Hair Care: 40 ఏళ్లు దాటినా.. జుట్టు రాలకూడదంటే....ఈ నాలుగు తింటే చాలు..!
Hair Care: జుట్టు అందంగా కనిపించాలి అంటే.. అందుకు తగిన ఆహారం కచ్చితంగా తీసుకోవాలి. ముఖ్యంగా కొన్ని రకాల పండ్లు మన జుట్టు పెరగడానికి అవసరం అయిన విటమిన్లు, ఖనిజాలు అందిస్తాయి. జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తాయి.

Hair Care
వయసు పెరుగుతుంటే నెమ్మదిగా జుట్టు రాలడం కూడా మొదలౌతుంది. ఎంత జాగ్రత్తగా చూసుకుందాం అనుకున్నా సరే.. హెయిర్ ఫాల్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన మహిళల్లో శారీరకంగానూ, మానసికంగానూ హార్మోన్లలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. నేటి కాలంలో పెరుగుతున్న కాలుష్యం, సరైన ఆహారం తీసుకోకపోవడం, తీవ్ర ఒత్తిడి కారణంగా.. జుట్టు పెరుగుదల ఆగిపోతుంది. అంతేకాకుండా, హెయిర్ ఫాల్ కూడా మొదలౌతుంది. వెంటనే కంగారుపడిపోయి... మార్కెట్లో దొరికే ఖరీదైన నూనెలు, షాంపూలు వాడటం మొదలుపెడతాం. కానీ, మరింత ఎక్కువ హాని చేస్తాయి. అందుకే.. వాటిని మార్చడం కంటే... ఈ మార్పులు ఆహారంలో చేసుకోవాలి. అప్పుడే మీ జుట్టును అందంగా మార్చుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని రకాల ఫుడ్స్ ని రోజూ డైట్ లో భాగం చేసుకుంటే.. ఈ హెయిర్ ఫాల్ సమస్య అనేదే ఉండదు. ఎలాంటి పండ్లు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.....
నారింజ...
నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, జుట్టు పెరుగుదలను ప్రేరేపించే కొల్లాజెన్ ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది. నారింజలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల జుట్టుకు కలిగే నష్టాన్ని నివారిస్తాయి. ఈ పండులో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చండ్రు, తలలో ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి.
పొడవాటి, ఆరోగ్యకరమైన జుట్టు కలిగి ఉండాలనుకునేవారు రెగ్యులర్ గా నారింజ పండు తినడం లేదా.. జ్యూస్ తాగడం చేస్తే.. మీ జుట్టు అందంగా, ఆరోగ్యంగా మారుతుంది.
మామిడి పండు...
పండ్లలో రారాజు అయిన మామిడి కేవలం రుచికరమైన పండు మాత్రమే కాదు, జుట్టు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఈ పండులో విటమిన్ ఏ, సి పుష్కలంగా ఉంటాయి. ఇవి సెబమ్ ఉత్పత్తిని ప్రేరేపించడానికి, తలపై చర్మాన్ని తేమగా ఉంచడానికి సహాయపడతాయి. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టును మెరిచేలా ఉంచడంలో సహాయపడుతుంది.
ఎండాకాలంలో సులభంగా లభించే ఈ పండ్లను ఏదో ఒక రూపంలో రెగ్యులర్ గా తీసుకుంటే.. మీ జుట్టుకు సహజంగా అవసరమైన పోషణ లభిస్తుంది.
అరటి పండు...
మహిళల మొత్తం ఆరోగ్యానికి, ముఖ్యంగా వారి జుట్టుకు అరటిపండ్లు ఒక వరంలాంటిది. వాటిలో పొటాషియం, సహజ నూనెలు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లు రెగ్యులర్ గా తినడం వల్ల జుట్టు అందంగా మారుతుంది. హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ లో ఉంటుంది. మీరు ప్రతిరోజూ ఒక అరటిపండును మీ డైట్ లో భాగం చేసుకోవచ్చు.
బొప్పాయి...
బొప్పాయి పండులో చాలా పోషకాలు ఉంటాయి. చాలా రకాల ఆరోగ్య సమస్యలు తగ్గించడంతో పాటు... జుట్టు పెరుగుదలకు కూడా బొప్పాయి సహాయపడుతుంది. ఈ పండులో విటమిన్ ఎ, సి, ఈ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ పండు జుట్టు పెరగానికి మాత్రమే కాదు.. మంచి కండిషనర్ లా కూడా పని చేసి, జుట్టు మృదువుగా, మెరిసేలా చేస్తాయి. బొప్పాయిలోని యాంటీఆక్సిడెంట్లు జుట్టు పెరుగుదలను ప్రేరేపించి, వెంట్రుకల మూలాలను బలపరుస్తాయి. ప్రతిరోజూ మధ్యాహ్నం పూట మీరు బొప్పాయి తినవచ్చు.

