MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Glowing Skin Tips: రాత్రి పడుకునే ముందు ఈ ఒక్కటి రాసినా చాలు.. ముఖం మెరిసిపోతుంది!

Glowing Skin Tips: రాత్రి పడుకునే ముందు ఈ ఒక్కటి రాసినా చాలు.. ముఖం మెరిసిపోతుంది!

Glowing Skin Tips: రాత్రి పడుకునే ముందు మనం పాటించే చిన్న చిన్న అలవాట్లు చర్మ ఆరోగ్యంపై పెద్ద ప్రభావం చూపుతాయి. ముఖం అందంగా, కాంతివంతంగా మారాలంటే ఈ ఒక్క సింపుల్ స్టెప్ ఫాలో అయితే చాలు అంటున్నారు నిపుణులు. అదేంటో, ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Jun 17 2026, 06:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కాంతివంతమైన ముఖం కోసం చిట్కాలు
Image Credit : stockPhoto

కాంతివంతమైన ముఖం కోసం చిట్కాలు

చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా కనిపించాలంటే ఖరీదైన క్రీములతో పనిలేదంటున్నారు నిపుణులు. ఇంట్లో దొరికే సహజ పదార్థాలతో కూడా ముఖం మెరిసిపోతుందని చెబుతున్నారు. మరి ఏది రాస్తే ముఖం అందంగా, కాంతివంతంగా మారుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
అలొవెరా జెల్
Image Credit : stockPhoto

అలొవెరా జెల్

నిపుణుల ప్రకారం అలొవెరా జెల్‌ చర్మ ఆరోగ్యానికి చాలామంచిది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు చర్మాన్ని శాంతింపజేయడంలో సహాయపడతాయి. రోజంతా దుమ్ము, కాలుష్యం, సూర్యరశ్మి వల్ల చర్మం డ్యామేజ్ అవుతుంది. రాత్రి పడుకునే ముందు ముఖాన్ని సున్నితంగా శుభ్రం చేసి, తక్కువ పరిమాణంలో స్వచ్ఛమైన అలొవెరా జెల్ రాయడం వల్ల చర్మానికి అవసరమైన హైడ్రేషన్ అందుతుంది. ఇది చర్మాన్ని లోతుగా మాయిశ్చరైజ్ చేసి, ఉదయం లేచేసరికి ఫ్రెష్‌గా కనిపించడానికి సహాయపడుతుంది.

36
మొటిమలు తగ్గే అవకాశం
Image Credit : Getty

మొటిమలు తగ్గే అవకాశం

నిపుణుల ప్రకారం, అలొవెరా జెల్ చర్మంలోని ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. మొటిమలు ఉన్నవారికి ఇది ఇంకా మంచిది. ఎందుకంటే ఇది చర్మాన్ని ఆయిల్‌గా మార్చకుండా తేలికగా హైడ్రేట్ చేస్తుంది. దీనివల్ల కొత్త మొటిమలు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది.

46
మచ్చలు మాయం
Image Credit : Getty

మచ్చలు మాయం

అలొవెరా జెల్‌ను రాత్రి సమయంలో ఉపయోగించడం వల్ల స్కిన్ రీజనరేషన్ వేగవంతం అవుతుంది. సాధారణంగా నిద్ర సమయంలో చర్మ కణాలు రిపేర్ చేసుకుంటాయి. ఈ సమయంలో అలొవెరా జెల్ రాస్తే చర్మం త్వరగా రికవర్ అవుతుంది. చిన్న చిన్న మచ్చలు, పిగ్మెంటేషన్ తగ్గడంలో కూడా ఇది సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

56
ఫ్రెష్ అలొవెరా జెల్
Image Credit : Getty

ఫ్రెష్ అలొవెరా జెల్

మార్కెట్లో లభించే అన్ని అలొవెరా జెల్‌లు సహజమైనవి కావు. కొన్ని ప్రోడక్ట్స్‌లో కెమికల్స్ లేదా కలర్స్ కలిపి ఉండవచ్చు. అందువల్ల సాధ్యమైనంతవరకు తాజా అలొవెరా జెల్ ఉపయోగించడం మంచిది. అలాగే ఉపయోగించే ముందు చిన్న ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం ఉత్తమం.

66
ఇది కూడా ముఖ్యమే..
Image Credit : unsplash

ఇది కూడా ముఖ్యమే..

ముఖాన్ని సరిగ్గా శుభ్రం చేయకుండా ఏది  రాసినా పూర్తి ప్రయోజనం ఉండదు. రోజంతా పేరుకుపోయిన ఆయిల్, దుమ్ము తొలగించిన తర్వాతే చర్మం యాక్టివ్‌గా పదార్థాలను గ్రహిస్తుంది. కాబట్టి మైల్డ్ ఫేస్ వాష్‌తో రోజుకు రెండు సార్లు ముఖం కడగడం, సరైన నిద్ర, తగినంత నీరు తాగడం కూడా చర్మ ఆరోగ్యానికి ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
సౌందర్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chitti Mutyalu Mutton Pulav: వీకెండ్ సెట్ చేసే టాప్ నాచ్ మటన్ పులావ్..
Recommended image2
Cockroaches: ఇంట్లో బొద్దింకలు తిరుగుతున్నాయా? ఇదొక్కటి చేస్తే.. మళ్లీ ఇంట్లో బొద్దింకలు తిరగవు..!
Recommended image3
Vinayaka Chavithi Prasadam Recipes: బొజ్జ గణపయ్యకు ఇష్టమైన 5 ప్రసాదాలు..హడావిడి లేకుండా గంటలో రెడీ
Related Stories
Recommended image1
Fitness Tips: అమ్మాయిలు సన్నగా, ఫిట్‌గా ఉండడానికి 5 బెస్ట్ టిప్స్ ఇవిగో!
Recommended image2
Rice Water: బియ్యం నీళ్లతో మ్యాజిక్.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved