Parenting Tips: పిల్లల కోపం తగ్గించాలంటే ఏం చేయాలో తెలుసా?
పిల్లలకు వెంటనే కోపం వచ్చేస్తూ ఉంటుంది. పేరెంట్స్ ఏదైనా చిన్న విషయం చెప్పినా.. వారికి వెంటనే కోపం వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి పిల్లలను ఎలా హ్యాండిల్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

పేరెంటింగ్ టిప్స్...
ఈ మధ్యకాలంలో పిల్లలకు చిటికీ, మాటికీ కోపం వచ్చేస్తూ ఉంటుంది. వారి కోపాన్ని కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు. చిన్న పని చెప్పినా పిల్లలు కోపంతో ఊగిపోతుంటారు. ఇక.. పిల్లలు చిన్న విషయానికీ, పెద్ద విషయానికి కోప్పడటం.. పేరెంట్స్ కి కూడా నచ్చదు. కానీ, పిల్లల కోపం కేవలం కోపం మాత్రమే కాదు. ఇది వారి భావాల వ్యక్తీకరణ.
పిల్లలు తమ ఎమోషన్ ని ఒక్కొక్కరు ఒక్కోలా చూపిస్తారు. కొందరు అరుస్తూ, మరి కొందరు తమను తాము గాయపరుచుకుంటూ తమ కోపాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. మరి, పిల్లల కోపాన్ని ఎలా కంట్రోల్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
అంగీకారం
పిల్లలు కోపంగా ఉన్నప్పుడు వారిని విస్మరించడం సరైన పరిష్కారం కాదు. దీనివల్ల వారి భావాలను వ్యక్తపరచడం సురక్షితం కాదనే అవగాహన పిల్లలకు కలుగుతుంది. తమ కోపాన్ని పేరెంట్స్ పట్టించుకోవడం లేదు అనే విషయం వారిని మరింత బాధపడుతుంది. అందుకే.. వారికి కోపం వచ్చినప్పుడు వారి కోపాన్ని అర్థం చేసుకోవాలి. అసలు.. వారికి కోపం ఎందుకు వచ్చింది అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేయాలి.
హార్మోన్ల ఒత్తిడి...
పిల్లలు ఎక్కువ సమయం ఒంటరిగా గడిపేటప్పుడు వారి ఒత్తిడి హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల వారి భావోద్వేగ నియంత్రణ ఆలస్యం అవుతుంది. దీన్ని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. వారితో తగినంత సమయం గడపాలి. ఒంటరితనం తగ్గినప్పుడు వారి గాయపడిన మనసు నయం అవుతుంది కోపం తగ్గుతుంది.
కోపాన్ని కంట్రోల్ చేయడం.
పిల్లల కోపం తగ్గించడానికి వారికి నచ్చిన పనులు చేయించాలి. అంటే… వీలైనంత వరకు వారికి డ్రాయింగ్, కథల పుస్తకాలు చదవడం లాంటివి అలవాటు చేయాలి. ఇవి.. వారికి చాలా ఓదార్పునిస్తాయి. కోపం లాంటి సమస్యను తగ్గించడానికి సహాయపడతాయి.
తల్లిదండ్రుల అవగాహన
పిల్లలు కోపంగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు కూడా వారితో కలిసి అరవడం, తిట్టడం వంటివి చేయకుండా వారి కోపం తగ్గిన తర్వాత వారితో మాట్లాడాలి. వారి సానుకూల అంశాలను చెప్పిన తర్వాత, కోపం ఎలాంటి ప్రతికూల పరిణామాలకు దారితీస్తుందో తెలియజేయాలి.
ముఖ్యమైన మార్పు
కోపిష్టి పిల్లలను శాంతింపజేయడానికి తల్లిదండ్రులు ప్రయత్నించే ముందు, తమను తాము చూసుకోవాలి. శరీరాన్ని గట్టిగా కాకుండా వదులుగా ఉంచుకోవాలి. ముఖంలో చిరునవ్వుతో మృదువైన స్వరంతో మాట్లాడాలి. మాట్లాడే ముందు గాలిని లోతుగా పీల్చుకోవాలి. తర్వాత వారితో మాట్లాడాలి.
టాస్క్
పిల్లలకు కోపం వచ్చినప్పుడు అరవడం కాకుండా.. ఆ కోపాన్ని ఏదైనా బొమ్మ రూపంలో గీయడం లేదంటే.. కాగితంపై రాయడం లాంటివి చేయమని చెప్పాలి. వారికి ఎంత కోపం వచ్చిందో దానితో చెప్పమని చెప్పాలి. తెలీకుండానే.. ఆ పనులు వారి కోపాన్ని కంట్రోల్ చేస్తాయి.