MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Fact: ఫ్యాక్టరీలో పై కప్పులో కనిపించే ఈ వస్తువు ఉపయోగం ఏంటో తెలుసా.?

Fact: ఫ్యాక్టరీలో పై కప్పులో కనిపించే ఈ వస్తువు ఉపయోగం ఏంటో తెలుసా.?

సైన్స్ ఎంతో అభివృద్ధి చెందింది. అధునాతన టెక్నాలజీతో కూడిన వస్తువులు మన జీవితాన్ని మరింత సులభంగా మార్చేశాయి. అయితే మన చుట్టూ ఉన్నా కొన్ని వస్తువుల ఉపయోగం గురించి మనకు తెలిసి ఉండదు. అలాంటి వాటిలో ఇదిగో ఈ ఫొటోలో కనిపిస్తున్న స్టీల్‌ డోమ్‌ రొటేటింగ్ పరికరం ఒకటి. ఇంతకీ దీని ఉపయోగం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..  

1 Min read
Author : Narender Vaitla
Published : Mar 14 2025, 06:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

హైవేపై వెళ్తున్న సమయంలో రోడ్డు పక్కన ఫ్యాక్టరీలు కనిపిపిస్తుంటాయి. అయితే ఆ ఫ్యాక్టరీల పై కప్పుపై గుండ్రంగా తిరిగే ఒక స్టీల్ వస్తువు మీకు కనిపించి ఉండొచ్చు. ఫ్యాన్‌లా తిరిగే ఈ వస్తువు అలంకరణ కోసం ఏర్పాటు చేసిందని అనుకుంటాం. నిజానికి ఇది అలంకరణ వస్తువు కాదు దీని పేరు పేరు టర్బో వెంటిలేటర్. సైన్స్‌, ఇంజనీరింగ్ కలయికతో దీనిని రూపొందించారు. ఈ టర్బో వెంటిలేటర్‌కు ‘ఎయిర్ వెంటిలేటర్’, ‘టర్బైన్ వెంటిలేటర్’, లేదా ‘రూఫ్ ఎక్స్‌ట్రాక్టర్’ అని కూడా పిలుస్తారు. ఇవి కేవలం ఫ్యాక్టరీలకే పరిమితం కాకుండా, ఇప్పుడు షాపింగ్ మాల్స్, పెద్ద స్టోర్లు, రైల్వే స్టేషన్లు లాంటి ప్రదేశాల్లోనూ సాధారణంగా కనిపిస్తున్నాయి. 

23
Steel dome

Steel dome

వీటి ఉపయోగం ఏంటంటే.? 

ఫ్యాక్టరీల్లో పని చేసే కార్మికులకు ఆరోగ్యకరమైన వాతావరణం అవసరం. టర్బో వెంటిలేటర్లను ఇందు కోసమే ఉపయోగిస్తారు. ఇవి వేసవిలో లేదా లోపల వేడి అధికంగా ఉన్నప్పుడు గాలి ప్రసరణను మెరుగుపరచి, చల్లదనాన్ని కలిగిస్తాయి. లోపల వేడి గాలిని బయటకు పంపిస్తాయి, చల్లటి గాలిని లోపలికి వచ్చేలా చేస్తాయి. తేమను, దుర్వాసనను తొలగిస్తాయి. గాలి ప్రవాహం ద్వారా నేచురల్‌గా చల్లగా ఉండేలా చేస్తాయి. వేడి గాలి పైకి లేస్తుంది, చల్లటి గాలి దిగువకు వస్తుందనే ప్రాథమిక శాస్త్రీయ సూత్రం ఆధారంగా  టర్బో వెంటిలేటర్ల పని చేస్తాయి. 
 

33

ఫ్యాక్టరీలో  ఉత్పత్తి అయ్యే వేడి గాలి పైకి లేచి టర్బో వెంటిలేటర్ దగ్గరకు వస్తుంది. అప్పుడు టర్బో వెంటిలేటర్ ఆ గాలికి తిరుగుతూ వేడి గాలిని బయటకు పంపుతుంది. అలాగే బయటి నుంచి చల్ల గాలి లోపలికి రావడం ప్రారంభమవుతుంది. దీనికి కరెంట్‌ అవసరం లేదు. గాలికి దానంతటదే తిరుగుతుంది. వీటి ఇన్‌స్టాలేషన్ సులభం, నిర్వహణ తక్కువగా ఉంటుంది. 

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.

Latest Videos
Recommended Stories
Recommended image1
Apple : సూపర్ కంప్యూటర్ మీ చేతుల్లోనే.. సరికొత్త M5 ప్రో, M5 మ్యాక్స్ చిప్‌లతో ఆపిల్ సంచలనం
Recommended image2
Lunar Eclipse: మనదేశంలో చంద్రగ్రహణం స్పష్టంగా కనిపించే నగరాలు ఇవే
Recommended image3
Home Loan: రూ.50 లక్షల హోమ్ లోన్ కావాలంటే మీ జీతం ఎంత ఉండాలి? నెలకి ఎంత ఈఎంఐ కట్టాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved