MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Tamarind Leaves: చింత చిగురు తింటే ఎన్ని లాభాలో తెలుసా? ఒక్కసారైనా తినాల్సిందే!

Tamarind Leaves: చింత చిగురు తింటే ఎన్ని లాభాలో తెలుసా? ఒక్కసారైనా తినాల్సిందే!

Tamarind Leaves: చింత చిగురుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీజన్ వచ్చిందంటే చాలు మార్కెట్‌లో దీనికి డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. నిపుణుల ప్రకారం చింత చిగురు తింటే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Kavitha G
Published : Jun 19 2026, 03:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
చింత చిగురు తినడం వల్ల కలిగే లాభాలు
Image Credit : our own

చింత చిగురు తినడం వల్ల కలిగే లాభాలు

చింత చెట్టుకు కొత్తగా వచ్చే లేత ఆకులను చింత చిగురు అంటారు. దీని రుచి మామూలుగా ఉండదు. చింత చిగురు పప్పు, చింత చిగురు చికెన్, చింత చిగురు పచ్చడి వంటి వంటకాలు కేవలం రుచికోసమే కాదు, ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయని చెబుతున్నారు నిపుణులు. చాలామంది చింత చిగురును కేవలం పులుపు రుచి కోసం మాత్రమే ఉపయోగిస్తారు. కానీ ఇందులో దాగి ఉన్న పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. మరి చింత చిగురు తినడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందామా..  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
చింత చిగురులో ఉండే పోషకాలు
Image Credit : our own

చింత చిగురులో ఉండే పోషకాలు

చింత చిగురులో విటమిన్ C, విటమిన్ A, ఐరన్, కాల్షియం, పొటాషియం, ఫైబర్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి శరీరంలో పేరుకుపోయే హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. ఫలితంగా కణాల ఆరోగ్యం మెరుగుపడి, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

36
రోగనిరోధక శక్తి
Image Credit : Getty

రోగనిరోధక శక్తి

రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా చింత చిగురు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ C శరీరంలోని రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్లతో బాధపడేవారు సీజన్‌లో లభించే చింత చిగురును ఆహారంలో చేర్చుకోవడం వల్ల మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

46
మెరుగైన జీర్ణక్రియ
Image Credit : Getty

మెరుగైన జీర్ణక్రియ

జీర్ణక్రియను మెరుగుపరచడంలో చింత చిగురు సహాయపడుతుంది. ఇందులో ఉండే సహజ ఫైబర్.. ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. మలబద్ధకం సమస్యతో బాధపడేవారికి ఇది కొంత ఉపశమనం కలిగించవచ్చు. అలాగే ఆకలిని పెంచే గుణం కూడా చింత చిగురులో ఉంటుంది.

56
రక్తహీనత దూరం
Image Credit : Getty

రక్తహీనత దూరం

చింత చిగురులో ఉండే ఐరన్.. రక్తహీనత సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా మహిళలు, యువతులు, పెరుగుతున్న పిల్లలకు ఐరన్ చాలా అవసరం. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరచడానికి ఐరన్ కీలకంగా పనిచేస్తుంది. అయితే తీవ్రమైన రక్తహీనత ఉన్నవారు వైద్యుల సూచనల మేరకు చింత చిగురు తీసుకోవడం మంచిది.

66
ఎముకల ఆరోగ్యం
Image Credit : Getty

ఎముకల ఆరోగ్యం

ఎముకల ఆరోగ్యానికి కూడా చింత చిగురు మేలు చేస్తుంది. ఇందులో ఉండే కాల్షియం, ఇతర ఖనిజాలు ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడతాయి. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా చింత చిగురు మేలు చేస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, మొక్కల ఆధారిత సహజ సమ్మేళనాలు శరీరంలోని వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. అయితే చింత చిగురు ఆరోగ్యానికి ఎంతమంచిదైనా మితంగా తీసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Wrinkles: వయసు పెరుగుతుంటే ముఖంపై ముడతలు వస్తున్నాయా? ఇలా చేస్తే ముడతలు మాయం
Recommended image2
Rice Water: బియ్యం నీటిని ఇలా వాడితే ముఖం మెరిసిపోవడం పక్కా!
Recommended image3
Coriander Water: ధనియాల నీరు ఇలా వాడితే.. జుట్టు వేగంగా పెరుగుతుంది, ప్రతిరోజూ ఇదొక్కటి చేస్తే చాలు
Related Stories
Recommended image1
Glowing Skin Tips: రాత్రి పడుకునే ముందు ఈ ఒక్కటి రాసినా చాలు.. ముఖం మెరిసిపోతుంది!
Recommended image2
Dark Chocolate: ఆడవాళ్లు డార్క్ చాక్లెట్ ఎందుకు తినాలో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved