MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Imran Khan : ఇమ్రాన్ ఖాన్‌ను చంపేస్తారా? 14 మంది క్రికెట్ దిగ్గజాల సంచలన లేఖ.. షాక్‌లో పాక్

Imran Khan : ఇమ్రాన్ ఖాన్‌ను చంపేస్తారా? 14 మంది క్రికెట్ దిగ్గజాల సంచలన లేఖ.. షాక్‌లో పాక్

Imran Khan : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం క్షీణించడంతో, అతనికి మెరుగైన చికిత్స అందించాలని కోరుతూ కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ సహా 14 మంది ప్రపంచ క్రికెట్ దిగ్గజాలు పాక్ ప్రధానికి లేఖ రాశారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 17 2026, 03:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కంటి చూపు కోల్పోతున్న ఇమ్రాన్ ఖాన్? రంగంలోకి దిగిన కపిల్ దేవ్, గవాస్కర్
Image Credit : ANI

కంటి చూపు కోల్పోతున్న ఇమ్రాన్ ఖాన్? రంగంలోకి దిగిన కపిల్ దేవ్, గవాస్కర్

పాకిస్థాన్ మాజీ ప్రధాని, క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్ ఖాన్ (73) ఆరోగ్యంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం పాకిస్థాన్‌లోని అడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా ఆయన కంటి చూపు కోల్పోతున్నారనే వార్త క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. ఈ నేపథ్యంలో, ఇమ్రాన్ ఖాన్‌కు తక్షణమే అత్యున్నత స్థాయి వైద్య చికిత్స అందించాలని కోరుతూ ప్రపంచ క్రికెట్‌కు చెందిన 14 మంది మాజీ కెప్టెన్లు పాకిస్థాన్ ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు ఒక లేఖ రాశారు.

25
వరల్డ్ కప్ హీరో ఇమ్రాన్ : 85 శాతం చూపు పోయింది
Image Credit : Asianet News

వరల్డ్ కప్ హీరో ఇమ్రాన్ : 85 శాతం చూపు పోయింది

అడియాలా జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ కుడి కంటి చూపు దాదాపు 85 శాతం మేర తగ్గిపోయిందని సమాచారం. గత కొన్ని నెలలుగా తనకు చూపు మందగిస్తోందని ఇమ్రాన్ ఫిర్యాదు చేస్తున్నప్పటికీ, జైలు అధికారులు దానిని బేఖాతరు చేశారని ఆయన తరపు న్యాయవాదులు పాక్ సుప్రీంకోర్టుకు వివరించారు. ప్రస్తుతం ఆయన కుడి కన్ను కేవలం 15 శాతం మాత్రమే పనిచేస్తోందని రిపోర్టులు చెబుతున్నాయి. ఈ వార్త తెలియడంతో అంతర్జాతీయ క్రికెట్ సమాజం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

Related Articles

Related image1
T20 World Cup 2026 లో తొలి సెంచరీ.. ఒక్క ఇన్నింగ్స్ తో పాతుమ్ నిస్సంక 5 రికార్డులు
Related image2
T20 World Cup 2026: ఆస్ట్రేలియా పతనానికి ఐదు ప్రధాన కారణాలు ఇవే
35
రంగులోకి దిగిన భారత దిగ్గజాలు
Image Credit : X/ICC

రంగులోకి దిగిన భారత దిగ్గజాలు

ఇమ్రాన్ ఖాన్‌కు సపోర్టుగా భారత్ నుంచి లెజెండరీ క్రికెటర్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ సంతకాలు చేయడం విశేషం. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ గ్రెగ్ చాపెల్ నేతృత్వంలో ఈ పిటిషన్ రూపొందించారు. వీరితో పాటు ఇయాన్ చాపెల్, అలన్ బోర్డర్, స్టీవ్ వా, కిమ్ హ్యూస్, బెలిండా క్లార్క్ (ఆస్ట్రేలియా), ఇంగ్లండ్ నుంచి మైఖేల్ అథర్టన్, నాజర్ హుస్సేన్, డేవిడ్ గోవర్, మైఖేల్ బ్రియర్లీ, వెస్టిండీస్ దిగ్గజం క్లైవ్ లాయిడ్, న్యూజిలాండ్ మాజీ ఆటగాడు జాన్ రైట్ ఈ లేఖపై సంతకాలు చేశారు. రాజకీయాలకు అతీతంగా, ఒక గొప్ప క్రీడాకారుడిగా ఇమ్రాన్ గౌరవప్రదమైన చికిత్సకు అర్హుడని వారు లేఖలో పేర్కొన్నారు.

45
పాక్ మాజీల మౌనం.. సోషల్ మీడియాలో సపోర్టు
Image Credit : Getty

పాక్ మాజీల మౌనం.. సోషల్ మీడియాలో సపోర్టు

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ అంతర్జాతీయ పిటిషన్‌పై పాకిస్థాన్‌కు చెందిన మాజీ కెప్టెన్లు ఎవరూ సంతకాలు చేయలేదు. అక్కడి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వంపై ఉన్న భయం కారణంగానే వారు వెనకడుగు వేసి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, వసీం అక్రమ్, వకార్ యూనిస్, షాహిద్ అఫ్రిది వంటి స్టార్ ఆటగాళ్లు గతంలోనే సోషల్ మీడియాలో ఇమ్రాన్‌కు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.

55
డెత్ సెల్‌లో 1992 ప్రపంచ కప్ హీరో ఇమ్రాన్
Image Credit : Getty

డెత్ సెల్‌లో 1992 ప్రపంచ కప్ హీరో ఇమ్రాన్

2023 ఆగస్టు నుంచి జైలులో ఉంటున్న ఇమ్రాన్ ఖాన్, ప్రస్తుతం వివిధ కేసుల్లో కలిపి మొత్తం 31 ఏళ్ల జైలు శిక్షను ఎదుర్కొంటున్నారు. ఆయన ఉంటున్న గదిని డెత్ సెల్ అని ఆయన కుమారుడు సులైమాన్ అభివర్ణించారు. కుటుంబ సభ్యులను కలవడానికి కానీ, వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడానికి కానీ జైలు నిబంధనలు అనుమతించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. 1992లో పాకిస్థాన్‌కు ప్రపంచ కప్ అందించిన వీరుడు, నేడు చీకటి గదిలో చూపు కోల్పోయే స్థితిలో ఉండటం పట్ల క్రీడాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
పాకిస్తాన్

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026 లో తొలి సెంచరీ.. ఒక్క ఇన్నింగ్స్ తో పాతుమ్ నిస్సంక 5 రికార్డులు
Recommended image2
T20 World Cup 2026: ఆస్ట్రేలియా పతనానికి ఐదు ప్రధాన కారణాలు ఇవే
Recommended image3
SL vs AUS : టీ20 వరల్డ్ కప్ 2026 నుంచి ఆస్ట్రేలియా ఔట్
Related Stories
Recommended image1
T20 World Cup 2026 లో తొలి సెంచరీ.. ఒక్క ఇన్నింగ్స్ తో పాతుమ్ నిస్సంక 5 రికార్డులు
Recommended image2
T20 World Cup 2026: ఆస్ట్రేలియా పతనానికి ఐదు ప్రధాన కారణాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved