MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • National
  • Legal Advice: భార్య వద్దన్నా మందు తాగితే జైలుకేనా? కొత్త BNS చట్టం గృహహింసపై ఏం చెబుతోంది?

Legal Advice: భార్య వద్దన్నా మందు తాగితే జైలుకేనా? కొత్త BNS చట్టం గృహహింసపై ఏం చెబుతోంది?

Legal Advice : భార్య వద్దన్నా భర్త మందు తాగితే జైలు శిక్ష తప్పదా? కొత్త భారతీయ న్యాయ సంహిత (BNS) చట్టం, సెక్షన్ 85 గృహహింసపై ఏం చెబుతుందో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 11 2026, 05:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మందుబాబులకు మైండ్ బ్లాంక్ న్యూస్.. భార్య వద్దంటే తాగొచ్చా?
Image Credit : Gemini

మందుబాబులకు మైండ్ బ్లాంక్ న్యూస్.. భార్య వద్దంటే తాగొచ్చా?

సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, గత కొన్ని రోజులుగా ఒక వార్త చక్కర్లు కొడుతోంది. "కొత్త చట్టాల ప్రకారం భార్య వద్దని చెప్పినా భర్త మందు తాగితే అది నేరమే.. కచ్చితంగా జైలు శిక్ష పడుతుంది" అని ఆ మెసేజ్ సారాంశం. అంతేకాదు, మందు తాగి గృహహింసకు పాల్పడితే భారతీయ న్యాయ సంహిత (BNS) లో ఒక కొత్త స్పెషల్ చట్టాన్ని కూడా తెచ్చారని ఆ వార్తల్లో చెబుతున్నారు.

దీంతో మందుబాబుల్లో ఒక్కసారిగా టెన్షన్ మొదలైంది. నిజంగానే భార్య వద్దంటే మందు తాగకూడదా? ఒకవేళ తాగితే పోలీసులొచ్చి అరెస్ట్ చేస్తారా? అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ వార్తల్లో అసలు వాస్తవం ఎంత? కొత్తగా వచ్చిన BNS చట్టం మందు, గృహహింస గురించి ఏం చెబుతోంది? లాంటి ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
సోషల్ మీడియా ప్రచారంలో వాస్తవం ఎంత?
Image Credit : Gemini AI

సోషల్ మీడియా ప్రచారంలో వాస్తవం ఎంత?

ముందుగా ఒక విషయం మీద క్లారిటీ తెచ్చుకోవాలి. అదేంటంటే.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త వంద శాతం నిజం కాదు. కానీ, చట్టపరమైన కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. భార్య వద్దని చెప్పినా భర్త మందు తాగితే అది నేరం అని, దానికి డైరెక్ట్‌గా జైలు శిక్ష పడుతుందని కొత్త భారతీయ న్యాయ సంహిత (BNS) చట్టంలో ఎక్కడా స్పెసిఫిక్‌గా చెప్పలేదు. 

ఎవరైనా సరే ఇంట్లో కూర్చుని కేవలం మందు తాగడం అనేది మన దేశంలో నేరం కిందకు రాదు. అలాగే కేవలం "మందు సేవించి చేసే గృహహింస" కోసం BNS లో స్పెషల్ గా ఎలాంటి కొత్త సెక్షన్‌ను తీసుకురాలేదు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. మందు తాగడం నేరం కాకపోయినా, తాగాక చేసే పనులకు మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

Related Articles

Related image1
Weather Update: బంగాళాఖాతంలో ద్రోణి.. ఈ ప్రాంతాల్లో 3 రోజులు పిడుగులతో కూడిన భారీ వర్షాలు
Related image2
IRCTC Jyotirlinga Tour 2026: ఒకే ఒక్క ట్రిప్.. 3 ధామాలు, 11 జ్యోతిర్లింగాల దర్శనం! ఐఆర్‌సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీ
36
అసలు చట్టం ఏం చెబుతోంది? BNS సెక్షన్ 85 అంటే ఏంటి?
Image Credit : Gemini

అసలు చట్టం ఏం చెబుతోంది? BNS సెక్షన్ 85 అంటే ఏంటి?

మందు తాగడం పర్సనల్ ఛాయిస్ అయినప్పటికీ.. ఆ తర్వాత జరిగే పరిణామాల విషయంలో, ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో కొత్త చట్టం చాలా స్ట్రిక్ట్ గా ఉంది. మందు మత్తులో ఉన్నా లేదా నార్మల్ గా ఉన్నా.. భార్యపై శారీరక, మానసిక లేదా ఆర్థిక వేధింపులకు పాల్పడితే దాన్ని అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు.

గతంలో ఉన్న పాత క్రిమినల్ చట్టం IPC 498A ప్లేస్ లో ఇప్పుడు BNS సెక్షన్ 85 అమలులోకి వచ్చింది. భర్త లేదా అతని ఫ్యామిలీ మెంబర్స్ భార్య పట్ల క్రూరంగా ప్రవర్తించినా, దాడులు చేసినా ఈ సెక్షన్ కింద ఏకంగా 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, ఫైన్ పడుతుంది. ఇది 'కాగ్నిజబుల్, నాన్-బెయిలబుల్' నేరం. సింపుల్ గా చెప్పాలంటే.. కంప్లైంట్ అందిన వెంటనే పోలీసులకు ఎలాంటి వారెంట్ లేకుండా అరెస్ట్ చేసే పవర్స్ ఉంటాయి. స్టేషన్ లో బెయిల్ దొరకడం కూడా కష్టం.

46
మత్తులో ఉన్నా.. నా తప్పు లేదు అనే సాకు ఇక చెల్లదు
Image Credit : Gemini Ai

మత్తులో ఉన్నా.. నా తప్పు లేదు అనే సాకు ఇక చెల్లదు

కొంతమంది మందుబాబులు ఫుల్లుగా తాగి, ఇంట్లో భార్యపై ఇష్టమొచ్చినట్లు దాడులు చేస్తుంటారు. తీరా పోలీసులొచ్చాక లేదా కోర్టుకు వెళ్లాక.. "సార్ నేను ఫుల్ మత్తులో ఉన్నాను, నా మీద నాకు కంట్రోల్ లేదు, నేను ఏం చేస్తున్నానో నాకే తెలియదు" అని నాటకాలు ఆడేవారు. పాత చట్టాల్లో అన్ సౌండ్ మైండ్ కింద పరిగణించడంతో శిక్ష తగ్గే ఛాన్స్ ఉండేది.

కానీ కొత్త BNS చట్టం సెక్షన్ 24 ప్రకారం ఈ డ్రామాలు ఇక వర్కౌట్ అవ్వవు. ఎవరైనా కావాలని మందు తాగి భార్యపై లేదా ఇతరులపై అటాక్ చేస్తే.. వారికి చట్టం నుంచి ఎలాంటి ఎక్స్‌క్యూజ్ దొరకదు. స్వచ్ఛందంగా మందు తాగడం అనేది మానసిక అనారోగ్యం కిందకు రాదు అని చట్టం తేల్చి చెప్పేసింది. కాబట్టి, నార్మల్ కండిషన్ లో ఒక క్రైమ్ చేస్తే ఎలాంటి కఠిన శిక్ష పడుతుందో, తాగి చేసినా కూడా ఎగ్జాక్ట్ గా అదే రేంజ్ లో శిక్ష పడుతుంది.

56
తాగి దాడులు చేస్తే పడే అదనపు సెక్షన్లు ఇవే
Image Credit : stockPhoto

తాగి దాడులు చేస్తే పడే అదనపు సెక్షన్లు ఇవే

కేవలం గృహహింస సెక్షన్ 85 మాత్రమే కాదు, మందు తాగి గొడవలకు దిగితే మరికొన్ని సెక్షన్లు కూడా అదనంగా తోడవుతాయి. మందు సేవించి ఫిజికల్ గా అటాక్ చేసినా, తిట్టినా లేదా బెదిరించినా కింది సెక్షన్లు వర్తిస్తాయి..

  • BNS సెక్షన్ 115: ఉద్దేశపూర్వకంగా గాయపరచడం లేదా కొట్టడం.
  • BNS సెక్షన్ 351: చంపేస్తానని లేదా తీవ్రమైన హాని చేస్తానని బెదిరించడం.
  • BNS సెక్షన్ 355: మందు మత్తులో పబ్లిక్ ప్లేస్ లో గొడవ చేసినా, జనాలకు ఇబ్బంది కలిగేలా అసభ్యంగా ప్రవర్తించినా ఈ సెక్షన్ కింద 24 గంటల వరకు జైలు శిక్ష లేదా 1,000 రూపాయల వరకు ఫైన్ వేస్తారు.
66
ఉమెన్ సేఫ్టీ చట్టాలు - భార్యలకే ఫుల్ పవర్స్
Image Credit : Pixabay

ఉమెన్ సేఫ్టీ చట్టాలు - భార్యలకే ఫుల్ పవర్స్

కొత్తగా వచ్చిన BNS తో పాటు, మహిళలకు అండగా 'గృహహింస నుండి మహిళల రక్షణ చట్టం - 2005' (PWDVA) కూడా దేశంలో చాలా పటిష్ఠంగా అమలులో ఉంది. ఈ చట్టం ద్వారా బాధితులకు తక్షణ రక్షణ, నివాస హక్కు, అలాగే ఆర్థిక సాయం అందుతాయి.

ఓవరాల్ గా చెప్పాలంటే.. భార్య వద్దన్న తర్వాత మందు తాగడం అనేది డైరెక్ట్ గా నేరం కాకపోవచ్చు. కానీ, తాగిన తర్వాత భార్యపై చెయ్యి చేసుకున్నా, ఆమెను మాటలతో సైకలాజికల్ గా టార్చర్ పెట్టినా మాత్రం చట్టం అసలు వదిలిపెట్టదు. చట్టం దృష్టిలో గృహహింస అనేది ఏ పరిస్థితుల్లో చేసినా తీవ్రమైన నేరమే. మందు అనేది గృహహింసకు ఎప్పటికీ సాకు కాకూడదు. భార్యకు ఇంట్లో సేఫ్టీ, రెస్పెక్ట్ ఇవ్వడం అనేది నాన్ నెగోషియబుల్ అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
విద్య
న్యాయ స‌ల‌హాలు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
భారత దేశం
హైదరాబాద్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
నేపాల్ వరదల్లో కొట్టుకొచ్చిన మృ*తదేహాలను హెలికాఫ్టర్లతో | Rescue Operation Latest Visuals From Nepal
Recommended image2
Abhinandan Varthaman: పాక్ ఎఫ్‌16ను కూల్చిన హీరో అభినందన్ వర్ధమాన్ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌లో ఎందుకు చేరారు?
Recommended image3
Ayodhya Ram Mandir: అయోధ్య రామ్ మందిర్ మొదటి సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్.. ఆయన అందుకునే జీతం ఎంతో తెలుసా?
Related Stories
Recommended image1
Weather Update: బంగాళాఖాతంలో ద్రోణి.. ఈ ప్రాంతాల్లో 3 రోజులు పిడుగులతో కూడిన భారీ వర్షాలు
Recommended image2
IRCTC Jyotirlinga Tour 2026: ఒకే ఒక్క ట్రిప్.. 3 ధామాలు, 11 జ్యోతిర్లింగాల దర్శనం! ఐఆర్‌సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved