పరీక్షలు దగ్గర పడుతున్నప్పుడు విద్యార్థులు రాత్రి చదవాలా లేక ఉదయం చదవాలా అని ఆలోచిస్తారు. ఎప్పుడు చదివితే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయో చూద్దాం..
ఉదయం పూట నిద్రలేచాక మెదడు చాలా ఫ్రెష్‌గా, చురుకుగా ఉంటుంది. ఈ సమయంలో చదివినవి త్వరగా గుర్తుంటాయి, ఏకాగ్రత కూడా బాగుంటుంది.
ఉదయం పూట వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది, దీనివల్ల కష్టమైన టాపిక్స్ సులభంగా అర్థమవుతాయి. రోజంతా దినచర్య బలంగా ఉంటుంది, రివిజన్ కూడా త్వరగా పూర్తవుతుంది.
ఉదయం ఏకాగ్రత కుదరని విద్యార్థులు రాత్రిపూట బాగా ఫోకస్ చేయగలరు. రాత్రి సమయం ప్రశాంతంగా ఉండటం వల్ల ఎక్కువసేపు చదవడం సులభం.
రాత్రిళ్లు మేల్కొని ఉండే విద్యార్థులకు రాత్రి చదువు ఉత్తమం. పగటిపూట సమయం దొరకని వారికి, రాత్రిపూట ఏకాగ్రత బాగా కుదిరే వారికి ఇది మంచిది.
ఉదయం మీ మెదడు చురుకుగా ఉంటే, మార్నింగ్ స్టడీ ఉత్తమం. రాత్రిపూట ఏకాగ్రత బాగుంటే, నైట్ స్టడీ మీకు సరైనది.
విద్యార్థులు రాత్రి చదివినా, ఉదయం చదివినా 7-8 గంటల నిద్ర అవసరం. నిద్ర సరిగ్గా ఉంటేనే మెదడు చదివిన విషయాలను గ్రహించగలదు.
రెండు సమయాలు మంచివే, కానీ ఉదయం చదువు కొంచెం ఎక్కువ ప్రభావవంతంగా పరిగణిస్తారు. అయినా, మీరు ఏ సమయంలో బాగా ఏకాగ్రత పెట్టగలరనేది ముఖ్యం. ఆ సమయాన్నే మీ స్టడీ రొటీన్‌గా చేసుకోండి.