MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Life
  • Snakes: ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన 5 పాములు ఇవే.. కాటేస్తే కాటికే..!

Snakes: ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన 5 పాములు ఇవే.. కాటేస్తే కాటికే..!

కొన్ని పాములు చూడటానికి సాధారణంగా కనిపించినా, వాటి విషం మాత్రం ప్రాణాంతకంగా ఉంటుంది. ఒక్క కాటు మనిషి జీవితం మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అలాంటి అత్యంత ప్రమాదకరమైన 5 పాముల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Kavitha G
Published : Apr 30 2026, 11:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అత్యంత విషపూరితమైన పాములు
Image Credit : Google

అత్యంత విషపూరితమైన పాములు

ప్రపంచవ్యాప్తంగా అనేక జాతుల పాములు ఉన్నప్పటికీ, వాటిలో కొన్ని మాత్రమే అత్యంత విషపూరితమైనవి. ఈ పాములు కాటు వేస్తే.. టైంకి వైద్య సహాయం అందకపోతే ప్రాణాలకు ముప్పు తప్పదు. కాబట్టి వాటి గురించి అవగాహన ఉండటం చాలా అవసరం. ఇక్కడ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన 5 పాముల గురించి తెలుసుకుందాం.

ఇన్ ల్యాండ్ తైపాన్

ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన పాముల్లో మొదటగా చెప్పుకోవాల్సింది ఇన్ ల్యాండ్ తైపాన్. దీన్ని “ఫియర్స్ స్నేక్” అని కూడా అంటారు. ఇది ఆస్ట్రేలియాలో కనిపిస్తుంది. దీని విషం చాలా పవర్ ఫుల్. ఒకే కాటుకు వందల మందిని చంపే సామర్థ్యం ఉంటుంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇది చాలా అరుదుగా మనుషులపై దాడి చేస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కింగ్ కోబ్రా
Image Credit : Stock Photo

కింగ్ కోబ్రా

ప్రపంచంలోనే అతి పొడవైన విషపాము కింగ్ కోబ్రా. ఇది ప్రధానంగా భారత్, దక్షిణాసియా ప్రాంతాల్లో కనిపిస్తుంది. కింగ్ కోబ్రా విషం న్యూరోటాక్సిక్‌గా పనిచేస్తుంది. అంటే ఇది నరాల వ్యవస్థను ప్రభావితం చేసి శ్వాసను ఆపేయగలదు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది తన గూడు, గుడ్లను రక్షించుకోడానికి చాలా అగ్రెసివ్ గా మారుతుంది.

Related Articles

Related image1
Weight Loss: ఈ 5 టిప్స్ ఫాలో అయితే నెలకు 4 కేజీల వరకు బరువు తగ్గడం పక్కా!
Related image2
Pumpkin Seeds: ఎండాకాలంలో గుమ్మడి గింజలు తినొచ్చా? తింటే జరిగేది ఇదే..!
35
బ్లాక్ మాంబా
Image Credit : Google

బ్లాక్ మాంబా

మరో ప్రమాదకర పాము బ్లాక్ మాంబా. ఇది ఆఫ్రికాలో కనిపిస్తుంది. అత్యంత వేగంగా కదిలే పాముల్లో బ్లాక్ మాంబా ఒకటి. దీని విషం చాలా వేగంగా ప్రభావం చూపుతుంది. చికిత్స లేకపోతే కొన్ని గంటల్లోనే ప్రాణం పోయే ప్రమాదం ఉంటుంది. బ్లాక్ మాంబా దాడి చేసినప్పుడు వరుసగా అనేక సార్లు కాటు వేయగలదు. అందుకే ఇది అత్యంత ప్రమాదకరమైన పాముగా చెప్తారు.

45
ఇసుక పింజరి
Image Credit : Google

ఇసుక పింజరి

ఈ పాము చూడ్డానికి చిన్నగా ఉన్నప్పటికీ, అత్యంత ప్రమాదకరమైన పాముల్లో ఒకటి. ఇసుక పింజరి భారతదేశం సహా ఆసియా, ఆఫ్రికా ప్రాంతాల్లో కనిపిస్తుంది. దీని విషం రక్తం గడ్డకట్టే విధానాన్ని ప్రభావితం చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ పాము కాటు మరణాలకు ఈ పామే కారణమని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది చాలా వేగంగా స్పందించే పాము, చిన్న శబ్దానికి కూడా దాడి చేసే స్వభావం కలిగి ఉంటుంది.

55
రక్తపింజరి
Image Credit : Google

రక్తపింజరి

భారతదేశంలో ఎక్కువగా కనిపించే అత్యంత విషపూరితమైన పాములలో రక్తపింజరి ఒకటి. దీని కాటు చాలా తీవ్రమైన నొప్పి, వాపు, అంతర్గత రక్తస్రావం కలిగిస్తుంది. సరైన సమయంలో చికిత్స అందకపోతే ప్రాణాంతకమవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూముల్లో పనిచేసే వారికి ఈ పాము కాటు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ప్రపంచం
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
జుట్టుకు నూనె రాస్తున్నారా? ఈ తప్పులు చేస్తే జుట్టు పెరగడం కాదు రాలుతుంది
Recommended image2
రోజూ ఒక పెగ్ ఆల్కహాల్ తాగితే గుండెకు మంచిదా? అసలు నిజమేంటి?
Recommended image3
Milk at Night: రాత్రి పడుకునే ముందు పాలు తాగితే నిజంగా నిద్ర బాగా పడుతుందా?
Related Stories
Recommended image1
Weight Loss: ఈ 5 టిప్స్ ఫాలో అయితే నెలకు 4 కేజీల వరకు బరువు తగ్గడం పక్కా!
Recommended image2
Pumpkin Seeds: ఎండాకాలంలో గుమ్మడి గింజలు తినొచ్చా? తింటే జరిగేది ఇదే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved