MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Hantavirus: మ‌ళ్లీ లాక్‌డౌన్ త‌ప్ప‌దా.? ప్ర‌పంచాన్ని భ‌య‌పెడుతోన్న‌ హంటా వైర‌స్‌, అస‌లేంటీది?

Hantavirus: మ‌ళ్లీ లాక్‌డౌన్ త‌ప్ప‌దా.? ప్ర‌పంచాన్ని భ‌య‌పెడుతోన్న‌ హంటా వైర‌స్‌, అస‌లేంటీది?

Hantavirus: తాజాగా వెలుగులోకి వ‌చ్చిన‌ హంటా వైర‌స్ ప్ర‌పంచాన్ని భ‌య‌పెడుతోంది. ఇది కూడా కరోనాలాగా ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తుందా? మళ్లీ లాక్‌డౌన్‌లు వస్తాయా? మాస్క్‌లు తప్పనిసరిగా మారతాయా? అనే సందేహాలు వ‌స్తున్న నేప‌థ్యంలో WHO ప్ర‌క‌ట‌న చేసింది. 

2 Min read
Author : Narender Vaitla
Published : May 08 2026, 03:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఎలా వెలుగులోకి వ‌చ్చింది.?
Image Credit : Asianet News

ఎలా వెలుగులోకి వ‌చ్చింది.?

క్రూజ్‌ నౌక ఎంవీ హోండియస్‌లో ఈ ‘హంటా వైరస్‌’ వ్యాపించింది. దీనివ‌ల్ల కొన్ని మ‌ర‌ణాలు సంభ‌వించ‌డంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళ‌న మొద‌లైంది. హంటావైరస్ ప్రధానంగా ఎలుకల ద్వారా మనుషులకు సోకుతుంది. ఎలుకల మూత్రం, విసర్జనలు లేదా లాలాజలంతో కలుషితమైన ప్రాంతాల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. సాధారణంగా ఇది మనిషి నుంచి మనిషికి సులభంగా సోకదు. అయితే ప్రస్తుతం నమోదైన ఘటనలో “అండీస్ స్ట్రెయిన్” అనే ప్రత్యేక రకం వైరస్ ఉన్నట్లు WHO తెలిపింది. ఈ రకం మాత్రం చాలా దగ్గర సంబంధాలు, ఎక్కువ సమయం కలిసి ఉండడం వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ ఇది కరోనా లాగా గాలిలో వేగంగా వ్యాపించదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కరోనాకు హంటావైరస్‌కు ఉన్న ప్రధాన తేడాలు
Image Credit : our own

కరోనాకు హంటావైరస్‌కు ఉన్న ప్రధాన తేడాలు

కరోనా వైరస్ గాలిమార్గం ద్వారా వేగంగా వ్యాపించి ప్రపంచవ్యాప్తంగా మహమ్మారిగా మారింది. ఒక గదిలో చాలామందికి ఒకేసారి సోకే ప్రమాదం ఉండేది. కానీ హంటావైరస్ పరిస్థితి అలా కాదు. హంటావైరస్ వ్యాప్తి చాలా పరిమితంగా ఉంటుంది. ఎక్కువసేపు సన్నిహితంగా ఉంటేనే ఇది వ్యాపిస్తుంది. అందువల్ల పెద్ద ఎత్తున మహమ్మారిగా మారే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని WHO పేర్కొంది.

34
అర్జెంటీనాలో జరిగిన ఘటనను గుర్తుచేసిన WHO
Image Credit : our own

అర్జెంటీనాలో జరిగిన ఘటనను గుర్తుచేసిన WHO

WHO అత్యవసర ఆరోగ్య కార్యక్రమ విభాగానికి చెందిన అబ్దిరహ్మాన్ మహమూద్ మాట్లాడుతూ 2018-19లో అర్జెంటీనాలో ఇలాంటి పరిస్థితి ఎదురైందని చెప్పారు. ఆ సమయంలో ఒక బాధితుడు సామాజిక కార్యక్రమానికి హాజరుకావడంతో చాలామందికి వైరస్ సోకింది. ప్రస్తుతం కూడా క్రూయిజ్ షిప్‌లో దగ్గర సంబంధాల కారణంగా కేసులు నమోదయ్యాయని తెలిపారు. అయితే కాంటాక్ట్ ట్రేసింగ్, ఐసోలేషన్ వంటి చర్యలను కచ్చితంగా అమలు చేస్తే వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని WHO నమ్మకం వ్యక్తం చేసింది.

44
మళ్లీ ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి వస్తుందా?
Image Credit : our own

మళ్లీ ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి వస్తుందా?

ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ ఘాబ్రేయెసస్ మాట్లాడుతూ హంటావైరస్ ఇంక్యుబేషన్ పీరియడ్ ఆరు వారాల వరకు ఉండొచ్చని తెలిపారు. అందువల్ల మరికొన్ని కేసులు బయటపడే అవకాశం ఉందన్నారు. అయితే ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య ముప్పు స్థాయి చాలా తక్కువగానే ఉందని WHO అంచనా వేస్తోంది. ఇది కరోనా ప్రారంభ దశల మాదిరి పరిస్థితి కాదని, ఒక పరిమిత ప్రాంతంలో నమోదైన వ్యాప్తి మాత్రమేనని స్పష్టం చేసింది. ప్రజలు అనవసర భయాందోళనలకు గురికాకుండా పరిశుభ్రత పాటించడం, ఎలుకల సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
జీవనశైలి
ఆరోగ్యం
ప్రపంచం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Thailand Trip New Rules: థాయ్‌లాండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? సెప్టెంబర్ 15 నుంచి భారతీయులకు కొత్త రూల్స్
Recommended image2
Urine : మూత్రం ఎందుకు దుర్వాసన వస్తుంది? అసలు శరీరంలో మూత్రం ఎలా తయారవుతుంది?
Recommended image3
Chanakya Niti: చాణక్యుడి ప్రకారం.. ఈ 4 సందర్భాల్లో మౌనంగా ఉండటమే తెలివైన పని!
Related Stories
Recommended image1
Folk Song: పెళ్లి ఏదైనా ఈ పాట ఉండాల్సిందే.. నెల రోజుల్లో 3 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్ షేక్‌
Recommended image2
మీరు అద్దె ఇంట్లో ఉంటారా.? అయితే మీకు ఈ ఏసీ ప‌ర్‌ఫెక్ట్. ఎక్క‌డికంటే అక్క‌డికి తీసుకెళ్లొచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved