- Home
- Life
- Pregnancy & Parenting
- Parenting Tips: తండ్రి దగ్గర నుంచి పిల్లలు ఏం నేర్చుకుంటారు? పిల్లల ముందు తండ్రి ఎలా ఉండాలి?
Parenting Tips: తండ్రి దగ్గర నుంచి పిల్లలు ఏం నేర్చుకుంటారు? పిల్లల ముందు తండ్రి ఎలా ఉండాలి?
Parenting Tips: ఇంటి వాతావరణం ఎంత ఆరోగ్యకరంగా ఉంటే, పిల్లల మానసిక ఆరోగ్యం కూడా అంత బలంగా ఉంటుంది. ప్రత్యేకించి తండ్రి పిల్లల ముందు ఎలా ప్రవర్తిస్తారో, అవే పిల్లలు జీవితాంతం అనుసరించే పద్ధతులు అవుతాయి.

Parenting Tips
పిల్లలకు తండ్రి మొదటి హీరో అని చెప్పొచ్చు. తండ్రిని చూసి పిల్లలు చాలా ఎక్కువగా ప్రభావితమౌతారు. ఇంట్లో నాన్న చేసే ప్రతి పనీ, మాట్లాడే తీరు, వారి అలవాట్లు అన్నీ పిల్లల మెదడులో నాటుకుపోతాయి. తండ్రి అంటే కేవలం ఆదాయం తెచ్చే వ్యక్తి మాత్రమే కాదు, ఇంట్లో విలువలు, నైతికత, క్రమశిక్షణ, ధైర్యం, ప్రేమ అన్నీ వారి దగ్గరి నుంచే నేర్చుకోవడానికి వారు ప్రయత్నిస్తారు. కాబట్టి.. పిల్లల ఎదుగుదల, ప్రవర్తన, భవిష్యత్తు నిర్మాణం ప్రధానంగా తండ్రి ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది.
1.తండ్రి నుంచి మొదట నేర్చుకునేది ఇదే...
పిల్లలు మాటల కంటే ముందు ప్రవర్తన నేర్చుకుంటారు. తండ్రి ఎలా మాట్లాడుతున్నాడు? ఎలా తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటన్నాడు..? ఎలాంటి సందర్భాల్లో ఓర్పుతో ఉంటున్నాడు అనే విషయాలను పిల్లలు గమనిస్తారు. వాటినే అనుకరించడానికి కూడా ప్రయత్నిస్తారు.
నిజాయితీ, బాధ్యత, దయ, సమయపాలన, క్రమశిక్షణ లాంటి లక్షణాలు కూడా చిన్నప్పటి నుంచే తండ్రిని చూసి పిల్లలు నేర్చుకునే అవకాశం ఉంది.
ఆత్మ విశ్వాసం...
వారు చేసే ప్రతి చిన్న పనిని తండ్రి ప్రశంసిస్తే... పిల్లలు చాలా పొంగిపోతారు. ఆ ప్రశంస వారిలో ఆత్మ విశ్వాసాన్ని నింపుతుంది. అలా కాకుండా.. వారు చేసే ప్రతి పనిలోనూ తండ్రి తప్పులు వెతుకుతూ ఉంటే... విమర్శిస్తూ ఉంటే... పిల్లలు భయపడే స్వభావాన్ని ఎక్కువగా అభివృద్ధి చేసుకుంటారు.
3. కోపం, అరిచే తీరు, కొట్టడం..
ఇంట్లో ప్రతి చిన్న విషయానికి తండ్రి కోపం చూపించడం, అరవడం, కొట్టడం లాంటివి చేస్తే... దాని ప్రభావం కూడా పిల్లలపై చాలా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల పిల్లల్లో భయం పెరుగుతుంది. అసురక్షిత భావం పెరుగుతుంది.అంతేకాకుండా.. హింసను చాలా సాధారణంగా భావిస్తారు. వారు కూడా ఇతరులతో ఇలానే ప్రవర్తించే అవకాశం ఉంది. ముఖ్యంగా మగ పిల్లలు తండ్రి నుంచి వీటిని అనుకరించాలని అనుకుంటారు. అందువల్ల తండ్రి కోపంగా ఉంటే, పిల్లలు కూడా భవిష్యత్తులో అదే ప్రవర్తన చూపే అవకాశం ఉంటుంది.
అలాగే, తండ్రి తల్లిని గౌరవంగా చూస్తే, పిల్లలు కూడా భవిష్యత్తులో.. మహిళలను గౌరవించడం, ఇంట్లో సహాయపడటం, ప్రేమతో మాట్లాడటం నేర్చుకుంటారు.
తండ్రి పిల్లల ముందు ఎలా ప్రవర్తించాలి?
ప్రేమతో మాట్లాడాలి..పిల్లలతో కఠినంగా కాకుండా, ధైర్యం ఇవ్వే విధంగా మాట్లాడాలి.
భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. అంటే... పిల్లల ముందు కోపం, అసహనం, అసభ్యకర పదజాలం వాడటం లాంటివి చేయకూడదు.
తల్లిని గౌరవించాలి.ఇది పిల్లలకు ఇచ్చే గొప్ప పాఠం. పిల్లలు కుటుంబాన్ని ఎలా చూడాలో తండ్రి నుంచి నేర్చుకుంటారు.
పిల్లలు మంచి అలవాట్లు నేర్చకోవాలి అంటే.. ముందు తండ్రి పాఠించాలి. పుస్తకాలు చదవడం, వ్యాయామం చేయడం కూడా పిల్లలు పేరెంట్స్ నుంచి నేర్చుకుంటారు. అంతేకాదు.. తండ్రి తమ పనులతో ఎంత బిజీగా ఉన్నా కూడా కచ్చితంగా పిల్లలకు కొంచెం సమయం కేటాయించాలి.

