Recipes: అద్భుతమైన చికెన్ కర్రీ.. వెరైటీగా సింధి స్టైల్లో ట్రై చేద్దాం!
Recipes: చికెన్ ప్రియులు తినాలే గానీ కొన్ని వందల రకాలు వెరైటీస్ ఉంటాయి. ప్రతీ రకమైన వంటకం అద్భుతంగానే ఉంటుంది. అందుకే ఈసారి చికెన్ కర్రీని వెరైటీగా సింధి స్టైల్ లో ట్రై చేద్దాం.
సింధి స్టైల్ చికెన్ కర్రీ తక్కువ నూనె ఉపయోగించి చేయడం వలన ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఇది తయారు కావలసిన పదార్థాలు మేరినేట్ చేయటానికి అరకేజీ చికెన్,తాజా పెరుగు అరకప్పు, ఒక టీ స్పూన్ పసుపు పొడి, రెండు టీ స్పూన్ ధనియాల పొడి, రెండు టీ స్పూన్లు మిరపపొడి, ఉప్పు రుచికి తగినంత.
ఇప్పుడు గ్రేవీ తయారు చేయడం కోసం మూడు ఉల్లిపాయలు, ఐదు వెల్లుల్లి రెబ్బలు, మూడు చిన్న టమాటలు, నాలుగు పచ్చిమిర్చి, అల్లం అంగుళం ముక్క, ఒక టీ స్పూన్ గసగసాలు, ఎనిమిది జీడిపప్పులు, ఒక టీ స్పూన్ పసుపు పొడి, హాఫ్ టీ స్పూన్ కొత్తిమీర పొడి, ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి, రెండు టీ స్పూన్ కాశ్మీర్ ఎర్ర కారంపొడి పావుకప్పు నూనె.
ఒక అంగుళం దాల్చిన చెక్క, రుచికి సరిపడా ఉప్పు. ముందుగా మనం మేరినేట్ చేయటానికి పైన చెప్పుకున్న పదార్థాలు అన్నీ కలిపి చికెన్ తో మ్యారినేట్ చేయండి. తర్వాత జీడిపప్పు, గసగసాల గింజలను అరకప్పు నీటిలో నానబెట్టండి. ఉల్లిపాయలను ముక్కలుగా కోసి లేత గోధుమ రంగులోకి వచ్చేవరకు నూనెలో వేయించండి.
లు చికెన్- అరకిలో, ఉల్లిపాయలు -2, గోంగూర-2 కట్టలు, పచ్చిమిరపకాయలు -3, అల్లం వెల్లుల్లి పేస్ట్ -2 స్పూన్స్, దాల్చిన చెక్క చిన్న ముక్క, జీలకర్ర ఒక టీ స్పూన్, గసగసాలు 1 టీ స్పూన్, లవంగాలు 4, యాలకులు 2, పసుపు కొంచెం, కారం సరిపడా.
ఉల్లిపాయలు వేగడం దాదాపు పూర్తయ్యాక చివర్లో వెల్లుల్లి జోడించి కొంచెం వేయించండి. తర్వాత వెల్లుల్లి మరియు ఉల్లిపాయలను చల్లార్చండి. ఈలోపు కొన్ని లవంగాలను, దాల్చిన చెక్క, జీడిపప్పు మరియు గసగసాలు వేసి నీటిలో మెత్తగా పేస్ట్ చేయండి. టమాటో, పచ్చిమిర్చి, అల్లం విడిగా రుబ్బుకొని పక్కన పెట్టుకోండి.
బాణలిలో నూనె వేసి అందులో నల్ల యాలిక,ఆకుపచ్చ యాలిక వేసి తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలపండి. అందులో మేరినేట్ చేసిన చికెన్ వేసి చికెన్ తెల్లగా అయినంతవరకు వేగించి తర్వాత ఉల్లిపాయ పేస్ట్ తో బాగా కలపండి.
తర్వాత టమాటా ప్యూరీ వేసి మిశ్రమం దగ్గర పడే వరకు వేయించండి. తర్వాత పైన చెప్పుకున్న మసాలా దినుసులు అన్ని జోడించండి. తర్వాత ఒక గ్లాసు నీరు పోసి పైన ఆవిరి పోకుండా గట్టిగా మూత పెట్టండి. నీరు దగ్గర పడిన తర్వాత కర్రీని పక్కకి దింపేస్తే అద్భుతమైన సింధి స్టైల్ చికెన్ కర్రీ రెడీ.