ఉద్యోగులకు 30 రోజుల Old Age Parents Care సెలవులు... అంటే ఏమిటి? ఎలా తీసుకోవాలి?
Senior Citizen Support India : వయసుమీదపడి వివిధ సమస్యలతో బాధపడే కన్నవారిని కంటికిరెప్పలా చూసుకోవాలనుకునే ఉద్యోగుల కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటో తెలుసా?

వృద్ధాప్యంలోని తల్లిదండ్రుల కోసం పేరెంట్ కేర్ సెలవులు
నేటి బిజీ లైఫ్ లో చాలామంది బంధాలు, స్నేహాలను దూరం చేసుకుంటున్నారు... చివరికి కన్నవారిని కూడా పట్టించుకోలేని స్థాయికి చేరుకున్నారు. అందువల్లే ఓల్డేజ్ హోమ్స్ రోజురోజుకి పెరిగిపోతున్నాయి. కన్న బిడ్డలు ఉండగానే ఇలా అనాధల్లా వృద్ధాశ్రమాల్లో బ్రతికేవారు నరకం అనుభవిస్తుంటారు.ఇదే సమయంలో వర్క్ బిజీలో తల్లిదండ్రులను పట్టించుకోలేక ఓల్డేజ్ హోంలో వేయడం బిడ్డలనూ బాధిస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇకపై ఈ బాధ ఉండదు... వయసు మీదపడ్డ తల్లిదండ్రులతో గడిపేందుకు ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది.
వృద్ధాప్యంతో బాధపడే తల్లిదండ్రులకు సేవలు చేయాలనుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదిలో 30 రోజులు అంటే నెలరోజులు సెలవు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ పార్లమెంట్ వేదికన ప్రకటించారు. వృద్ధాప్యంలో ఉండే తల్లిదండ్రులు చివరిరోజుల్లో తమ పిల్లలు దగ్గరుండాలని కోరుకుంటారు... అందువల్లే ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు ఇస్తోంది కేంద్రం.
KNOW
ఓల్టేజ్ పేరెంట్స్ కోసం సెలవులు ఇలా తీసుకోవచ్చు..
వృద్ద తల్లిదండ్రులు అనారోగ్యంతో బాధపడుతున్నా... లేదంటే వారిని ఎక్కడికైనా తీసుకుపోవాలని అనుకుంటున్నా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సెలవులు తీసుకోవచ్చు. ఇలా ఒకటి రెండ్రోజులు కాదు ఏకంగా నెలరోజుల పాటు వీరికి సెలవు మంజూరు చేస్తుంది ప్రభుత్వం. ఈ సెలవుల నిబంధనలు ఇలా ఉన్నాయి.
ఓల్జేజ్ పేరెంట్స్ కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 20 రోజులు సగం వేతనంతో కూడిన సెలవులు పొందవచ్చు. ఇక మరో 8 రోజులు సాధారణ సెలవులు, 2 పరిమిత సెలవులు పొందవచ్చు. ఇలా మొత్తంగా 30 రోజులు సెలవు తీసుకుని పేరెంట్స్ తో గడపొచ్చు. దీనివల్ల వృద్ద పేరెంట్స్ హ్యాపీ... ఉద్యోగి హ్యాపీ. వ్యక్తిగత అవసరాల కోసం కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఈ సెలవులను పొందవచ్చు.
తెలంగాణ ఉద్యోగుల పేరెంట్స్ కోసం సీఎం కీలక వ్యాఖ్యలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పేరెంట్స్ కోసం కీలక చర్యలు తీసుకునే ఆలోచనలో ఉన్నారు. వృద్దాప్యంలో ఉన్న పేరెంట్స్ ను పట్టించుకోని ప్రభుత్వ ఉద్యోగుల జీతంలోంచి కొంత కట్ చేసి వారి పేరెంట్స్ ఖాతాలో వేయనున్నట్లు ప్రకటించారు. ఇలాంటి నిబంధనలు తీసుకురావాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కన్న తల్లిదండ్రులను పట్టించుకోకుండా రోడ్డున పడేసిన ఘటనలు ఇటీవలకాలంలో వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వ ఉద్యోగుల్లో మార్పు కోసం సాలరీలో కోత విధానాన్ని తీసుకువచ్చే ఆలోచన చేస్తున్నారని ప్రభుత్వం చెబుతోంది. వృద్ద తల్లిదండ్రుల కనీస అవసరాలకు సరిపోయేలా కొడుకు జీతంలోంచి 10 నుండి 15 శాతం కట్ చేయాలని... ఆ డబ్బులు తల్లి లేదా తండ్రి అకౌంట్లో వేయాలని భావిస్తోంది. తద్వారా ప్రతిసారి ఖర్చులకోసం పేరెంట్స్ పిల్లలను డబ్బులు అడగకుండా ఆత్మగౌరవంతో ఉండవచ్చు.
తెలంగాణలో వృద్దాప్య పించన్లు
దేశంలోని అనేక రాష్ట్రాలు వృద్దులకు నెలనెలా ఫించన్లు ఇస్తున్నాయి... కానీ తెలుగురాష్ట్రాల్లో మాత్రం చాలా ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు. తెలంగాణ ఆసరా పేరిట 57 ఏళ్లు పైబడిన ముసలివారికి నెలకు రూ.2,016 అందిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఈ వృద్దాప్య ఫించన్లను రూ.4,016 కు పెంచనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఇప్పుడు ఆ ప్రభుత్వమే అధికారంలో ఉందికాబట్టి ఫించన్ల పెంపుకోసం వృద్దులు ఎదురుచూస్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ లో వృద్దులకు ఫించన్లు
ఇక ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ప్రతినెలా ఒకటో తారీఖున వృద్దులకు ఫించన్లు అందిస్తుంది ప్రభుత్వం. గతంలో రూ.3 వేలుగా ఉన్న వృద్దాప్య ఫించన్లను కూటమి ప్రభుత్వం రూ.4,000 కు పెంచింది. ఇలా ఎన్టీఆర్ భరోసా పేరిట చంద్రబాబు సర్కార్ ఫించన్లు అందిస్తోంది.
జమ్మలమడుగు మండలం, గూడెంచెరువు గ్రామంలో ఉల్సాల అలివేలమ్మ ఇంటికెళ్లి వితంతు పెన్షన్‌ను అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఇంట్లో చేనేత మగ్గాన్ని సీఎం పరిశీలించారు. అనంతరం అలివేలమ్మ చిన్నకుమారుడు జగదీష్ ఆటోలో మాట్లాడుతూ వేదిక వద్దకు చేరుకున్నారు.… pic.twitter.com/XnSZibT8WE
— Telugu Desam Party (@JaiTDP) August 1, 2025