MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Summer Skin Care: ఎండల నుంచి చర్మాన్ని రక్షించే పండ్లు.. ఇలా వాడితే స్కిన్ గ్లో ఖాయం

Summer Skin Care: ఎండల నుంచి చర్మాన్ని రక్షించే పండ్లు.. ఇలా వాడితే స్కిన్ గ్లో ఖాయం

Summer Skin Care: ఎండ‌లు దంచికొడుతున్నాయి. చాలామంది సన్‌స్క్రీన్‌, ఫేస్ జెల్స్‌, స్కిన్ కేర్ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. అయితే కొన్ని సహజమైన ఫలాలు, ఆహార పదార్థాలు కూడా చర్మాన్ని ఎండ దెబ్బ నుంచి రక్షించడంలో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

1 Min read
Author : Narender Vaitla
Published : May 21 2026, 11:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చర్మ రక్షణలో ఆహారం కూడా కీలకం
Image Credit : Gemini AI

చర్మ రక్షణలో ఆహారం కూడా కీలకం

ఆరోగ్యకరమైన ఆహారం శరీరానికే కాదు, చర్మానికి కూడా ఎంతో అవసరం. ముఖ్యంగా ఉదయం సమయంలో తీసుకునే కొన్ని ఫలాలు, పోషకాహార పదార్థాలు UV కిరణాల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. నిపుణుల ప్రకారం మన చర్మానికి కూడా ఒక ప్రత్యేకమైన “స్కిన్ క్లాక్” ఉంటుంది. ఇది పగటి సమయంలో సూర్యరశ్మి నుంచి చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. సరైన సమయంలో సరైన ఆహారం తీసుకుంటే చర్మం సహజ రక్షణ శక్తి మరింత మెరుగుపడుతుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
బ్లూబెర్రీలు చర్మానికి సహజ రక్షణ
Image Credit : our own

బ్లూబెర్రీలు చర్మానికి సహజ రక్షణ

బ్లూబెర్రీలను వేసవిలో చర్మానికి ఎంతో ఉపయోగకరమైన ఫలాలుగా భావిస్తారు. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి చర్మాన్ని రక్షిస్తాయి. కాలుష్యం, ఎండ కారణంగా చర్మం దెబ్బతినకుండా సహాయపడతాయి. అలాగే వీటిలో విటమిన్-C కూడా సమృద్ధిగా ఉండటంతో చర్మం ఆరోగ్యంగా, మెరిసేలా కనిపిస్తుంది.

Related Articles

Related image1
ఏసీ కొన‌డం కాదు దానిని ఎలా వాడాలో కూడా తెలియాలి.. 90 శాతం మందికి ఈ విష‌యాలు తెలియ‌వు
Related image2
Projector: రూ. 3 వేల‌తో మీ ఇంటిని థియేట‌ర్‌గా మార్చేయండి.. హైఎండ్ ఫీచ‌ర్ల‌తో స్మార్ట్ ప్రొజెక్ట‌ర్‌
35
పుచ్చకాయ చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది
Image Credit : Getty

పుచ్చకాయ చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది

వేసవిలో ఎక్కువగా తినే పుచ్చకాయ కూడా సహజ సన్ ప్రొటెక్టర్‌లా పనిచేస్తుంది. ఇందులో ఉండే లైకోపిన్ అనే యాంటీఆక్సిడెంట్ UVB కిరణాల ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఉదయం ముఖం కడిగిన తర్వాత పుచ్చకాయ రసం లేదా చల్లటి పల్ప్‌ను ముఖానికి రాసుకుంటే చర్మం తాజాగా ఉండటంతో పాటు తేమను కూడా నిలుపుకుంటుంది.

45
గ్రీన్ టీ, గింజలు కూడా ఉపయోగకరం
Image Credit : Getty

గ్రీన్ టీ, గింజలు కూడా ఉపయోగకరం

గ్రీన్ టీ, క్యారెట్‌, పాలకూర, ఆక్రోట్లు, చియా సీడ్స్‌, ఫ్లాక్స్ సీడ్స్ వంటి ఆహార పదార్థాలు కూడా చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, బీటా కెరోటిన్‌, పాలీఫెనాల్స్ చర్మాన్ని లోపల నుంచి బలంగా మారుస్తాయి. ఎండ వల్ల కలిగే డ్యామేజ్‌ను తగ్గించడంలో ఇవి సహాయపడతాయి.

55
ఉదయం ఇలా తీసుకుంటే ఇంకా మంచిది
Image Credit : Getty

ఉదయం ఇలా తీసుకుంటే ఇంకా మంచిది

ఈ ఫలాలు, ఆరోగ్యకరమైన ఆహారాలను ఉదయం సమయంలో జ్యూస్‌, స్మూతీ లేదా సలాడ్ రూపంలో తీసుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే వీటిని తీసుకుంటున్నామనే కారణంతో సన్‌స్క్రీన్‌ను పూర్తిగా మానేయడం సరైంది కాదు. బయటకు వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ వాడడం, తగినంత నీరు తాగడం, సరైన స్కిన్ కేర్ పాటించడం కూడా చాలా అవసరం.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
జీవనశైలి
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Silver Earrings: ఈ వెండి చెవిపోగులు చూశారా.. ఎంత బాగున్నాయో
Recommended image2
Blouse Models: లెహంగాకి కొత్త లుక్ తెచ్చే ట్రెండీ బ్లౌజు మోడల్స్
Recommended image3
Scooty Seat Cover: ఎండలో బైక్ సీటు కాలిపోతోందా? కూల్‌గా ఉంచే ఈ సీట్ కవర్లు ట్రై చేయండి
Related Stories
Recommended image1
ఏసీ కొన‌డం కాదు దానిని ఎలా వాడాలో కూడా తెలియాలి.. 90 శాతం మందికి ఈ విష‌యాలు తెలియ‌వు
Recommended image2
Projector: రూ. 3 వేల‌తో మీ ఇంటిని థియేట‌ర్‌గా మార్చేయండి.. హైఎండ్ ఫీచ‌ర్ల‌తో స్మార్ట్ ప్రొజెక్ట‌ర్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved