MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Weight Loss: పరగడుపున రోజూ ఇవి తింటే.. బరువు తగ్గడం చాలా ఈజీ..!

Weight Loss: పరగడుపున రోజూ ఇవి తింటే.. బరువు తగ్గడం చాలా ఈజీ..!

 Weight Loss: ఈ న్యూ ఇయర్ లో ఎలాగైనా బరువు తగ్గాలని రెజల్యూషన్ తీసుకున్నారా? అయితే.. ప్రతిరోజూ కొన్ని రకాల ఆహారాలను డైట్ లో భాగం చేసుకుంటే.. ఈజీగా బరువు తగ్గొచ్చు. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jan 02 2026, 06:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Weight Loss
Image Credit : Getty

Weight Loss

బరువు తగ్గాలని ప్రయత్నించే వారు మన చుట్టూ చాలా మంది ఉంటారు. ముఖ్యంగా న్యూ ఇయర్ వచ్చింది అంటే..ఈ ఏడాది ఎలాగైనా బరువు తగ్గాలని నిర్ణయం తీసుకుంటారు. జిమ్ కి వెళ్లడం మొదలుపెడుతూ ఉంటారు. కఠినమైన డైట్ ఫాలో అవుతూ ఉంటారు.అయితే.. బరువు తగ్గాలి అనుకుంటే కేవలం డైట్ చేస్తే సరిపోదు. రోజును ఎలా మొదలుపెడుతున్నాం అనేది కూడా చాలా ముఖ్యం. ఉదయాన్నే ఖాళీ కడుపుతో మనం తీసుకునే ఆహారం మన మెటబాలిజాన్ని ప్రభావితం చేస్తుంది. ఆకలిని నియంత్రిస్తుంది. శరీరానికి శక్తిని అందిస్తుంది.. ఫిట్‌నెస్ కోచ్ లు చెప్పిన దాని ప్రకారం.. ప్రతిరోజూ పరగడుపున కొన్ని ఆహారాలు తీసుకుంటే చాలా ఈజీగా బరువు తగ్గొచ్చు.

23
1.నానపెట్టిన బాదం, వాల్ నట్స్...
Image Credit : Getty

1.నానపెట్టిన బాదం, వాల్ నట్స్...

ప్రతిరోజూ ఉదయాన్నే నానపెట్టిన బాదం పప్పు, వాల్ నట్స్ తీసుకోవాలి. వీటిలో ప్రోటీన్, ఫైబర్, హెల్దీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మెటబాలిజాన్ని వేగవంతం చేస్తాయి. వీటిని తినడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. దీని కారణంగా అనవసరపు ఆహారం తినకుండా ఉంటాం. ఫలితంగా బరువు తగ్గగలం. అంతేకాదు.. ఇవి తింటే రోజంతా ఎనర్జిటిక్ గా కూడా ఉంటారు.

2.చియా సీడ్స్ వాటర్...

పరగడుపున చియా సీడ్స్ తో కలిపిన వాటర్ తాగడం వల్ల చాలా ఈజీగా బరువు తగ్గగలం. ఈ చియా సీడ్స్ తీసుకోవడం వల్ల ఆకలిని నియంత్రిస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఓవర్ ఈటీంగ్ సమస్య కూడా తగ్గుతుంది.

Related Articles

Related image1
Hair Care: 40 ఏళ్లు దాటినా.. జుట్టు రాలకూడదంటే....ఈ నాలుగు తింటే చాలు..!
Related image2
Weight Loss: బరువు తగ్గాలి కానీ, స్వీట్ తినాలని ఉందా...? ఇవి బెస్ట్ ఆప్షన్
33
3.ఉసిరికాయ జ్యూస్..
Image Credit : Getty

3.ఉసిరికాయ జ్యూస్..

చక్కెర కలపకుండా తీసుకునే ఆమ్లా జ్యూస్ బరువు తగ్గడానికి చాలా మంచిది. ఈ జ్యూస్ తాగడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. ఆకలిని నియంత్రిస్తుంది. శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపడంలో సహాయం చేస్తుంది.

4. పసుపు + మిరియాల నీరు

గోరువెచ్చని నీటిలో పసుపు, కొద్దిగా మిరియాల పొడి కలిపి తాగడం చాలా ప్రయోజనకరం. ఇది తాగడం వల్ల శరీరంలో పేరుకున్న కొవ్వు కరుగుతుంది. శరీర వాపు తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

5. బ్రెజిల్ నట్

బ్రెజిల్ నట్‌లో సెలీనియం, ప్రోటీన్, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి థైరాయిడ్ పనితీరును మెరుగుపరచి, హార్మోన్ల సమతుల్యతను కాపాడతాయి. దీని వల్ల బరువు నియంత్రణ సులభమవుతుంది. రోజుకు ఒక్కటి లేదా రెండు సరిపోతాయి.

చివరిగా ఒక ముఖ్యమైన విషయం…

ఖాళీ కడుపుతో సరైన ఆహారం తీసుకుంటేనే బరువు తగ్గగలరు. అయితే, ఆహారం ఒక్కటే ఎలాంటి మ్యాజిక్ చేయదు. ఆరోగ్యకరమైన ఆహారం తినడం, సరైన నిద్ర, మంచి నీరు తాగడం చాలా ముఖ్యం. అయితే.. బరువు తగ్గడం అనేది ఒక్క రోజులో జరగదు. ఓపికగా ఉంటూ ఆరోగ్యకరమైన అలవాట్లు ఫాలో అయితేనే ఇది సాధ్యం అవుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Cardamom: భోజనం తర్వాత రోజూ యాలకులు తింటే ఏమౌతుంది?
Recommended image2
Budget Travel : కేవలం వేల రూపాయల ట్రిప్.. కోటీశ్వరుల్లా లగ్జరీస్ ఎంజాయ్ చేసే దేశమేదో తెలుసా?
Recommended image3
Relationships: మూడేళ్ల మా ప్రేమను అబ్బాయి అమ్మానాన్న ఎంత దారుణంగా చంపేశారో తెలుసా?
Related Stories
Recommended image1
Hair Care: 40 ఏళ్లు దాటినా.. జుట్టు రాలకూడదంటే....ఈ నాలుగు తింటే చాలు..!
Recommended image2
Weight Loss: బరువు తగ్గాలి కానీ, స్వీట్ తినాలని ఉందా...? ఇవి బెస్ట్ ఆప్షన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved