MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Paneer vs Chicken: పనీర్, చికెన్.. ప్రోటీన్ లో కింగ్ ఎవరు? బరువు తగ్గేందుకు ఏది బెస్ట్?

Paneer vs Chicken: పనీర్, చికెన్.. ప్రోటీన్ లో కింగ్ ఎవరు? బరువు తగ్గేందుకు ఏది బెస్ట్?

Paneer vs Chicken: బరువు తగ్గాలనుకునేవారు పనీర్ తినాలా? చికెన్ ఎంచుకోవాలా? ఈ రెండింటిలో ప్రోటీన్ ఎక్కువగా దేనిలో ఉంటుంది? కేలరీలు, కొవ్వు దేనిలో తక్కువ? కండరాలు బలంగా ఉండటానికి, ఆరోగ్యంగా ఉండడానికి ఏది తినాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

2 Min read
Author : Kavitha G
Published : Oct 12 2026, 01:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
చికెన్ vs పనీర్ ప్రొటీన్
Image Credit : Asianet News

చికెన్ vs పనీర్ ప్రొటీన్

ప్రోటీన్ అనేది మన శరీర ఎదుగుదలకు, కండరాల నిర్మాణానికి, కణజాలాల మరమ్మతుకు చాలా అవసరం. అందుకే జిమ్‌కు వెళ్లేవారు, క్రీడాకారులు, ఫిట్‌నెస్‌పై ఆసక్తి ఉన్నవారు ప్రోటీన్ ఫుడ్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. వెజిటేరియన్స్ ప్రోటీన్ కోసం పనీర్‌పై ఆధారపడితే, నాన్-వెజిటేరియన్స్‌కు చికెన్ ఫస్ట్ ఛాయిస్. అయితే ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రొటీన్ ఇస్తుంది? బరువు తగ్గాలనుకునే వారికి ఏది బెస్ట్? నిపుణుల ప్రకారం ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలు ఏంటో చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ప్రోటీన్ ఎందులో ఎక్కువ ?
Image Credit : Asianet News

ప్రోటీన్ ఎందులో ఎక్కువ ?

ప్రోటీన్ విషయానికి వస్తే చికెన్ దే పైచేయి. 100 గ్రాముల వండిన స్కిన్ లెస్ చికెన్ బ్రెస్ట్‌లో సుమారు 27 నుంచి 31 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. అలాగే 100 గ్రాముల సాధారణ పనీర్‌లో 18 నుంచి 20 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. అయితే పాలు, పనీర్ తయారీ విధానాన్ని బట్టి ఇది కొద్దిగా అటుఇటుగా మారవచ్చు. ఒకే పరిమాణంలో తీసుకున్నప్పుడు పనీర్ కంటే చికెన్ ఎక్కువ ప్రోటీన్ ఇస్తుంది. తక్కువ కేలరీలతో ఎక్కువ ప్రోటీన్ కావాలనుకునే వారికి చికెన్ బెస్ట్ ఆప్షన్.

36
బరువు తగ్గడానికి ఏది బెస్ట్?
Image Credit : gemini

బరువు తగ్గడానికి ఏది బెస్ట్?

బరువు తగ్గే జర్నీలో కేలరీలు, కొవ్వును కంట్రోల్ చేస్తూ ప్రోటీన్ తీసుకోవడం ముఖ్యం. స్కిన్ లెస్ చికెన్ బ్రెస్ట్‌లో కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. దీన్ని 'లీన్ మీట్' అంటారు. ఇది కడుపు నిండిన భావనను ఎక్కువసేపు ఇస్తుంది. శరీరానికి అదనపు కేలరీలను చేర్చదు.

ఫుల్ క్రీమ్ మిల్క్ తో చేసే పనీర్‌లో కొవ్వు, కేలరీలు కాస్త ఎక్కువ. అలాగని బరువు తగ్గాలనుకునే వారు పనీర్ తినకూడదని కాదు. మార్కెట్లో దొరికే 'లో ఫ్యాట్' పనీర్ ఎంచుకుని, మితంగా తింటే బరువును కంట్రోల్ చేసుకోవచ్చు.

46
పనీర్ లోని పోషకాలు
Image Credit : Chat GPT

పనీర్ లోని పోషకాలు

పనీర్ అంటే ప్రోటీన్ మాత్రమే కాదు. కాల్షియం గని. ఇది పాల ఉత్పత్తి కాబట్టి ఇందులో కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలు, దంతాల ఆరోగ్యానికి చాలా మంచివి. వెజిటేరియన్స్‌కు సులభంగా దొరికే బెస్ట్ న్యూట్రిషన్ ఫుడ్ ఇది. కూరగాయలు, సలాడ్లు, పనీర్ భుర్జీ రూపంలో దీన్ని రుచిగా తినొచ్చు. కానీ కొలెస్ట్రాల్ లేదా గుండె సమస్యలు ఉన్నవారు పనీర్‌లోని కొవ్వు శాతాన్ని తప్పక గమనించుకోవాలి.

56
చికెన్ తినడం వల్ల కలిగే లాభాలు
Image Credit : x

చికెన్ తినడం వల్ల కలిగే లాభాలు

చికెన్ విటమిన్లు, మినరల్స్ కి మంచి మూలం. చికెన్‌లో విటమిన్ బి12, నియాసిన్, ఫాస్పరస్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తహీనతను నివారించి, నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే చికెన్ వండే విధానం కూడా ముఖ్యం. చికెన్ ఆరోగ్యకరమైనదే అయినా, నూనెలో డీప్ ఫ్రై చేసినా లేదా ఎక్కువ మసాలాలు దట్టించినా కేలరీలు పెరుగుతాయి. దానికి బదులుగా ఉడకబెట్టిన లేదా గ్రిల్ చేసిన చికెన్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.

66
ఎవరికి ఏది బెస్ట్?
Image Credit : Chatgpt

ఎవరికి ఏది బెస్ట్?

మీరు నాన్-వెజిటేరియన్ అయితే, తక్కువ కేలరీలు, ఫ్యాట్ లేకుండా ఎక్కువ ప్రోటీన్ కావాలనుకుంటే చికెన్ బ్రెస్ట్ బెస్ట్ ఆప్షన్. మీరు వెజిటేరియన్ అయితే, ఎముకల బలానికి, పోషణకు పనీర్ అద్భుతమైన ప్రోటీన్ సోర్స్. అయితే కేవలం పనీర్‌పైనే ఆధారపడకుండా మొలకలు, సోయా, పప్పుధాన్యాలు కూడా మీ డైట్‌లో చేర్చుకోవడం మంచిది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd: కేవలం గంటలో పాలను గడ్డ పెరుగులా మార్చేయచ్చు..ఈ సింపుల్ చిట్కా తెలిస్తే చాలు..!
Recommended image2
Gold Earrings: డైలీవేర్ కి తక్కువ బడ్జెట్ లో వచ్చే బంగారు కమ్మలు ఇవిగో
Recommended image3
Soft Chapati: పెనంపై చపాతీలు పొంగేలా రావాలంటే ముందుగా చేయాలసిన పని ఇదే
Related Stories
Recommended image1
Kitchen Hacks: ఉల్లిపాయలు, బంగాళాదుంపలు కలిపి నిల్వ చేయకూడదా? చేస్తే ఏమవుతుంది?
Recommended image2
Bread Idli: పప్పు నానబెట్టక్కర్లేదు.. పిండి రుబ్బక్కర్లేదు.. నిమిషాల్లో బ్రెడ్‌ ఇడ్లీ రెడీ!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved