MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Post office scheme: రూ. 5 లక్షలతో రూ. 15 లక్షలు పొందే అవకాశం.. అస్సలు రిస్క్‌ అనేదే లేదు..

Post office scheme: రూ. 5 లక్షలతో రూ. 15 లక్షలు పొందే అవకాశం.. అస్సలు రిస్క్‌ అనేదే లేదు..

ప్రస్తుతం చాలా మందిలో ఆర్థిక క్రమశిక్షణ పెరిగింది. మారిన ఆర్థిక అవసరాలు, పెరిగిన ఖర్చుల నేపథ్యంలో పొదుపు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఇందుకు అనుగుణంగానే ప్రభుత్వ రంగ సంస్థలు మంచి పథకాలతో ఖాతాదారులను ఆకర్షిస్తున్నాయి. ఇందులో ముందు వరుసలో ఉంటోంది పోస్టాఫీస్‌. పెట్టిన పెట్టుబడికి ఎలాంటి రిస్క్‌ లేకుండా మంచి ఆదాయం వచ్చే ఒక బెస్ట్‌ స్కీమ్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..  

2 Min read
Author : Narender Vaitla
Published : Mar 15 2025, 10:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఒకప్పుడు ఖర్చు చేసింది పోను మిగిలిన మొత్తాన్ని పొదుపు చేసే వారు. కానీ ప్రస్తుతం పొదుపు చేసిన తర్వాత మిగిలిన్న మొత్తాన్ని ఖర్చు చేస్తున్నారు. అంతలా ఆర్థిక అవసరాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా పిల్లల భవిష్యత్తను దృష్టిలో పెట్టుకొని పొదుపు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. మన పెట్టుబడికి ఎలాంటి రిస్క్‌ లేకుండా మంచి ఆదాయం వచ్చే పథకాల వైపు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో భాగంగానే పోస్టాఫీస్‌లో ఒక మంచి ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ అందుబాటులో ఉంది.

26

మీరు ఒకేసారి ఎక్కువ మొత్తంలో డబ్బులు పొదుపు చేయాలనుకునే పోస్టాఫీస్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. 5 ఏళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ బ్యాంకు‌ల కంటే ఎక్కువ వడ్డీ ఇస్తుంది. ఈ స్కీమ్ ద్వారా మూడు రెట్లు డబ్బు సంపాదించవచ్చు. అంటే రూ. 5 లక్షలు పెడితే రూ. 15 లక్షలు వస్తాయి. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

36

రూ. 5 లక్షలు 15 లక్షలు అవ్వాలంటే, ముందుగా 5,00,000 రూపాయలు పోస్ట్ ఆఫీస్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో 5 ఏళ్ళకు ఇన్వెస్ట్ చేయాలి. పోస్ట్ ఆఫీస్ 5 ఏళ్ళ ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు 7.5 శాతం వడ్డీ ఇస్తుంది. ఇప్పుడున్న వడ్డీ రేటు ప్రకారం చూస్తే, 5 ఏళ్ళ తర్వాత మెచ్యూరిటీ అమౌంట్ రూ.7,24,974 అవుతుంది. ఈ డబ్బును తీయకుండా మళ్ళీ 5 ఏళ్ళకు ఫిక్స్ చేయండి. ఇలా చేస్తే 10 ఏళ్ళలో 5 లక్షలకు వడ్డీ ద్వారా రూ.5,51,175 వస్తుంది. అప్పుడు మీ మొత్తం రూ.10,51,175 అవుతుంది. ఇది రెండు రెట్లకు పైగా.

46

ఆ తర్వాత ఈ డబ్బును మళ్ళీ 5 ఏళ్ళకు ఫిక్స్ చేయాలి. అంటే రెండు సార్లు 5 ఏళ్ళకు ఫిక్స్ చేయాలి. అప్పుడు మీ డబ్బు మొత్తం 15 ఏళ్ళకు డిపాజిట్ అవుతుంది. 15వ ఏట మెచ్యూరిటీ సమయంలో మీరు పెట్టిన 5 లక్షలకు వడ్డీ ద్వారా రూ. 10,24,149 సంపాదిస్తారు. అప్పుడు మీరు పెట్టిన 5 లక్షలు, వచ్చిన 10,24,149 కలిపితే మొత్తం రూ. 15,24,149 వస్తాయి.
 

56

రూ. 15 లక్షలు రావాలంటే, పోస్ట్ ఆఫీస్ ఎఫ్‌డీని రెండుసార్లు పొడిగించాలి. దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి. పోస్ట్ ఆఫీస్ 1 సంవత్సరం ఎఫ్‌డీని మెచ్యూరిటీ తేదీ నుండి 6 నెలల్లోపు పొడిగించవచ్చు. 2 సంవత్సరాల ఎఫ్‌డీని 12 నెలల్లోపు పొడిగించాలి. 3, 5 సంవత్సరాల ఎఫ్‌డీని పొడిగించాలంటే, మెచ్యూరిటీ తర్వాత 18 నెలల్లోపు పోస్ట్ ఆఫీస్‌కు చెప్పాలి. అకౌంట్ తెరిచేటప్పుడే మెచ్యూరిటీ తర్వాత అకౌంట్ పొడిగించమని అడగవచ్చు. మెచ్యూరిటీ రోజున ఉన్న వడ్డీ రేటు పొడిగించిన కాలానికి వర్తిస్తుంది.
 

66

బ్యాంకుల్లాగే పోస్ట్ ఆఫీసుల్లో కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్‌పై వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. ఒక సంవత్సరం అకౌంట్‌కు 6.9% వడ్డీ వస్తుంది. రెండు సంవత్సరాల అకౌంట్‌లో 7.0%, మూడు సంవత్సరాల అకౌంట్‌లో 7.1% వడ్డీ ఇస్తారు. 5 సంవత్సరాల అకౌంట్‌లో 7.5% వడ్డీ ఇస్తారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.

Latest Videos
Recommended Stories
Recommended image1
Apple : సూపర్ కంప్యూటర్ మీ చేతుల్లోనే.. సరికొత్త M5 ప్రో, M5 మ్యాక్స్ చిప్‌లతో ఆపిల్ సంచలనం
Recommended image2
Lunar Eclipse: మనదేశంలో చంద్రగ్రహణం స్పష్టంగా కనిపించే నగరాలు ఇవే
Recommended image3
Home Loan: రూ.50 లక్షల హోమ్ లోన్ కావాలంటే మీ జీతం ఎంత ఉండాలి? నెలకి ఎంత ఈఎంఐ కట్టాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved