MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Relationship
  • Relationships: మూడేళ్ల మా ప్రేమను అబ్బాయి అమ్మానాన్న ఎంత దారుణంగా చంపేశారో తెలుసా?

Relationships: మూడేళ్ల మా ప్రేమను అబ్బాయి అమ్మానాన్న ఎంత దారుణంగా చంపేశారో తెలుసా?

Relationships: మూడేళ్ల ప్రేమను ఎంత తెలివిగా అబ్బాయి తల్లిదండ్రులు దూరం చేశారో ఒక అమ్మాయి మనతో షేర్ చేసుకుంది. చివరికి వారి ప్రేమకథ కంచికి చేరిందా? లేక కథగానే మిగిలిపోయిందా తెలుసుకోండి. 

3 Min read
Author : Haritha Chappa
Published : Mar 06 2026, 08:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఇది నా ప్రేమకథ
Image Credit : Getty

ఇది నా ప్రేమకథ

మూడు సంవత్సరాలుగా నేను ప్రేమలో ఉన్నాను. ఆ అబ్బాయి కూడా ఎంతో నిజాయితీ ఉన్న వ్యక్తి. మొదట మా పరిచయం సాధారణంగానే సాగింది. కొద్దిగా మాట్లాడుకుంటూ.. అర్థం చేసుకున్నాం. ఆ తర్వాతే ప్రేమికులుగా మారాము. ఒకరిపై ఒకరికి ఎంతో నమ్మకం. ఎలాంటి పరిస్థితి వచ్చినా జీవితంలో ఎదుర్కొవాలని నిర్ణయించుకున్నాం. నేను ప్రేమించిన అబ్బాయి కష్టపడి చదివి బెంగళూరులో మంచి ఉద్యోగం సంపాదించాడు. అతను ఐటి ఉద్యోగం చేస్తూ ఎక్కువ జీతమే ఆర్జిస్తున్నాడు. నేను కూడా నా ఉద్యోగ జీవితాన్ని నిర్మించుకునే ప్రయత్నం మొదలు పెట్టాను. మా భవిష్యత్తు అందంగా ఉండాలంటే ఇద్దరం సంపాదించాల్సిందేనని ప్లాన్ చేసుకున్నాం. కాకపోతే మా కులమే పెద్ద అడ్డుగోడగా మారిపోయింది. మాది తక్కువ జాతి కులంగా చెప్పుకుంటారు. ఇక ఆయన ఒక పెద్ద కులానికి చెందిన వ్యక్తి. మేము మాంసాహారం తింటాం, వారు వాళ్లు మాత్రం తినరు. అయినా కూడా మా ప్రేమకు అవన్నీ అడ్డు కాలేదు. ఒకరోజు అనుకోకుండా మా ప్రేమ విషయం అతని అమ్మానాన్నకు తెలిసిపోయింది. ఇక మా జీవితంలో తుఫాను మొదలైంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కులమే అడ్డుగా మారింది
Image Credit : Getty

కులమే అడ్డుగా మారింది

నేను తక్కువ జాతి కులానికి చెందిన అమ్మాయినని తెలిశాక అతని తల్లిదండ్రులు మా అనుబంధాన్ని పూర్తిగా చెడగొట్టడానికి నిర్ణయించుకున్నారు. మా ప్రేమను అంగీకరించలేదు. అతడిని ఉద్యోగం మానిపించి ఇంటికి రప్పించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ‘అమ్మ ఏడుస్తోంది, అమ్మ మందులు తీసుకోవడం లేదు’ అంటూ ప్రతిరోజు వేధించేవారు. ఇక అతని తాతగారు మనసు బాధగా ఉంది నేను ఎప్పుడు పోతానో ఏంటో ఇంటికి రారా అని పదే పదే పిలిచేవారు. కుటుంబం ప్రతిరోజు భావోద్వేగాలకు గురి చేయడంతో అతను గందరగోళానికి గురయ్యేవాడు. చివరికి ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అతను ఎప్పుడైతే ఆఫీసులో సెలవు అడిగి కొన్ని రోజులు ఇంటికి వెళ్ళాడో.. అతడి తల్లితండ్రి అతడిని ఇంట్లోనే ఉంచి బెంగళూరు వచ్చారు. అతను ఉంటున్న హాస్టల్ గదిని ఖాళీ చేయించి వస్తువులన్నీ తీసుకెళ్లిపోయారు. కనీసం అతనికి ఆ విషయం కూడా చెప్పలేదు. నేను పీజీ హాస్టల్ కి వెళ్ళినప్పుడు నాకు ఆ విషయం తెలిసింది.

34
బ్రేకప్ చెప్పేశాడు
Image Credit : Getty

బ్రేకప్ చెప్పేశాడు

ఇక అతను ఇంటికి చేరుకున్న తర్వాత పరిస్థితి దారుణంగా మారిపోయింది. మా ప్రేమకు ముగింపు పలకాల్సిందేనని అతనిపై ఒత్తిడి తెచ్చారు. ‘నీకు ఉద్యోగం ఉంది కాబట్టే మమ్మల్ని పట్టించుకోవడం లేదు’ అని ఉద్యోగానికి రాజీనామా కూడా చేయించారు. ఇంట్లోనే ఉంచి హౌస్ అరెస్ట్ చేశారు. ఆ సమయంలో అతను తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యాడు.ఇంట్లో పరిస్థితులు చూశాక అతడు ఇలా బతకడం చాలా కష్టమేమో అని భావించాడు. ఒకరోజు నాకు ఫోన్ చేసి ఇక్కడితో మన ప్రయాణం ఆపేద్దామని చెప్పాడు. ఆ మాట విన్నాక నా హృదయం పగిలిపోయినట్లు అయింది. ఎంత ఏడ్చానో తెలియదు. అతడిని ఎంతగానో రిక్వెస్ట్ చేశాను. కానీ అతను ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్ల మా ప్రేమను ముందుకు కొనసాగించేందుకు ఒప్పుకోలేదు. దాంతో మేము పూర్తిగా కొంతకాలం దూరం అయిపోయాము.

44
రిజిస్టర్ మ్యారేజ్ అంటున్నాడు
Image Credit : Getty

రిజిస్టర్ మ్యారేజ్ అంటున్నాడు

మనుషులమైతే దూరమయ్యాం.. కానీ మా మనసులు దూరం కాలేదు. ఒకరోజు మళ్ళీ అతను నాతో మాట్లాడాడు. అప్పుడు తన తల్లిదండ్రులకు చెప్పి మళ్ళీ ఉద్యోగంలో చేరానని చెప్పాడు. కొన్ని షరతులు పెట్టి మరీ వాళ్ళు ఉద్యోగానికి పంపించారని వివరించాడు. అయితే ఈసారి బెంగళూరుకు కాదు చెన్నైకి పంపించారు. కాలం గడుస్తూ ఉంది. మా ఇద్దరం కేవలం ఫోన్లలో కాసేపు మాట్లాడుకుంటున్నాం. ఒకరోజు ఏమైందో ఏమో తెలియదు నాకు ఫోన్ చేశాడు. మనిద్దరం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే ఎవరు మనల్ని విడదీయలేరు అని చెప్పాడు. ఆ మాట వినగానే నాకు ఎంతో సంతోషంగా అనిపించింది. అప్పటి నుంచి మళ్లీ మా ఇద్దరం ఎక్కువగా మాట్లాడుకోవడం ప్రారంభించాం. భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలుపెట్టాం. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునేందుకు ప్లాన్ చేసుకున్నాం. కానీ నా మనసులో భయం మాత్రం పెరిగిపోయింది. అతని కుటుంబానికి ఈ విషయం తెలిస్తే ఎన్ని సమస్యలు సృష్టిస్తారో తెలియదు. మమ్మల్ని విడదీయడానికి వాళ్ళు ఏ స్థాయికి అయినా చేరుకుంటారు. చివరికి వాళ్లని వాళ్లు చంపుకోవడానికి కూడా వెనుకాడరు.

ప్రేమలో ఇన్ని అడ్డంకులు వస్తాయని నేను ముందు ఊహించలేదు. కులానికి, ప్రేమకు సంబంధం ఏమిటో నాకు అర్థం కావట్లేదు. నా జీవితంలో జరిగిన ఈ అనుభవం మీ అందరికీ తెలియాలని ఇలా చెబుతున్నా. నా కథ ఇంకా ముగిసిపోలేదు. కానీ ఏదో ఒక రోజు మంచి ముగింపు వస్తుందని.. మా ఇద్దరం సంతోషంగా జీవిస్తామని కోరుకుంటున్నా. మా పెళ్లి విషయం వాళ్ళ అమ్మా నాన్నకు తెలిశాక మా జీవితం ఎలా ఉంటుందో ఊహించడానికే భయమేస్తోంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
బంధుత్వం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నేరమా? ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?
Recommended image2
Love Signs: ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తోందని చెప్పకనే చెప్పే 7 సీక్రెట్ సిగ్నల్స్ ఇవే
Recommended image3
Relationship : మీ తల్లి, భార్య గొడవపడితే ఏం చేయాలి? చాణక్య పరిష్కారాలు
Related Stories
Recommended image1
Hero Yash Wife: పెళ్లయ్యాక ఆ ఒక్కపని పబ్లిక్‌గా చేయగలుస్తున్నాము.. హీరో యశ్ భార్య షాకింగ్ కామెంట్స్
Recommended image2
Relationships: ఒక్కసారి కలిశాడు.. కానీ నా జీవితాన్ని పూర్తిగా మార్చేశాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved