MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Bread Idli: పప్పు నానబెట్టక్కర్లేదు.. పిండి రుబ్బక్కర్లేదు.. నిమిషాల్లో బ్రెడ్‌ ఇడ్లీ రెడీ!

Bread Idli: పప్పు నానబెట్టక్కర్లేదు.. పిండి రుబ్బక్కర్లేదు.. నిమిషాల్లో బ్రెడ్‌ ఇడ్లీ రెడీ!

Bread Idli: ఇడ్లీలను చాలామంది ఇష్టంగా తింటారు. అయితే బియ్యం, మినప్పప్పు నానబెట్టడం, పిండి రుబ్బడం వంటి పనులేవీ లేకుండా రుచికరమైన ఇడ్లీలను నిమిషాల్లో చేసుకోవచ్చు. ఇంట్లో బ్రెడ్ ఉంటే చాలు. మరి నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రెడ్ ఇడ్లీని ఎలా చేయాలో చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Oct 10 2026, 02:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బ్రెడ్ ఇడ్లీ రెసిపీ
Image Credit : Asianet News

బ్రెడ్ ఇడ్లీ రెసిపీ

ఇడ్లీ అనగానే బియ్యం, మినప్పప్పు నానబెట్టి, రుబ్బి, పులియబెట్టడం వంటి పనులు ఉంటాయి. కానీ ఈ బ్రెడ్ ఇడ్లీకి అవేమీ అవసరం లేదు. బ్రెడ్, రవ్వ, పెరుగు ఉపయోగించి సులభంగా ఇడ్లీలు తయారు చేయవచ్చు. ఇంట్లో మిగిలిపోయిన బ్రెడ్‌ను వృథా చేయకుండా వాడుకోవడానికి ఇదో మంచి మార్గం. ఇది మన రెగ్యులర్ ఇడ్లీ టేస్ట్ కి కాస్త భిన్నంగా ఉండవచ్చు. కానీ తక్కువ పదార్థాలతో, పిండి పులియబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు వేడివేడి బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసుకోవాలి అనుకునేవారికి ఇది మంచి ఆప్షన్. మరి ఆలస్యమెందుకు బ్రెడ్ ఇడ్లీ ఎలా చేయాలో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బ్రెడ్ ఇడ్లీ తయారీ విధానం
Image Credit : Asianet News

బ్రెడ్ ఇడ్లీ తయారీ విధానం

బ్రెడ్ ఇడ్లీ తయారీలో పదార్థాలను సరిగ్గా కలపడమే ముఖ్యమైన పని. బ్రెడ్ వల్ల పిండికి మృదుత్వం వస్తుంది. రవ్వ ఇడ్లీకి సరైన ఆకృతిని ఇస్తుంది. ఇక పెరుగు పిండికి తేమతో పాటు కాస్త పుల్లటి రుచిని అందిస్తుంది. అందుకే ఈ మూడింటినీ సరైన మోతాదులో తీసుకుని, తగినంత నీళ్లు పోసి ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉంటే ఇడ్లీలు రాయిలా వస్తాయి. అలాగని నీళ్లు ఎక్కువైతే ఉడికాక ముద్దగా, జిగురుగా మారిపోతాయి.

35
పిండిని నాననివ్వడం
Image Credit : Asianet News

పిండిని నాననివ్వడం

ముందుగా బ్రెడ్‌ను చిన్న ముక్కలుగా కట్ చేసి లేదా పొడి చేసి పెట్టుకోవాలి. అందులో రవ్వ, పెరుగు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని కలుపుకోవాలి. పిండి కలపగానే వెంటనే ఇడ్లీ ప్లేట్లలో వేయకూడదు. కాసేపు పిండిని నాననిస్తే రవ్వ నీటిని పీల్చుకుంటుంది. ఆ తర్వాత పిండి చిక్కదనాన్ని బట్టి అవసరమైతే మరికొన్ని నీళ్లు కలుపుకోవచ్చు. పిండి మన రెగ్యులర్ ఇడ్లీ పిండిలా జారుగా ఉండాలి.

45
వీటిని కూడా వేసుకోవచ్చు
Image Credit : Asianet News

వీటిని కూడా వేసుకోవచ్చు

ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా నూనె లేదా నెయ్యి రాసి సిద్ధంగా ఉంచుకోవాలి. గుంటల్లో పిండి వేసేటప్పుడు అంచుల వరకు నింపకూడదు. ఉడికేటప్పుడు ఇడ్లీలు కాస్త ఉబ్బుతాయి కాబట్టి ఖాళీ ఉంచాలి. మీకు ఇష్టమైతే సన్నగా తరిగిన క్యారెట్, కొత్తిమీర లేదా పచ్చిమిర్చి ముక్కలను పిండిలో కలుపుకోవచ్చు. దీనివల్ల ఇడ్లీ రుచి, రంగు బాగుంటాయి. పిండి కలిపాక ఎక్కువసేపు పక్కన పెట్టకూడదు.

55
కాసేపు చల్లారనివ్వాలి
Image Credit : Asianet News

కాసేపు చల్లారనివ్వాలి

ముందుగానే నీళ్లు మరిగించి పెట్టుకున్న ఇడ్లీ పాత్రలో ప్లేట్లను పెట్టి ఉడికించాలి. మంటను మీడియంలో ఉంచి, ఇడ్లీలు ఉడికాయో లేదో చూసుకుంటూ ఉండాలి. ఇడ్లీ ఉడికిందో లేదో తెలుసుకోవడానికి మధ్యలో ఒక టూత్‌పిక్ లేదా చాకుతో గుచ్చి చూడండి. పిండి అంటుకోకుండా వస్తే ఉడికినట్లే. స్టవ్ మీద నుంచి దించగానే వేడివేడిగా తీయకుండా, కాస్త చల్లారనిస్తే ప్లేట్ల నుంచి ఇడ్లీలు సులభంగా వస్తాయి. మీకు ఇష్టమైన చట్నీతో తినవచ్చు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
చిట్కాలు మరియు ఉపాయాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rice: వైట్ రైస్ కాదు.. రెడ్ రైస్ , బ్లాక్ రైస్.. ఏది తినడం ఆరోగ్యానికి మంచిది?
Recommended image2
Hair Growth: ఒత్తైన జుట్టు కోసం.. వీటిని రెగ్యులర్ గా తింటే చాలు!
Recommended image3
Navaratri Fasting: నవరాత్రి ఉపవాసం చేస్తున్నారా? అయితే ఈ 9 రోజులు ఇలా ప్లాన్ చేసుకోండి
Related Stories
Recommended image1
Hair Growth: ఒత్తైన జుట్టు కోసం.. వీటిని రెగ్యులర్ గా తింటే చాలు!
Recommended image2
Egg vs Chicken vs Mutton: గుడ్డు, చికెన్, మటన్.. ఈ మూడింటిలో ప్రోటీన్ దేనిలో ఎక్కువ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved