డార్క్ చాక్లెట్‌లో కోకో, ఇతర పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికి ఇది చాలా మేలు చేస్తుంది.
డార్క్ చాక్లెట్‌లో కాపర్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి గర్భాశయ కండరాలకు విశ్రాంతినిచ్చి, నెలసరి నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.
డార్క్ చాక్లెట్‌లో ఐరన్ అధికంగా ఉంటుంది. నెలసరి సమయంలో మహిళల్లో ఐరన్ స్థాయిలు పడిపోకుండా ఇది కాపాడుతుంది.
డార్క్ చాక్లెట్‌లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది ప్రీ-మెన్‌స్ట్రువల్ సమయంలో వచ్చే మానసిక ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది.
రోజూ డార్క్ చాక్లెట్ తినడం వల్ల ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయిలు తగ్గుతాయి. తద్వారా ఒత్తిడిని నియంత్రణలో ఉంచుకోవచ్చు.
రోజూ డార్క్ చాక్లెట్ తినడం వల్ల ఎండార్ఫిన్లు, సెరటోనిన్, డోపమైన్ వంటి 'ఫీల్-గుడ్' హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.
డార్క్ చాక్లెట్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరచడమే కాకుండా, చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి.
Heavy Anklets: హెవీ లుక్ ఇచ్చే వెండి కాలి పట్టీల డిజైన్లు
Blouse back Designs: చీరలపై బ్లౌజ్‌లకు అదిరిపోయే బ్యాక్ డిజైన్లు
Gardening: మట్టి కూడా లేకుండా.. బాల్కనీలో ఈజీగా ఈ మొక్కలు పెంచేయండి
Heavy Mangalsutra:మెడ నిండుగా కనిపించే హెవీ మంగళసూత్రాలు..ఓ లుక్కేయండి