- Home
- National
- Train Hijack: పాకిస్థాన్‌లో లాగే ఇండియాలో కూడా ట్రైన్ హైజాక్ అయ్యిందని తెలుసా.? ఎప్పుడు, ఎక్కడంటే..
Train Hijack: పాకిస్థాన్‌లో లాగే ఇండియాలో కూడా ట్రైన్ హైజాక్ అయ్యిందని తెలుసా.? ఎప్పుడు, ఎక్కడంటే..
పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో జరిగిన రైలు హైజాక్ ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అయితే రైలు హౌజాక్‌కి గురికావడం ఇదే తొలిసారి కాదు. గతంలో భారతదేశంలో కూడా ఓ రైలు హైజాక్ అయ్యిందని మీలో ఎంత మందికి తెలుసు? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

పాకిస్థాన్‌లో జరిగిన ట్రైన్ హైజాక్ వ్యవహారం ప్రపంచ మీడియాను ఆకర్షించిన విషయం తెలిసిందే. స్వతంత్ర్య రాజ్యాన్ని కోరుకుంటూ బలూచిస్థాన్‌కు చెందిన బలూచిస్థాన్ లిరేషన్ ఆర్మీ అనే సంస్థ 11వ తేదీన ట్రైన్‌ను హైజాక్ చేసింది. బలూచిస్తాన్‌లోని క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తుంక్వాలోని పెషావర్ కు వెళ్తున్న ఎక్స్ ప్రెస్ రైలును తిరుగుబాటుదారులు అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: ఫ్యాక్టరీలో పై కప్పులో కనిపించే ఈ వస్తువు ఉపయోగం ఏంటో తెలుసా.?
రైలు హైజాక్
ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇండియాలో కూడా ఇలాంటి రైలు హైజాక్ జరిగిందని మీకు తెలుసా? ఇండియాలో ఫస్ట్ రైలు హైజాక్ ఫిబ్రవరి 6, 2013న ఛత్తీస్ గఢ్ లోని దుర్గ్ లో జరిగింది.
ఇది కూడా చదవండి: రూ. 5 లక్షలతో రూ. 15 లక్షలు పొందే అవకాశం.. అస్సలు రిస్క్ అనేదే లేదు..
ఇండియాలో రైలు హైజాక్
ఆ హైజాక్ బ్యాచ్, డ్రైవర్ ఇంకా మిగతా ఉద్యోగులను గన్ తో బెదిరించి బందీలుగా పట్టుకుని, రైలును వేరే స్టేషన్ కు తీసుకెళ్లమని బెదిరించారు. తన తండ్రి ఉపేంద్రాని విడిపించడం కోసం, ఒక ఫేమస్ రౌడీ బ్యాచ్ కొడుకు రైలును హైజాక్ చేశాడు.
ఉపేంద్ర సింగ్ బిలాస్పూర్ సెంట్రల్ జైలులో ఉన్నాడు. ఒక క్రిమినల్ కేసు విచారణ కోసం ఉపేంద్రను దుర్గ్ కోర్టుకు తీసుకొచ్చారు.
జన్ శతాబ్ది ఎక్స్ ప్రెస్
ఉపేంద్రను విడిపించడానికి, అతని కొడుకు ప్రీతమ్ సింగ్, దుర్గ్ ఇంకా రాయ్ గఢ్ మధ్య తిరిగే జన్ శతాబ్ది ఎక్స్ ప్రెస్ ను ఒక గ్యాంగ్ తో హైజాక్ చేశాడు. రాయ్ పూర్ కు దగ్గరలో ఉన్న కుమ్హారి రైల్వే స్టేషన్ దగ్గర రైలును ఆపిన హైజాక్ బ్యాచ్ ఉపేంద్ర సింగ్ ను కూడా తీసుకుని అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయారు.
తండ్రిని తీసుకెళ్లడమే మెయిన్ టార్గెట్ కాబట్టి రైలును హైజాక్ చేసిన ప్రీతమ్ సింగ్, ఆ గ్యాంగ్ డ్రైవర్ ని, మిగతా ప్రయాణికులను ఏమీ చేయలేదు. అప్పట్లో ఇది దేశవ్యాప్తంగా పెనుదుమారాన్ని రేపింది.