MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Technology
  • Gadgets
  • Projector: రూ. 3 వేల‌తో మీ ఇంటిని థియేట‌ర్‌గా మార్చేయండి.. హైఎండ్ ఫీచ‌ర్ల‌తో స్మార్ట్ ప్రొజెక్ట‌ర్‌

Projector: రూ. 3 వేల‌తో మీ ఇంటిని థియేట‌ర్‌గా మార్చేయండి.. హైఎండ్ ఫీచ‌ర్ల‌తో స్మార్ట్ ప్రొజెక్ట‌ర్‌

Projector: ఇంట్లోనే థియేటర్‌లాంటి అనుభూతిని కోరుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా ఓటీటీలు అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత వీటికి ఆద‌ర‌ణ ఎక్కువ‌గా ల‌భిస్తోంది. అమెజాన్‌లో త‌క్కువ ధ‌ర‌లో అందుబాటులో ఉన్న ఓ బెస్ట్ ప్రొజెక్ట‌ర్ గురించి తెలుసుకుందాం. 

2 Min read
Author : Narender Vaitla
Published : May 20 2026, 06:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
180 డిగ్రీలు తిరిగే ప్రత్యేక డిజైన్‌
Image Credit : Amazon.in

180 డిగ్రీలు తిరిగే ప్రత్యేక డిజైన్‌

త‌క్కువ ధ‌ర‌లో మంచి ఫీచ‌ర్ల‌తో కూడిన ప్రొజెక్ట‌ర్ కోసం చూస్తున్న వారికి PANSEBA Smart Projector మంచి ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఆండ్రాయిడ్ 11 సపోర్ట్‌, 4K, 1080P వీడియో సపోర్ట్‌, WiFi 6 కనెక్టివిటీ వంటి ఆధునిక ఫీచర్లతో ఈ ప్రొజెక్టర్‌ను కంపెనీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉన్న ఈ ప్రొజెక్టర్ అస‌లు ధ‌ర రూ. 19,999 కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 3,399కి ల‌భిస్తోంది. దీనికి అద‌నంగా అమెజాన్ పే బ్యాలెన్స్‌తో పే చేస్తే అద‌నంగా రూ. 100 వ‌ర‌కు డిస్కౌంట్ పొందొచ్చు. ఈ ప్రొజెక్టర్‌లో 180 డిగ్రీలు తిరిగే రొటేటింగ్ స్టాండ్‌ను ఏర్పాటు చేశారు. దీని వల్ల గోడపై మాత్రమే కాకుండా పైకప్పుపై కూడా వీడియోలను ప్రొజెక్ట్ చేయవచ్చు. దీంతో పడుకుని సినిమాలు చూడాలనుకున్నా కూడా సులభంగా యాంగిల్ మార్చుకునే అవకాశం ఉంటుంది. 40 ఇంచుల నుంచి 130 ఇంచుల వరకు పెద్ద స్క్రీన్ అనుభవాన్ని ఇది అందిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
4K, 1080P వీడియో సపోర్ట్‌తో క్లియర్ విజువల్స్‌
Image Credit : Amazon.in

4K, 1080P వీడియో సపోర్ట్‌తో క్లియర్ విజువల్స్‌

PANSEBA స్మార్ట్ ప్రొజెక్ట‌ర్ 1920x1080 రిజల్యూషన్‌ను సపోర్ట్ చేస్తుంది. 4K వీడియో ప్లేబ్యాక్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. ఆటోమేటిక్ హారిజాంటల్ కీస్టోన్ కరెక్షన్ ఫీచర్ ఉండటంతో స్క్రీన్ వంకరగా కనిపించినా అది ఆటోమేటిక్‌గా సరిచేస్తుంది. దీంతో వీడియోలు మరింత క్లియర్‌గా, థియేటర్ అనుభూతికి దగ్గరగా కనిపిస్తాయి.

Related Articles

Related image1
Free Bus: ఉచిత బ‌స్సు ప‌థ‌కం ఆగిపోనుందా.? అధికారిక ప్ర‌క‌ట‌న చేసిన ప్ర‌భుత్వం
Related image2
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 700 కోట్ల‌తో, 63 అంత‌స్థుల అపార్ట్‌మెంట్‌, ఒక్క ప్లాట్ ధ‌ర రూ. 6.2 కోట్లు
35
వైఫ్‌6, బ్లూటూత్ 5.0తో ఫాస్ట్ కనెక్టివిటీ
Image Credit : Amazon.in

వైఫ్‌6, బ్లూటూత్ 5.0తో ఫాస్ట్ కనెక్టివిటీ

సాధారణ HDMI కేబుల్ అవసరం లేకుండా మొబైల్‌, ల్యాప్‌టాప్‌, ట్యాబ్ వంటి పరికరాలను ఈ ప్రొజెక్టర్‌కు వైర్‌లెస్‌గా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో WiFi 6 సపోర్ట్ ఇవ్వడంతో వీడియో స్ట్రీమింగ్ వేగంగా జరుగుతుంది. కనెక్షన్ డిలే చాలా తక్కువగా ఉంటుంది. Bluetooth 5.0 ఫీచర్ వల్ల స్పీకర్లు, హెడ్‌ఫోన్స్ వంటి డివైస్‌లను కూడా సులభంగా కనెక్ట్ చేయవచ్చు.

45
అనేక పరికరాలకు సపోర్ట్
Image Credit : Amazon.in

అనేక పరికరాలకు సపోర్ట్

ఈ ప్రొజెక్టర్‌లో HDMI, USB, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటి పోర్టులు అందుబాటులో ఉన్నాయి. టీవీ స్టిక్‌, గేమింగ్ కన్సోల్‌, PC, స్మార్ట్‌ఫోన్‌, DVD ప్లేయర్‌, USB డ్రైవ్ వంటి అనేక పరికరాలను కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంట్లో సినిమా చూడటానికి మాత్రమే కాకుండా ఆఫీస్ ప్రెజెంటేషన్స్‌, పార్టీలు, గేమింగ్ కోసం కూడా ఉపయోగించవచ్చు.

55
చిన్న సైజులో స్మార్ట్ హోమ్ థియేటర్
Image Credit : Amazon.in

చిన్న సైజులో స్మార్ట్ హోమ్ థియేటర్

పోర్టబుల్ డిజైన్ కారణంగా ఈ ప్రొజెక్టర్‌ను ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. చిన్న గదుల్లో కూడా పెద్ద స్క్రీన్ అనుభవాన్ని పొందొచ్చు. తక్కువ ధరలో స్మార్ట్ ఫీచర్లతో హోమ్ థియేటర్ అనుభూతి కోరుకునే వారికి ఈ PANSEBA Smart Projector మంచి ఎంపికగా కనిపిస్తోంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
సాంకేతిక వార్తలు చిట్కాలు
గాడ్జెట్‌లు

Latest Videos
Recommended Stories
Recommended image1
ఈ ఎల‌క్ట్రిక్ పీల‌ర్‌తో వెల్లుల్లి పొట్టు తీయడం స‌మ‌స్యే కాదు.. ధ‌ర కూడా చాలా త‌క్కువ‌
Recommended image2
Smartphone: భార‌త మార్కెట్లోకి ఇక‌పై ఫిలిప్స్ స్మార్ట్‌ఫోన్‌.. బ‌డ్జెట్ ధ‌ర‌లోనే
Recommended image3
POCO M8x 5G: బిగ్ బ్యాటరీతో రచ్చలేపుతున్న పోకో కొత్త 5G ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు నాన్‌స్టాప్.. పూర్తి వివరాలు ఇవే!
Related Stories
Recommended image1
Free Bus: ఉచిత బ‌స్సు ప‌థ‌కం ఆగిపోనుందా.? అధికారిక ప్ర‌క‌ట‌న చేసిన ప్ర‌భుత్వం
Recommended image2
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 700 కోట్ల‌తో, 63 అంత‌స్థుల అపార్ట్‌మెంట్‌, ఒక్క ప్లాట్ ధ‌ర రూ. 6.2 కోట్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved