శోభితా ధూళిపాళ అందం రహస్యం ఇదేనా..!
శోభితా ధూళిపాళ నటించింది కొన్ని సినిమాలే అయినా తన నటనతో చాలా మంది అభిమానులను సంపాదించుకుంది. ఇకపోతే ఈ బ్యూటీ అందానికి వంక పెట్టడానికి ఏదీ లేదు. ముఖ్యంగా ఆ మెరిసే చర్మం. ఈ హీరోయిన్ చర్మం ఎంత కాంతివంతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే దీనికి ఒక సీక్రేట్ ఉందట. అదేంటో తెలుసా?
Sobhita Dhulipala’
శోభితా ధూలిపాళ తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించింది. అయితే ఈ బ్యూటీ నటించింది కొన్ని సినిమాలే అయినా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ముఖ్యంగా పొన్నియిన్ సెల్వన్ మూవీలో లో రాజ రాజ చోళన్ భార్య వనతి పాత్రలో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఇక ఈ మూవీలో ఆమె లుక్ అందరికీ తెగ నచ్చేసింది. ముఖ్యంగా ఆమె మెరిసే చర్మం. అవును శోభితా ధూలిపాళ స్కిన్ ఎంతో షైనీగా, అందంగా ఉంటుంది. అసలు అందంగా ఉండేందుకు శోభిత ధూలిపాళ ఏం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
Sobhita Dhulipala’
శెనగ పిండి
శెగనపిండిని స్కిన్ కేర్ కోసం ఎన్నో ఏండ్లుగా ఉపయోగిస్తూ వస్తున్నారు. బ్యూటీ ప్రొడక్ట్స్ బదులుగా శెనగపిండినే పెట్టమని అమ్మమ్మలు కూడా చెప్తుంటారు. నిజానికి శెనగపిండి మన చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. శెనగపిండిని చర్మానికి అప్లై చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. ట్యాన్ కూడా తగ్గుతుంది. చర్మం అందంగా మెరుస్తుంది.
పచ్చి పాలు
శోభిత ధూలిపాళ పచ్చి పాలను చర్మానికి బాగా ఉపయోగిస్తుందట. పచ్చిపాలను డైరెక్ట్ గా చర్మానికి అప్లై చేయడం వల్ల మొటిమలయ్యే ఛాన్స్ తగ్గుతుంది. అలాగే స్కిన్ ఎప్పటికీ యవ్వనంగా ఉంటుంది.
కాస్టర్ ఆయిల్
శోభితా ధూళిపాళ కనుబొమ్మలు ఎంత మందంగా ఉంటాయో మీరు గమనించే ఉంటారు. ఈ మధ్య చాలా మంది ఒత్తైన కనుబొమ్మలనే ఇష్టపడుతున్నారు. మందపాటి కనుబొమ్మలు ముఖాన్ని మరింత అందంగా కనిపించేలా చేస్తాయి. అందుకే శోభితా ధూలిపాళ కనుబొమ్మలకు ఆముదం నూనెను పెడుతుంది. ఈ నూనె కనుబొమ్మలను ఒత్తుగా చేస్తుంది.
కొబ్బరి నూనె
శోభిత ధూళిపాళ పెదవులు ఎప్పుడూ వాడిపోవు. ఎర్రగా, తాజాగా ఉంటాయి. ఈ బ్యూటీ తన పెదవులను ఎక్కువసేపు తాజాగా, హైడ్రేట్ గా ఉంచడానికి పెదవులకు కొబ్బరి నూనెను పెడుతుంది.
పండ్లు
శోభిత చర్మ సంరక్షణ, ఆరోగ్యం కోసం పండ్లను బాగా తింటుంది. రోజువారీ హెల్తీ ఆహారంతో పాటుగా పండ్లను కూడా తింటుంది. పండ్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయని శోభిత నమ్ముతుంది.