MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • National
  • JEE Main 2026 : అమ్మ త్యాగం చేసింది.. కొడుకులు చరిత్ర సృష్టించారు ! వైరల్ అవుతున్న ట్విన్స్ స్టోరీ

JEE Main 2026 : అమ్మ త్యాగం చేసింది.. కొడుకులు చరిత్ర సృష్టించారు ! వైరల్ అవుతున్న ట్విన్స్ స్టోరీ

JEE Main 2026 : జేఈఈ మెయిన్ 2026 ఫలితాల్లో ఒడిశాకు చెందిన కవల సోదరులు మహ్రూఫ్, మస్రూర్ అహ్మద్ ఖాన్ ఒకే పర్సంటైల్ సాధించి చరిత్ర సృష్టించారు. వీరి విజయ ప్రస్థానం, కోటాలో శిక్షణ, భవిష్యత్తు లక్ష్యాల గురించిన ఆసక్తికర విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 17 2026, 07:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
‎జేఈఈ మెయిన్ 2026: కవల సోదరుల అరుదైన రికార్డు   ఒకే సమయం, ఒకే చదువు, ఒకే ఫలితం
Image Credit : X/Arvind_KumarAK

‎జేఈఈ మెయిన్ 2026: కవల సోదరుల అరుదైన రికార్డు - ఒకే సమయం, ఒకే చదువు, ఒకే ఫలితం

‎దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో, ముఖ్యంగా ఐఐటీలలో ప్రవేశం కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ (JEE Mains) 2026 ఫలితాలు విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సోమవారం సెషన్-1 ఫలితాలను ప్రకటించింది. ఈ సంవత్సరం ఫలితాల్లో అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. దేశవ్యాప్తంగా మొత్తం 12 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించి రికార్డు సృష్టించగా, ఒడిశాకు చెందిన ఇద్దరు కవల సోదరులు సాధించిన ఫలితాలు ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. వీరిద్దరూ ఒకే విధమైన పర్సంటైల్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
‎ఒడిశా కవలల అద్భుత ప్రతిభ
Image Credit : ANI

‎ఒడిశా కవలల అద్భుత ప్రతిభ

‎ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన మహ్రూఫ్ అహ్మద్ ఖాన్, మస్రూర్ అహ్మద్ ఖాన్ కవల సోదరులు. వీరిద్దరూ బీఈ/బీటెక్ (BE/BTech) పేపర్‌కు హాజరయ్యారు. ఫలితాలు విడుదలైన తర్వాత చూస్తే, ఇద్దరికీ ఒకే పర్సంటైల్ రావడం విశేషం. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఇలా కవలలకు ఒకే రకమైన మార్కులు రావడం చాలా అరుదుగా జరుగుతుంది. ఈ అరుదైన సంఘటనతో వీరిద్దరూ ఇప్పుడు వార్తల్లో నిలిచారు. కేవలం చూడటానికి ఒకేలా ఉండటమే కాదు, చదువులోనూ, సాధించిన మార్కుల్లోనూ తాము ఒక్కటే అని వీరు నిరూపించారు. 

‎అమ్మ త్యాగం - కోటాలో కఠోర శ్రమ

‎ఈ విజయం వెనుక వారి తల్లి గొప్ప త్యాగం ఉంది. మహ్రూఫ్, మస్రూర్ ఇద్దరూ రాజస్థాన్‌లోని కోటాలో ఉండి జేఈఈకి సిద్ధమయ్యారు. వీరి చదువు కోసం, వారికి సపోర్టుగా నిలవడం కోసం వారి తల్లి తన ఉద్యోగాన్ని సైతం వదులుకున్నారు. భువనేశ్వర్ నుండి కోటాకు మారి, తన పిల్లలతోనే ఉంటూ వారి బాగోగులు చూసుకున్నారు. తల్లి తమ కోసం చేసిన త్యాగం, తమకు అందించిన ప్రోత్సాహం వల్లే తాము ఈ స్థాయికి చేరుకోగలిగామని సోదరులు తెలిపారు. పదవ తరగతి నుండే వీరు కోటాలో ఉంటూ కోచింగ్ మెటీరియల్స్ సహాయంతో మూడేళ్లుగా ఈ పరీక్ష కోసం కఠోర సాధన చేశారు.

34
‎ఆరోగ్యకరమైన పోటీతో మెరుగైన ఫలితాలు
Image Credit : Getty

‎ఆరోగ్యకరమైన పోటీతో మెరుగైన ఫలితాలు

‎తమ ప్రయాణం గురించి మహ్రూఫ్ మాట్లాడుతూ.. "మేము మొదటి నుండి కలిసే చదువుకున్నాం. మాకు వచ్చిన సందేహాలను ఇద్దరం కలిసే నివృత్తి చేసుకునేవాళ్ళం. ఒకవేళ ఎప్పుడైనా మాక్ టెస్టుల్లో ఫలితాలు సరిగా రాకపోతే, ఒకరినొకరు మోటివేట్ చేసుకునేవాళ్ళం. మా మధ్య ఉన్న ఈ అవగాహన ఆరోగ్యకరమైన పోటీకి దారితీసింది. అదే మా పనితీరు మెరుగుపడటానికి కీలక పాత్ర పోషించింది" అని తెలిపారు.

‎భవిష్యత్తు లక్ష్యాల గురించి ప్రస్తావిస్తూ, "మా అమ్మ తన ఉద్యోగాన్ని వదిలేసి మాతో పాటే ఉంటోంది. ఇప్పుడు నా తదుపరి లక్ష్యం జేఈఈ అడ్వాన్స్‌డ్ (JEE Advanced) క్రాక్ చేయడం. ఆ తర్వాత ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదవాలనుకుంటున్నాను. అంతిమంగా ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలన్నదే నా ప్రణాళిక" అని మహ్రూఫ్ స్పష్టం చేశారు.

44
‎ఒకే స్టడీ షెడ్యూల్ - ఒకే సమయం
Image Credit : Getty

‎ఒకే స్టడీ షెడ్యూల్ - ఒకే సమయం

‎మరో సోదరుడు మస్రూర్ మాట్లాడుతూ.. తాము ఎప్పుడూ ఒకే సమయంలో చదువుకునే వాళ్లమని, దీనివల్ల ఒకరి నుండి మరొకరు చాలా విషయాలు నేర్చుకోగలిగామని చెప్పారు. "నేను 10వ తరగతి నుండి కోటాలో ఉన్నాను. మా ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో గత మూడేళ్లుగా కోచింగ్ మెటీరియల్స్ ఉపయోగిస్తూ ప్రిపేర్ అవుతున్నాను. నేను ఎప్పుడూ నిరుత్సాహపడలేదు, అదే నాకు జేఈఈ మెయిన్‌లో మంచి స్కోర్ చేయడానికి సహాయపడింది. మేము ఒకే స్టడీ షెడ్యూల్‌ని అనుసరించాము" అని మస్రూర్ ఏఎన్ఐ వార్తా సంస్థకు తెలిపారు.

‎ఒడిశా టాపర్ గా భావేష్

‎‎మరోవైపు, ఒడిశాకు చెందిన భావేష్ పాత్ర రాష్ట్ర టాపర్‌గా నిలిచారు. దేశవ్యాప్తంగా 100 పర్సంటైల్ సాధించిన 12 మంది అభ్యర్థుల జాబితాలో భావేష్ కూడా ఉన్నారు. తన విజయ రహస్యాన్ని పంచుకుంటూ, "రోజుకు ఎన్ని గంటలు చదివాము అని లెక్కించుకోవడం కంటే, ఒక నిర్దిష్టమైన టార్గెట్ పెట్టుకుని దానిపైనే దృష్టి పెట్టాలి" అని భావేష్ సూచించారు

‎నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షలను జనవరి 21 నుండి జనవరి 29 వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించింది. ఈ పరీక్షలు ప్రతిరోజూ రెండు షిఫ్టులలో జరిగాయి. ఉదయం షిఫ్ట్ 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం షిఫ్ట్ 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
విద్య
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India Bullet Train: రూ. 2 లక్షల కోట్ల ప్రాజెక్ట్.. 350 కిమీ స్పీడ్‌తో భారత్ సొంత బుల్లెట్ ట్రైన్ చూశారా?
Recommended image2
US India Trade: అమెరికా-ఇండియా ట్రేడ్ పెరిగితే భారతీయులకు ఏం ప్రయోజనం?
Recommended image3
LPG Subsidy: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్ !
Related Stories
Recommended image1
Imran Khan : ఇమ్రాన్ ఖాన్‌ను చంపేస్తారా? 14 మంది క్రికెట్ దిగ్గజాల సంచలన లేఖ.. షాక్‌లో పాక్
Recommended image2
Rohit Sharma : రోహిత్‌తో దోస్తీ.. వసీం అక్రమ్‌పై దాడి.. అసలు కథ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved