MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Chicken vs Mutton: చికెన్, మటన్ లో ప్రోటీన్ దేనిలో ఎక్కువ? ఏది ఆరోగ్యానికి మంచిది?

Chicken vs Mutton: చికెన్, మటన్ లో ప్రోటీన్ దేనిలో ఎక్కువ? ఏది ఆరోగ్యానికి మంచిది?

Chicken vs Mutton: మనలో చాలామంది చికెన్, మటన్ ని ఇష్టంగా తింటారు. కానీ ఆరోగ్యపరంగా చికెన్ తింటే మంచిదా? మటన్ తింటే మంచిదా? ప్రోటీన్ కోసం ఈ రెండింటిలో ఏది బెస్ట్? వంటి డౌట్స్ చాలామందిలో ఉంటాయి. మరి దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Sep 23 2026, 03:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
చికెన్, మటన్ లో ఏది బెస్ట్?
Image Credit : Getty

చికెన్, మటన్ లో ఏది బెస్ట్?

మన శరీరంలో కండరాలు, కణాలు, కణజాలాల పెరుగుదలకు ప్రోటీన్ చాలా ముఖ్యం. అందుకోసం చికెన్, మటన్ తినాలని నిపుణులు చెబుతుంటారు. అయితే చికెన్, మటన్ రెండింటిలోనూ మంచి ప్రోటీన్ దొరుకుతుంది. ముఖ్యంగా స్కిన్‌లెస్ చికెన్‌లో ప్రోటీన్ ఎక్కువగా, ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. అందుకే జిమ్‌కు వెళ్లేవాళ్లు, ప్రోటీన్ ఎక్కువ కావాలనుకునేవాళ్లు చికెన్ ని ఎక్కువగా తింటుంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఫ్యాట్ దేనిలో తక్కువ?
Image Credit : Getty

ఫ్యాట్ దేనిలో తక్కువ?

చికెన్, మటన్‌ను పోల్చి చూస్తే.. మనం తీసుకునే మాంసం ముక్కను బట్టి అందులో ఫ్యాట్ ఉంటుంది. సాధారణంగా స్కిన్‌లెస్ చికెన్‌లో, ముఖ్యంగా బ్రెస్ట్ పీస్‌లో ఫ్యాట్ చాలా తక్కువగా ఉంటుంది. అదే మటన్‌లో అయితే శాచురేటెడ్ ఫ్యాట్, కొవ్వు శాతం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఫ్యాట్ తగ్గించుకోవాలనుకునేవాళ్లు మాంసం ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

36
మటన్‌లో ఉండే ముఖ్యమైన పోషకాలు
Image Credit : Getty

మటన్‌లో ఉండే ముఖ్యమైన పోషకాలు

మటన్‌లో ఫ్యాట్ ఎక్కువగా ఉన్నప్పటికీ.. మన శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలు ఇందులో చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఐరన్, జింక్, విటమిన్ బి12 లాంటి పోషకాలకు మటన్ కేరాఫ్ అడ్రస్. రక్త కణాల ఉత్పత్తికి, నాడీ వ్యవస్థ పనితీరుకు విటమిన్ బి12 చాలా అవసరం. అలాగే శరీరంలోని చాలా అవసరాలకు ఐరన్ ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ పోషకాలు అందాలంటే మటన్ తీసుకోవడం మంచిది.

46
బరువు తగ్గాలనుకునేవాళ్లు..
Image Credit : Getty

బరువు తగ్గాలనుకునేవాళ్లు..

బరువు తగ్గాలనుకునేవాళ్లు తక్కువ కేలరీలు, తక్కువ ఫ్యాట్ ఉండే ఆహారం తీసుకోవాలి. ఇలాంటి వాళ్లకు స్కిన్‌లెస్ చికెన్ మంచి ఆప్షన్. అయితే చికెన్‌ను ఎలా వండుతున్నామనేది కూడా ఇక్కడ ముఖ్యం. నూనెలో డీప్ ఫ్రై చేసినా, క్రీమ్స్ ఎక్కువగా వాడినా అందులోని పోషకాలు పోయి ఫ్యాట్ పెరుగుతుంది.

56
వండే విధానం ముఖ్యం
Image Credit : Getty

వండే విధానం ముఖ్యం

చికెన్ తీసుకున్నా, మటన్ తీసుకున్నా.. దాన్ని వండే విధానం చాలా ముఖ్యం. నూనెలో డీప్ ఫ్రై చేసే బదులు ఉడకబెట్టడం, గ్రిల్ చేయడం లేదా తక్కువ నూనెతో వండుకోవడం మంచిది. మటన్ వండేటప్పుడు దానికి ఉన్న కొవ్వును తీసేయాలి. చికెన్ వండేటప్పుడు చర్మం తీసేస్తే ఫ్యాట్ శరీరంలోకి చేరకుండా ఉంటుంది.

66
ఎవరికి ఏది బెస్ట్?
Image Credit : Getty

ఎవరికి ఏది బెస్ట్?

చికెన్, మటన్.. ఈ రెండింటికీ వేర్వేరు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తక్కువ ఫ్యాట్, ఎక్కువ ప్రోటీన్ కావాలనుకునేవాళ్లు స్కిన్‌లెస్ చికెన్ ఎంచుకోవచ్చు. ఐరన్, జింక్, బి12 కావాలనుకునేవాళ్లు మటన్ తినొచ్చు. రెండూ ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ మితంగా తినడం ఉత్తమం. వీటితో పాటు కూరగాయలు, పప్పులు, తృణధాన్యాలు కూడా తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం అవుతుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
రెండు జడలు వేసుకుంటే హెయిర్ ఫాల్ ఉండదా? హీరో నాని కామెంట్స్ పై డాక్టర్లు ఏమన్నారంటే..!
Recommended image2
Home Cleaning Tips: మీ ఇంట్లో ఇవి శుభ్రంగానే ఉన్నాయా? అసలు ఎన్నిరోజులకొకసారి క్లీన్ చేయాలో తెలుసా?
Recommended image3
Gold Chains: టాప్ ట్రెండింగ్ గోల్డ్ చైన్ డిజైన్స్ చూశారా
Related Stories
Recommended image1
Heart Attack Symptoms: గుండెపోటు వచ్చే ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే!
Recommended image2
Sprouted Green Gram: 30 రోజులపాటు మొలకెత్తిన పెసలు తింటే ఏమవుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved