MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • సాయి ష్యూర్ మల్టీ న్యూట్రిషియన్ డ్రింక్.. ఎలా తయారుచేస్తారు..? తాగితే ఇన్ని హెల్త్ బెనిఫిట్సా..!

సాయి ష్యూర్ మల్టీ న్యూట్రిషియన్ డ్రింక్.. ఎలా తయారుచేస్తారు..? తాగితే ఇన్ని హెల్త్ బెనిఫిట్సా..!

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో స్కూల్ విద్యార్థులకు సాయి ష్యూర్ న్యూట్రిషియన్ డ్రింక్ అందిస్తోంది శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్. అసలు ఏమిటీ డ్రింక్..? ఇందులో వాడే పధార్థాలేంటి..? ఇది తాగడంవల్ల కలిగే లాభాలేంటి..? ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Arun Kumar P
Published : Feb 14 2026, 08:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కోటి మందికి సాయి ష్యూర్ న్యూట్రిషన్ డ్రింక్...
Image Credit : Sri Sathya Sai Annapoorna Trust

కోటి మందికి సాయి ష్యూర్ న్యూట్రిషన్ డ్రింక్...

పోషకాహార లోపం చిన్నారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది... వారి శరీరానికి సరైన పోషకాలు లభించకుంటే భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవు. అయితే ప్రస్తుతం భారతదేశంలో పేదరికం కారణంగా చాలామంది పిల్లలకు పోషకాహారం లభించడంలేదు... ఇది ఇలాగే కొనసాగితే యువతరం నిర్వీర్యం అవుతుంది. అందుకే ప్రభుత్వాలు స్కూళ్లలో మధ్యాహ్న భోజనం వంటి పథకాల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నాయి. అలాగే కొన్ని ప్రైవేట్ స్వచ్చంద సంస్థలు కూడా పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని తగ్గించేందుకు తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. అలాంటిది 'వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్'' ఏర్పాటుచేసిన శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్.

ఈ ట్రస్ట్ ద్వారా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాల్లో చిన్నారులకు పోషకాహారం అందిస్తున్నారు. ప్రస్తుతం రోజూ కోటి మందికిపైగా బడి పిల్లలకు సాయి ష్యూర్ మల్టీ న్యూట్రిషియన్ డ్రింక్ ద్వారా ఆరోగ్య భాగ్యాన్ని కల్పిస్తోంది. ఈ సేవలు దేశంలో 25 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లో సుమారు 1.5 లక్షల పాఠశాలలకు విస్తరించింది సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24
ఏమిటీ సాయి ష్యూర్ మల్టీ న్యూట్రిషియన్ డ్రింక్..?
Image Credit : Sri Sathya Sai Annapoorna Trust

ఏమిటీ సాయి ష్యూర్ మల్టీ న్యూట్రిషియన్ డ్రింక్..?

సాయి ష్యూర్ న్యూట్రీషియన్ డ్రింక్ అనేది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే పోషకాహారం. దీన్ని శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ అందిస్తోంది. ఇందులో పిల్లల ఎదుగుదల, ఆరోగ్యానికి తోడ్పడే అనేక పోషకాలు ఉంటాయి. మెరుగైన భవిష్యత్ తరాన్ని నిర్మించేందుకే ఈ డ్రింక్ అందిస్తున్నట్లు వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ వ్యవస్థాపకులు సద్గురు మధుసూదన్ సాయి చెబుతున్నారు.

ఈ సాయి ష్యూర్ మల్టీ న్యూట్రీషియన్ డ్రింక్ లో వాడే పదార్థాలు..

రాగి పిండి

ఉప్పు

దాల్చిన చెక్క

వరి పిండి

పసుపు

మినరల్ ప్రీ మిక్స్

విటమిన్ ప్రీ మిక్స్

Related Articles

Related image1
Food: అంగ‌న్వాడీ బాలామృతంతో అదిరిపోయే బిస్కెట్స్‌.. ఇది తెలిస్తే ఇక‌పై చచ్చినా ప‌డేయ‌రు
Related image2
Junk Food Skin Effects: 30 రోజులు జంక్ ఫుడ్ మానేస్తే మీ ముఖంలో కనిపించే 5 మార్పులు ఇవే!
34
సాయి ష్యూర్ మల్టీ న్యూట్రీషియన్ ఉపయోగాలు
Image Credit : Sri Sathya Sai Annapoorna Trust

సాయి ష్యూర్ మల్టీ న్యూట్రీషియన్ ఉపయోగాలు

శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ అందిస్తున్న సాయి ష్యూర్ మల్టీ న్యూట్రిషియన్ డ్రింక్ వల్ల పిల్లలకు అనేక హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా పిల్లల్లో రోగ నిరోదక శక్తిని పెంపొందించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది... తద్వారా చిన్నారులు సంపూర్ణ ఆరోగ్యంతో ఎదుగుతారు.

ఇక సాయి ష్యూర్ డ్రింక్ పిల్లల్లో ఎముకల బలాన్ని పెంచుతుంది. శరీరానికి ఉపయోగపడే జింక్, బి12 వంటి విటమిన్లను సరిపడా అందిస్తుంది. RDA (Recommended Dietary Allowances) సిఫారసు చేసిన మైక్రో న్యూట్రియంట్స్‌లో 50 శాతం అందిస్తుంది. ఇలా ఎదిగే పిల్లలకు ఉపయోగపడే అన్నిరకాల పోషకాలు ఈ సాయి ష్యూర్ మల్టీ న్యూట్రిషియన్ డ్రింక్ లో పుష్కలంగా ఉంటాయి.

44
ఎలా అందిస్తారు..?
Image Credit : Getty

ఎలా అందిస్తారు..?

వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ ఈ సాయి ష్యూర్ మల్టీ న్యూట్రిషియన్ డ్రింక్ ఉచితంగా అందిస్తోంది. దేశవ్యాప్తంగా దాదాపు కోటిమందికి పైగా చిన్నారులకు ప్రతిరోజు అందిస్తున్నారు. పాఠశాలల్లో ప్రభుత్వం అందించే పాలు లేదా బెల్లంతో కలిపి దీనిని ఇస్తారు. పూర్తి పోషకాహారంతో కూడిన ఈ మిశ్రమాన్ని దేశంలో ఎక్కడికైనా సరఫరా చెయ్యడం సులభం... అందుకే దేశవ్యాప్తంగా అనేక స్కూళ్లకు అందిస్తున్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆహారం
ఆరోగ్యం
విద్య
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
భారత దేశం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Petrol Diesel Price: భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇప్పుడే ఎందుకు పెంచారు? కారణాలు చూస్తే షాక్ అవుతారు !
Recommended image2
Now Playing
VD Satheesan Visits: అనంత పద్మనాభస్వామి ఆలయానికి కేరళ కాబోయే సీఎం VD సతీశన్ | Asianet News Telugu
Recommended image3
Now Playing
కేరళంకు కొత్త సీఎం.. ఎవరీ VD సతీశన్ | Keralam New CM VD Satheeshan story | Asianet News Telugu
Related Stories
Recommended image1
Food: అంగ‌న్వాడీ బాలామృతంతో అదిరిపోయే బిస్కెట్స్‌.. ఇది తెలిస్తే ఇక‌పై చచ్చినా ప‌డేయ‌రు
Recommended image2
Junk Food Skin Effects: 30 రోజులు జంక్ ఫుడ్ మానేస్తే మీ ముఖంలో కనిపించే 5 మార్పులు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved