇవి తాత్కాలిక రుచినిచ్చినా.. శరీరానికి కావాల్సిన పోషకాలను  అందించలేవని చెబుతున్నారు.

56
ఫుడ్ కాంబినేషన్స్
Image Credit : istock

ఫుడ్ కాంబినేషన్స్

పిల్లల కోసం హెల్తీ లంచ్ బాక్స్ సిద్ధం చేయడం అంత కష్టమేమి కాదు.. సరైన కాంబినేషన్లు తెలుసుకుంటే చాలు. సింపుల్ కార్బ్స్ + ప్రోటీన్ అంటే గోధుమ రొట్టెతో పన్నీర్ కర్రీ, లేదా బ్రౌన్ రైస్‌తో పప్పు వంటివి తేలికగా జీర్ణమవుతాయి. దీర్ఘకాలిక శక్తిని ఇస్తాయి. అలాగే ఫైబర్ రిచ్ సైడ్స్ ఇవ్వడం చాలా ముఖ్యం. చిన్న బాక్సులో కీర, క్యారెట్ స్టిక్స్, ఉడకబెట్టిన గింజలు, లేదా సీజనల్ ఫ్రూట్ పెట్టడం వల్ల పిల్లలు సహజమైన విటమిన్లు, మినరల్స్ పొందుతారు. వాటితో పాటు తక్కువ మొత్తంలో నట్స్ లేదా డ్రై ఫ్రూట్స్ పెట్టొచ్చు. ఇవి మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.  

66
ఇంట్లో చేసే స్నాక్స్
Image Credit : Asianet News

ఇంట్లో చేసే స్నాక్స్

లంచ్ బాక్స్ రెడీ చేసేటప్పుడు.. పిల్లలు ఇష్టపడే రుచిని కూడా దృష్టిలో ఉంచుకోవడం ముఖ్యం. కాబట్టి ఇంట్లోనే తక్కువ నూనెతో తయారు చేసిన హెల్తీ స్నాక్స్ వారానికి ఒకటి రెండు సార్లు ఇవ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు. చిన్న చిన్న కాంబినేషన్ల ద్వారా పిల్లలకు శక్తి, రుచి, పోషకాలు అన్నింటినీ సమతుల్యంగా అందించడమే లంచ్ బాక్స్ లక్ష్యం కావాలని సూచిస్తున్నారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
చిన్నారుల సంరక్షణ
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting: మగ పిల్లలకు తల్లి చెప్పాల్సిన 7 లైఫ్ లెసెన్స్.. జీవితాన్నే మార్చేస్తాయి..!
Recommended image2
Pregnancy Symptoms: కిట్ లేకుండానే ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో ఈ 5 లక్షణాల బట్టి చెప్పేయొచ్చు
Recommended image3
Parenting Tips: మీ పిల్లలు బూతులు మాట్లాడితే లైట్ తీసుకుంటున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి
Related Stories
Recommended image1
పిల్లల బ్రెయిన్ చురుకుగా పనిచేయాలంటే పేరెంట్స్ ఏం చేయాలో తెలుసా?
Recommended image2
పిల్లలకు హార్ట్ ఎటాక్ రావడానికి కారణాలు ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved