MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Pumpkin Seeds: ఎండాకాలంలో గుమ్మడి గింజలు తినొచ్చా? తింటే జరిగేది ఇదే..!

Pumpkin Seeds: ఎండాకాలంలో గుమ్మడి గింజలు తినొచ్చా? తింటే జరిగేది ఇదే..!

ఎండాకాలంలో ఏం తినాలి? ఏం తినకూడదు? అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. ముఖ్యంగా గుమ్మడి గింజలు. నిజానికి ఇవి ఆరోగ్యానికి చాలా మంచివని అందరికీ తెలుసు. కానీ వేసవిలో తినడం మంచిదా? కాదా? తింటే ఏమవుతుంది? నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం. 

2 Min read
Author : Kavitha G
Published : Apr 29 2026, 03:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వేసవిలో గుమ్మడి గింజలు తినొచ్చా?
Image Credit : stockPhoto

వేసవిలో గుమ్మడి గింజలు తినొచ్చా?

ఎండాకాలంలో శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే ఆహారాలు తీసుకోవడం ముఖ్యం. అయితే చాలామందికి గుమ్మడి గింజలు తినొచ్చా? లేదా అనే డౌట్ ఉంటుంది. నిపుణుల ప్రకారం వేసవిలో గుమ్మడి గింజలను సరైన మోతాదులో తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం, జింక్, ఐరన్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా ఎండాకాలంలో నీరసం, అలసట ఎక్కువగా అనిపించే సమయంలో ఇవి ఎనర్జీని అందించి శరీరాన్ని చురుకుగా ఉంచుతాయి.

24
ఈ సమస్యలు దూరం
Image Credit : Getty

ఈ సమస్యలు దూరం

నిపుణుల ప్రకారం, గుమ్మడి గింజల్లో ఉండే మెగ్నీషియం శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ఇది మసిల్స్ రిలాక్స్ అయ్యేలా చేసి, వేడి కారణంగా వచ్చే ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే వీటిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఎండాకాలంలో డీహైడ్రేషన్ వల్ల గుండెపై పడే ఒత్తిడిని తగ్గించడంలో కూడా ఇవి కొంతవరకు ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.

గుమ్మడి గింజలు యాంటీఆక్సిడెంట్స్‌తో నిండి ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించి ఇమ్యూనిటీని పెంచడంలో సహాయపడతాయి. వేసవిలో తరచుగా వచ్చే అలసట, ఇన్‌ఫెక్షన్లను దూరం చేయడంలో ఇవి చక్కగా పనిచేస్తాయి.

Related Articles

Related image1
Best Summer Drinks: వేసవిలో కాఫీ, టీ బదులు ఈ డ్రింక్స్ తాగితే ఎంత మంచిదో తెలుసా?
Related image2
Weight Loss: ఈ 5 టిప్స్ ఫాలో అయితే నెలకు 4 కేజీల వరకు బరువు తగ్గడం పక్కా!
34
మోతాదు ముఖ్యం
Image Credit : Getty

మోతాదు ముఖ్యం

అయితే ఎండాకాలంలో గుమ్మడి గింజలను ఎక్కువగా తినడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుమ్మడి గింజలు కొంచెం వేడి చేసే స్వభావాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఎక్కువగా తీసుకుంటే శరీరంలో వేడి పెరగడం, కడుపులో ఇబ్బందులు, అజీర్ణం వంటి సమస్యలు రావచ్చు. అందుకే రోజుకు ఒక 20–30 గ్రాముల్లోపు తీసుకోవడం మంచిది. అలాగే వీటిని నేరుగా తినడం కంటే నానబెట్టి లేదా దోరగా వేయించి తింటే సులభంగా జీర్ణమవుతాయి. అలెర్జీ సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.

44
మెరుగైన నిద్ర
Image Credit : Getty

మెరుగైన నిద్ర

గుమ్మడి గింజలు నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడతాయి. వీటిలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమినో ఆమ్లం మెదడులో సెరటోనిన్, మెలటోనిన్ హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతుంది. ఎండాకాలంలో వేడి కారణంగా నిద్రలేమి సమస్య ఎదురయ్యే వారికి ఇది సహజమైన పరిష్కారంగా పనిచేస్తుంది. అలాగే ఇవి బరువు నియంత్రణలో కూడా సహాయపడతాయి. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువసేపు ఆకలి అనిపించదు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Weight Loss: ఈ 5 టిప్స్ ఫాలో అయితే నెలకు 4 కేజీల వరకు బరువు తగ్గడం పక్కా!
Recommended image2
Best Summer Drinks: వేసవిలో కాఫీ, టీ బదులు ఈ డ్రింక్స్ తాగితే ఎంత మంచిదో తెలుసా?
Recommended image3
Anti Aging: మ‌నిషి 150 ఏళ్లు బ‌త‌క‌గ‌ల‌డా.? పెద్ద క‌ష్ట‌మేమి కాదంటోన్న నిపుణులు
Related Stories
Recommended image1
Best Summer Drinks: వేసవిలో కాఫీ, టీ బదులు ఈ డ్రింక్స్ తాగితే ఎంత మంచిదో తెలుసా?
Recommended image2
Weight Loss: ఈ 5 టిప్స్ ఫాలో అయితే నెలకు 4 కేజీల వరకు బరువు తగ్గడం పక్కా!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved