MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Weight Loss: ఈ 5 టిప్స్ ఫాలో అయితే నెలకు 4 కేజీల వరకు బరువు తగ్గడం పక్కా!

Weight Loss: ఈ 5 టిప్స్ ఫాలో అయితే నెలకు 4 కేజీల వరకు బరువు తగ్గడం పక్కా!

ప్రస్తుత కాలంలో బరువు తగ్గడం అనేది చాలా మంది ఎదుర్కొనే సాధారణ సమస్య. అయితే సరైన మార్గంలో, నిపుణులు సూచించే సింపుల్ టిప్స్ ఫాలో అయితే హెల్తీగా బరువు తగ్గొచ్చు. ఒక్క నెలలోనే మంచి ఫలితాలు చూడవచ్చు. మరి ఆ టిప్స్ ఏంటో తెలుసుకోండి.

2 Min read
Author : Kavitha G
Published : Apr 29 2026, 01:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
బరువు తగ్గించే సింపుల్ టిప్స్
Image Credit : Getty

బరువు తగ్గించే సింపుల్ టిప్స్

ప్రస్తుతం చాలామంది అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారు. నిజానికి బరువు తగ్గడం అనేది ప్రతి వ్యక్తి శరీర నిర్మాణం, ఆరోగ్య పరిస్థితి, జీవనశైలి, మెటబాలిజం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే ఆరోగ్య నిపుణులు సూచించే కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే చాలామంది నెలకు 2 నుంచి 4 కేజీల వరకు ఆరోగ్యంగా బరువు తగ్గే అవకాశం ఉంది. బరువు తగ్గడంలో స్థిరమైన ఫలితాలు రావాలంటే ఏం చేయాలో, నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

26
డైట్ అత్యంత కీలకం
Image Credit : Getty

డైట్ అత్యంత కీలకం

బరువు తగ్గడంలో డైట్ అత్యంత కీలకమైంది. నిపుణుల ప్రకారం రోజువారీ భోజనంలో ప్రాసెస్డ్ ఫుడ్, షుగర్ ఎక్కువగా ఉండే పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్ తగ్గించడం అవసరం. వీటి స్థానంలో కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. ప్రోటీన్ తగిన మోతాదులో తీసుకోవడం వల్ల ఎక్కువసేపు ఆకలి అనిపించదు, దాంతో అదనపు కేలరీలు తీసుకునే అవకాశం తగ్గుతుంది. అలాగే, రాత్రి భోజనం లైట్ గా ఉండాలి. సాధ్యమైనంత వరకు 7 గంటల లోపే తినాలి. తద్వారా బరువు నియంత్రణలో ఉంటుంది.

Related Articles

Related image1
Best Summer Drinks: వేసవిలో కాఫీ, టీ బదులు ఈ డ్రింక్స్ తాగితే ఎంత మంచిదో తెలుసా?
Related image2
Kitchen Hacks: ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందని అన్నీ పెట్టుస్తున్నారా? ఇవి పెడితే చాలా డేంజర్!
36
వ్యాయామం చేయడం
Image Credit : AI

వ్యాయామం చేయడం

రోజుకు కనీసం 30 నుంచి 45 నిమిషాల శారీరక శ్రమ.. బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, యోగా, స్ట్రెంత్ ట్రైనింగ్ వంటివి చేయాలి. ముఖ్యంగా స్ట్రెంత్ ట్రైనింగ్ వల్ల మసిల్స్ పెరుగుతాయి. శరీరం ఎక్కువ కేలరీలు ఖర్చు చేస్తుంది. లైఫ్ స్టైల్లో కొన్ని చిన్న చిన్న మార్పులు కూడా పెద్ద ఫలితాలు ఇస్తాయి. అంటే లిఫ్ట్ బదులు మెట్లు ఎక్కడం, తిన్న తర్వాత వాకింగ్ చేయడం, వీలైతే.. గంట, రెండు గంటలకు ఒకసారి కాసేపు నడవడం మంచిది.

46
సరిపడా నీరు తాగడం
Image Credit : Getty

సరిపడా నీరు తాగడం

శరీరంలో మెటబాలిజం సక్రమంగా పనిచేయాలంటే తగినంత నీరు తాగడం అవసరం. రోజుకు కనీసం 2.5 నుంచి 3 లీటర్ల నీరు తాగడం ద్వారా శరీరంలో టాక్సిన్లు బయటకు వెళ్తాయి. జీర్ణక్రియ మెరుగవుతుంది. అలాగే ఆకలి నియంత్రణలో ఉంటుంది. చాలామంది దాహాన్ని ఆకలిగా భావించి ఎక్కువ తింటారు, కాబట్టి నీరు సరైన మోతాదులో తీసుకోవడం మంచిది.

56
మంచి నిద్ర
Image Credit : stockPhoto

మంచి నిద్ర

ఆరోగ్య నిపుణుల ప్రకారం, రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం. నిద్ర సరిగా లేకపోతే హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి ఆకలి ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా జంక్ ఫుడ్ తినాలనే కోరిక పెరుగుతుంది. దీని వల్ల బరువు తగ్గడం కష్టమవుతుంది. కాబట్టి మంచి నిద్ర కూడా బరువు నియంత్రణలో ముఖ్యమైన భాగం.

66
స్ట్రెస్ మేనేజ్‌మెంట్
Image Credit : Getty

స్ట్రెస్ మేనేజ్‌మెంట్

ఎక్కువ ఒత్తిడి ఉన్నప్పుడు కార్టిసోల్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది బరువు పెరగడానికి కారణమవుతుంది. యోగా, మెడిటేషన్, శ్వాస వ్యాయామాలు వంటి వాటితో ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. మెంటల్ హెల్త్ బాగుంటేనే ఫిజికల్ హెల్త్ కూడా మెరుగవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Best Summer Drinks: వేసవిలో కాఫీ, టీ బదులు ఈ డ్రింక్స్ తాగితే ఎంత మంచిదో తెలుసా?
Recommended image2
Anti Aging: మ‌నిషి 150 ఏళ్లు బ‌త‌క‌గ‌ల‌డా.? పెద్ద క‌ష్ట‌మేమి కాదంటోన్న నిపుణులు
Recommended image3
Beer : ఈ మండుటెండల్లో చల్లని బీర్లు తాగుతున్నారా..? అయితే మీ బాడీకి రిపేర్లు తప్పవు..!
Related Stories
Recommended image1
Best Summer Drinks: వేసవిలో కాఫీ, టీ బదులు ఈ డ్రింక్స్ తాగితే ఎంత మంచిదో తెలుసా?
Recommended image2
Kitchen Hacks: ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందని అన్నీ పెట్టుస్తున్నారా? ఇవి పెడితే చాలా డేంజర్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved