పెళ్లైన కొత్తలో.. ఈ శృంగార సమస్యలు మామూలే...
ఇలాంటి సమయాల్లో కొత్తగా పెళ్లైన వారు ఎదుర్కొంటున్న కొన్ని సాధారణ సెక్స్ సంబంధిత సమస్యల గురించి అవగాహన ఉంటే.. మంచిదంటున్నారు నిపుణులు.
కొత్తగా పెళ్లైన జంటలు ఎప్పుడెప్పుడు హనీమూన్ కు చెక్కేద్దాం. ఎక్కడికి వెడదామా.. ఏకాంతంగా ఎప్పుడు గడుపుతామా.. అని తెగ తొందరపడడం మామూలే. వీటితో పాటు మొదటి అనుభవం ఎలా ఉంటుందో... తమ భాగస్వామిని మెప్పించగలుగుతామో లేదో.. అనే సందేహాలు.. అప్పటివరకు శృంగారం మీద తాము విన్న అంశాలు గుర్తుకు వచ్చి ఇరకాటలో పడేస్తాయి. ఇలాంటి సమయాల్లో కొత్తగా పెళ్లైన వారు ఎదుర్కొంటున్న కొన్ని సాధారణ సెక్స్ సంబంధిత సమస్యల గురించి అవగాహన ఉంటే.. మంచిదంటున్నారు నిపుణులు.
ఫ్రీక్వెన్సీ
కొత్తగా పెళ్లయింది. కొత్త ఉత్సాహం ఉరకలేస్తుంది. కొత్త రుచికి అలవాటు పడతారు. అందుకే సెక్స్ పదే పదే కావాలనిపిస్తుంది. నరాలు గోల పెడుతుంటాయి. శరీరం మరో దేహం కోసం ఆతృత పడుతుంది. అయితే, ఇలా ఎక్కువసార్లు సెక్స్ చేయాలనిపించడం.. భాగస్వాములిద్దరికీ ఒకేలా ఉండకపోవచ్చు. చాలాసార్లు స్త్రీలకు ఈ కోరిక తక్కువగా ఉంటే.. పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అది గుర్తుంచుకోవాలి.
ఆర్గాజం
కొన్నిసార్లు పురుషులకు చాలా త్వరగా స్ఖలనం అయిపోతుంది. దీంతో స్త్రీని సంతృప్తిపడలేరు. వారు శిఖారాగ్రం చేరడానికి సమయం పడుతుంది. ప్రతీ ఒక్కరి అలవాట్లు, అభిరుచుల్లో తేడా ఉన్నట్టే దీంట్లోనూ ఉంటుంది.. అయితే చాలా సార్లు, మహిళలు తమ Orgasm ను ఫేక్ చేస్తారు. తాము తృప్తి పడలేదంటే తమ భాగస్వామి హర్ట్ అవుతాడని, భావిస్తారు. కొంతమంది మహిళలకు ఆర్గాజమ్స్ రావడానికి చాలా సమయం పట్టవచ్చు. ఆ దశకు చేరుకోవడానికి వీలుగా భాగస్వామి ప్రయత్నించాలి. దీనికి చాలా సహనం, అవగాహన అవసరం. కమ్యూనికేట్ చేయగలిగి ఉండాలి.
కండోమ్
condom వాడకం విషయంలో కూడా స్త్రీలకు, పురుషులకు భిన్నాభిప్రాయాలు ఉంటాయి. మీరు ఇప్పుడే పిల్లలు వద్దు అనుకుంటే కండోమ్ తప్పనిసరిగా వాడాలి. దీనికోసం ఇద్దరూ ముందుగా మాట్లాడుకోవాలి. కొంతమంది పురుషులు కండోమ్ వాడడానికి ఇష్టపడరు. లేదా మధ్య తీసేస్తుంటారు. దీనివల్ల అవాంఛిత గర్భం, సమస్యలు మొదలవుతాయి. ఇంకొంతమంది స్త్రీలకు కండోమ్ వాడడం వల్ల ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు వేరే ఫ్యామిలీ ప్లానింగ్ ఆఫ్షన్స్ వెతుక్కోవాలి.
మూడ్
సెక్స్ విషయానికి వస్తే ప్రతీ సారి మూడ్ ఉండాల్సిన పనిలేదు. కొన్ని సార్లు అది లేకుండా కూడా జరిగిపోతుంది. మరికొన్ని సార్లు మీ భాగస్వామికి మూడ్ ఉండి మీకు ఉండకపోవచ్చు. ఆ విషయాన్ని ఇద్దరూ చర్చించుకుంటే మంచిది.
ఆశలు
సెక్స్ విషయంలో కొంతమందికి అనేక ఫాంటసీలు ఉంటాయి. అయితే వాస్తవానికి వచ్చేసరికి ఇది అలా ఉండదు. అప్పుడు అసహనానికి గురవుతారు. భాగస్వామి మీద ఒత్తిడి పెంచుతారు. అది అంత మంచిది కాదు. మీరు, మ భాగస్వామి అభిరుచులను బట్టి కొత్తగా ట్రై చేయడం మంచిది. కాకపోతే ఏది చేసినా ఇద్దరి అంగీకారం ఉండాలన్న విషయం మర్చిపోవద్దు.