MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Budget Travel : కేవలం వేల రూపాయల ట్రిప్.. కోటీశ్వరుల్లా లగ్జరీస్ ఎంజాయ్ చేసే దేశమేదో తెలుసా?

Budget Travel : కేవలం వేల రూపాయల ట్రిప్.. కోటీశ్వరుల్లా లగ్జరీస్ ఎంజాయ్ చేసే దేశమేదో తెలుసా?

విదేశీ టూర్ అనగానే లక్షలు ఖర్చవుతాయనుకుంటారు. కానీ చాలా తక్కువ బడ్జెట్‌తోనే ఓ దేశం చుట్టేసి రావచ్చు. భారత్ నుంచి 9 గంటల్లోనే అక్కడికి వెళ్లిపోవచ్చు. అక్కడ మన డబ్బుకు ఎంత విలువుందో తెలిస్తే షాక్ అవుతారు.

2 Min read
Author : Arun Kumar P
Published : Mar 06 2026, 08:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
బడ్జెట్ ప్రెండ్లీ ఫారెన్ టూర్...
Image Credit : X

బడ్జెట్ ప్రెండ్లీ ఫారెన్ టూర్...

విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్నారా? బడ్జెట్ గురించి టెన్షన్ పడుతున్నారా? అయితే మీకోసమే ఈ దేశం. ఆగ్నేయాసియాలోని 'లావోస్' (Laos) ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత చవకైన దేశాల్లో ఒకటిగా నిలిచింది. ఇక్కడి ప్రకృతి అందాలు, తక్కువ ధరలు టూరిస్టులను కట్టిపడేస్తున్నాయి.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
తక్కువ ఖర్చుతో లగ్జరీస్..
Image Credit : gemini

తక్కువ ఖర్చుతో లగ్జరీస్..

2025-2026 లెక్కల ప్రకారం… లావోస్ టూరిస్టులకు చాలా తక్కువ ఖర్చుతో లగ్జరీ అనుభవాన్ని అందిస్తోంది. ఇక్కడ వసతి, ఆహారం, రవాణా ఖర్చులు మన ఇండియా కంటే కూడా తక్కువంటే నమ్మండి.

Related Articles

Related image1
Visa Free Travel: పాస్ పోర్టు ఉంటే చాలు వీసా లేకుండా మనం ఇప్పుడు 56 దేశాలు తిరగేయచ్చు
Related image2
Travel Guide : తెల్లని ఇసుక, రంగురంగుల పగడపు దిబ్బలు.. ఆసియాలోనే అందమైన బీచ్ మన దక్షిణాదిదే.. ఈ ప్రాంతం భూతల స్వర్గమే
37
రూపాయికి అక్కడ విలువెక్కువ...
Image Credit : X

రూపాయికి అక్కడ విలువెక్కువ...

లావోస్ కరెన్సీని 'లావో కిప్' (Lao Kip) అంటారు. మన రూపాయి విలువతో పోలిస్తే ఇది చాలా తక్కువ. మన దేశానికి చెందిన ₹4-5 ఇస్తే, అక్కడ 1000 కిప్‌లు వస్తాయి. అంటే మీ జేబులో కొన్ని వేల రూపాయలుంటే చాలు, అక్కడ మీరు లక్షాధికారిలా ఖర్చు చేయొచ్చు. అందుకే భారతీయులు అక్కడికి వెళ్తే లక్షాధికారుల్లా బతికేయొచ్చు.

47
ఇవీ లావోస్ లో టూరిస్ట్ ఖర్చులు...
Image Credit : X

ఇవీ లావోస్ లో టూరిస్ట్ ఖర్చులు...

ఇటీవల ఓ ట్రావెల్ వ్లాగర్ చెప్పిన వివరాల ప్రకారం లావోస్‌లో అడ్వెంచర్ స్పోర్ట్స్ ధరలు ఇలా ఉన్నాయి.. 

జలపాతం సందర్శన: : ₹200.

జిప్‌లైనింగ్ ; ₹1,000.

పారామోటరింగ్ : ₹3,000. 

హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ : ₹5,000. 

వాహనం అద్దె : రోజుకు కేవలం ₹300కే స్కూటర్ దొరుకుతుంది. 

రైలు ప్రయాణం : దేశమంతా తిరగడానికి ₹1,000 చాలు.

57
లావోస్ ఎలా వెళ్లాలి..?
Image Credit : X

లావోస్ ఎలా వెళ్లాలి..?

భారత్ నుంచి లావోస్‌కు విమానంలో దాదాపు 2,400 నుంచి 2,700 కిలోమీటర్ల దూరం ఉంటుంది. న్యూఢిల్లీ నుంచి లావోస్ రాజధాని వియంటియాన్ (Vientiane) చేరుకోవడానికి సుమారు 9 నుంచి 11 గంటల సమయం పడుతుంది. చాలా విమానాలు బ్యాంకాక్ మీదుగా వెళ్తాయి.
67
చైనా సరిహద్దు దేశం..
Image Credit : X

చైనా సరిహద్దు దేశం..

భౌగోళికంగా ఇది చైనా, వియత్నాం, కంబోడియా, థాయ్‌లాండ్, మయన్మార్ దేశాల మధ్య ఉన్న భూపరివేష్టిత దేశం (Landlocked country).  ప్రసిద్ధ మెకాంగ్ నది ఈ దేశానికి జీవనాడిలాంటిది.

77
లావోస్ సంస్కృతి
Image Credit : X

లావోస్ సంస్కృతి

ఇక్కడి ప్రజల్లో ఎక్కువమంది బౌద్ధమతాన్ని పాటిస్తారు. అందమైన బౌద్ధ దేవాలయాలు, పచ్చని పర్వతాలు, అద్భుతమైన జలపాతాలు ఇక్కడి ప్రధాన ఆకర్షణలు.

చరిత్ర : ఈ దేశం 1893 నుంచి 1953 వరకు ఫ్రెంచ్ కాలనీగా ఉండేది. ఆ ప్రభావం ఇప్పటికీ ఇక్కడి కట్టడాల్లో కనిపిస్తుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ప్రయాణం
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
IRCTC Tour Package: 5 నైట్స్, 6 డేస్.. రూ.17వేలకు ఊటీ, కూనూరు ట్రిప్.. తెలుగు రాష్ట్రాల నుంచే స్పెషల్ ట్రైన్
Recommended image2
Sarees: మగువలు మెచ్చే సొగసైన చీరలు.. చూడకపోతే ఎలా?
Recommended image3
Purple Sarees: ఇలాంటి ఊదా రంగు చీర ఒక్కటైనా మీ దగ్గరుండాల్సిందే
Related Stories
Recommended image1
Visa Free Travel: పాస్ పోర్టు ఉంటే చాలు వీసా లేకుండా మనం ఇప్పుడు 56 దేశాలు తిరగేయచ్చు
Recommended image2
Travel Guide : తెల్లని ఇసుక, రంగురంగుల పగడపు దిబ్బలు.. ఆసియాలోనే అందమైన బీచ్ మన దక్షిణాదిదే.. ఈ ప్రాంతం భూతల స్వర్గమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved