MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Digital India: డిజిట‌ల్ ఇండియాకు ప‌దేళ్లు.. ఈ 10 ఏళ్లలో దేశంలో జ‌రిగిన మార్పులు ఏంటో తెలుసా.?

Digital India: డిజిట‌ల్ ఇండియాకు ప‌దేళ్లు.. ఈ 10 ఏళ్లలో దేశంలో జ‌రిగిన మార్పులు ఏంటో తెలుసా.?

న‌రేంద్ర మోదీ ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత ఎన్నో ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టారు. ఇందులో ఒక‌టి డిజిట‌ల్ ఇండియా. మారుతోన్న ప్ర‌పంచంతో పాటు భార‌త్‌ను అగ్ర‌మామిగా నిల‌పాల‌న్న ల‌క్ష్యంతో మొద‌లు పెట్టిన ఈ మిష‌న్‌కు నేటితో ప‌దేళ్లు పూర్త‌యింది. 

2 Min read
Narender Vaitla
Published : Jul 01 2025, 11:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
డిజిటల్ ఇండియా: పదేళ్ల మార్పు ప్రయాణం
Image Credit : narendra modi linkedin

డిజిటల్ ఇండియా: పదేళ్ల మార్పు ప్రయాణం

న‌రేంద్ర మోదీ సార్థథ్యంలోని కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న విప్లవాత్మ‌క నిర్ణ‌యాల్లో డిజిట‌ల్ ఇండియా ఒక‌టి. భారత్‌ వంటి విస్తృత దేశంలో డిజిటల్ మార్పు సాధ్యమా అనే సందేహాలు అప్పట్లో అనేకం ఉండేవి. కానీ ఈ ద‌శాబ్ధ కాలంలో ఎన్నో మార్పులు సంభ‌వించాయి. ఉద్యమంలా ప్రారంభ‌మైన డిజిటల్ ఇండియా ఫ‌లితాలు నేడు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఈ ప‌దేళ్ల కాలంలో భార‌త్‌లో జ‌రిగిన కీల‌క మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

26
భారీగా పెరిగిన ఇంట‌ర్నెట్ యూజ‌ర్లు
Image Credit : narendra modi linkedin

భారీగా పెరిగిన ఇంట‌ర్నెట్ యూజ‌ర్లు

2014లో భారత్‌లో కేవలం 25 కోట్ల మంది ఇంటర్నెట్ వాడేవారు. అయితే ఇప్పుడీ సంఖ్య‌ 97 కోట్లకు చేరింది. ప‌ల్లె, ప‌ట్నం అనే తేడా లేకుండా 42 లక్షల కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ కేబుల్ దేశం అంతటినీ అనుసంధానిస్తోంది.

5G సేవలు ప్రపంచంలోనే వేగంగా భారత్‌లో ప్రవేశించాయి. గల్వాన్, సియాచిన్, లడఖ్ వంటి సరిహద్దుల్లో కూడా వేగవంతమైన ఇంటర్నెట్ అందుతోంది.

Related Articles

Related image1
Telangana: త‌ల్లిదండ్రుల‌ను ప‌ట్టించుకోక‌పోతే అంతే సంగ‌తులు.. సీఎం రేవంత్‌ సంచ‌ల‌న నిర్ణ‌యం
Related image2
Motivational story: అంతా మ‌నం చూసే విధాన‌మే.. ఈ క‌థ చ‌దివితే మీ ఆలోచ‌న‌ మారాల్సిందే
36
టెక్నాలజీతో లావాదేవీల విప్లవం
Image Credit : narendra modi linkedin

టెక్నాలజీతో లావాదేవీల విప్లవం

డిజిట‌ల్ ఇండియా విప్ల‌వంలో మ‌రో కీల‌క మ‌లుపు డిజిట‌ల్ లావాదేవీలు. UPI ద్వారా ఏటా 100 బిలియన్‌కి పైగా లావాదేవీలు జరుగుతున్నాయి. ప్రపంచంలోని రియల్ టైమ్ డిజిటల్ లావాదేవీలలో సగం కంటే ఎక్కువ భారత్‌లోనే జరుగుతున్నాయి.

ఇక ప్ర‌భుత్వ ప‌థ‌కాల్లోనూ డిజిట‌లైజేష‌న్ పెరిగింది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫ‌ర్‌(DBT) ద్వారా రూ. 44 లక్షల కోట్లకు పైగా నేరుగా ప్రజల ఖాతాల్లో జమయ్యాయి. మధ్యవర్తుల పాత్ర లేకుండా ప్ర‌భుత్వ ప‌థ‌కాలు నేరుగా ల‌బ్ధిదారుల ఖాతాల్లోకి వెళుతున్నాయి. SVAMITVA వంటి పథకాల ద్వారా 2.4 కోట్ల ఆస్తి కార్డులు జారీ అయ్యాయి. 6.47 లక్షల గ్రామాల మ్యాపింగ్ పూర్తయింది.

46
మాస్టర్‌ నుంచి MSME వరకు
Image Credit : narendra modi linkedin

మాస్టర్‌ నుంచి MSME వరకు

ONDC (Open Network for Digital Commerce) చిన్న వ్యాపారులకు దేశవ్యాప్తంగా కొనుగోలు, అమ్మకాలకు అవకాశం కల్పిస్తోంది. ఇటీవలే 200 మిలియన్ లావాదేవీలను అధిగమించింది. GeM (Government e-Marketplace) ద్వారా సామాన్యులు ప్రభుత్వ విభాగాలకు సరఫరాలు అందిస్తున్నారు. 

లక్ష కోట్ల GMVతో 22 లక్షల మంది విక్రేతలు, అందులో 1.8 లక్షల మంది మహిళా-నాయకత్వంలోని MSMEs ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ పథకాల వల్ల యువత Mudra Loans తీసుకొని, GeMలో రిజిస్టర్ అయి, ONDC ద్వారా వ్యాపారాన్ని విస్తరించగలుగుతున్నారు.

56
ప్రపంచానికి నేర్పుతున్న భారత డిజిటల్ మోడల్
Image Credit : narendra modi linkedin

ప్రపంచానికి నేర్పుతున్న భారత డిజిటల్ మోడల్

Aadhaar, CoWIN, DigiLocker, FASTag, PM-WANI, One Nation One Subscription లాంటి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (DPI) ప్రపంచానికి ఆదర్శంగా మారింది. CoWIN ద్వారా 220 కోట్లకు పైగా టీకాల సర్టిఫికెట్లు జారీ అయ్యాయి. DigiLockerలో 54 కోట్ల యూజర్లు 775 కోట్ల డాక్యుమెంట్లను భద్రపరిచారు.

66
ఏఐ, స్టార్ట‌ప్ విప్ల‌వం
Image Credit : Gemini

ఏఐ, స్టార్ట‌ప్ విప్ల‌వం

భారత్‌లో ప్ర‌స్తుతం 1.8 లక్షలకు పైగా స్టార్టప్స్ ఉన్నాయి. ఇది కేవలం ఆర్థిక పురోగతి మాత్రమే కాదు, టెక్నాలజీ పునరుద్ధానానికి సంకేతంగా నిలిచాయి. AI స్కిల్ పెనిట్రేషన్, యువతలో AI టాలెంట్ పెరుగుతోంది.ఇండియా ఏఐ మిష‌న్ ద్వారా 34,000 GPUsను రూ.100 లోపల ధరకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది ప్రపంచంలోనే అత్యంత చౌకగా లభించే కంప్యూటింగ్ పవర్.

About the Author

NV
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు.
భారత దేశం
నరేంద్ర మోదీ
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved