MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Home Cleaning Tips: మీ ఇంట్లో ఇవి శుభ్రంగానే ఉన్నాయా? అసలు ఎన్నిరోజులకొకసారి క్లీన్ చేయాలో తెలుసా?

Home Cleaning Tips: మీ ఇంట్లో ఇవి శుభ్రంగానే ఉన్నాయా? అసలు ఎన్నిరోజులకొకసారి క్లీన్ చేయాలో తెలుసా?

Home Cleaning Tips: ఇంట్లో ప్రతిరోజూ ఉపయోగించే కొన్ని వస్తువులపై మనకు తెలియకుండానే బ్యాక్టీరియా, మురికి పేరుకుపోతుంటాయి. వాటర్ బాటిల్, దిండు కవర్ నుంచి కిచెన్ స్పాంజ్, బాత్ టవల్, కటింగ్ బోర్డ్ వరకు..వీటిని ఎంత తరచుగా శుభ్రం చేయాలో ఇక్కడ చూద్దాం.

2 Min read
Author : Nandini Arava
Published : Sep 23 2026, 12:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
ఎప్పుడు శుభ్రం చేయాలో తెలుసా?
Image Credit : geminiai

ఎప్పుడు శుభ్రం చేయాలో తెలుసా?

ఇంట్లో ప్రతిరోజూ ఉపయోగించే కొన్ని వస్తువులపై మనకు తెలియకుండానే బ్యాక్టీరియా, మురికి పేరుకుపోతుంటాయి. వాటర్ బాటిల్, దిండు కవర్ నుంచి కిచెన్ స్పాంజ్, బాత్ టవల్, కటింగ్ బోర్డ్ వరకు..వీటిని ఎంత తరచుగా శుభ్రం చేయాలో తెలుసా?

ఇంట్లో మనం రోజూ చాలా వస్తువులను వాడుతుంటాం. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నా.. అసలు ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలనేది చాలామందికి తెలియదు. ముఖ్యంగా వాటర్ బాటిల్, దిండు కవర్, టూత్ బ్రష్, కిచెన్ స్పాంజ్ లాంటి వాటిలో తేమ వల్ల మురికి, బ్యాక్టీరియా త్వరగా చేరుతాయి. అందుకే ప్రతి వస్తువును సరైన పద్ధతిలో శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
నీళ్లతో కడిగితే సరిపోదు
Image Credit : chatgpt

నీళ్లతో కడిగితే సరిపోదు

మనం రోజూ నీళ్లు తాగే బాటిల్‌ను కేవలం నీళ్లతో కడిగేసి పక్కన పెడితే సరిపోదు. బాటిల్ లోపల తేమ అలాగే ఉండటం వల్ల బ్యాక్టీరియా పెరుగుతుంది. అందుకే వాడిన ప్రతిసారీ గోరువెచ్చని నీళ్లు, డిష్ వాష్ లిక్విడ్‌తో బాటిల్‌ను శుభ్రంగా కడగాలి. మూత, రబ్బర్ సీల్ లాంటివి ఉంటే వాటిని విడిగా తీసి క్లీన్ చేయాలి. కడిగిన తర్వాత బాటిల్ పూర్తిగా ఆరాకే మళ్లీ వాడుకోవాలి.

38
మెటీరియల్ బట్టి మార్చాలి
Image Credit : chat gpt

మెటీరియల్ బట్టి మార్చాలి

దిండు కవర్ మన ముఖం, జుట్టుకు నేరుగా తగులుతుంది. దీనివల్ల చెమట, నూనె, దుమ్ము దానిపై పేరుకుపోతాయి. అందుకే వారానికి ఒకసారి కచ్చితంగా దిండు కవర్ మార్చి ఉతకాలి. ఎక్కువగా చెమట పట్టేవాళ్లు, ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్లు ఇంకా త్వరగా మార్చడం మంచిది. రోజూ కాసేపు దిండును ఎండలో లేదా గాలి తగిలే చోట పెడితే అందులోని తేమ పోతుంది. దిండు లోపల ఉండే దూది లేదా మెటీరియల్‌ను బట్టి దాన్ని శుభ్రం చేసుకోవాలి.

48
గాలి తగిలేలా పెట్టాలి
Image Credit : pinterest

గాలి తగిలేలా పెట్టాలి

టూత్ బ్రష్ వాడిన తర్వాత నీళ్లతో శుభ్రంగా కడిగి, బ్రష్ పైభాగం గాలి తగిలేలా పైకి ఉంచాలి. తడిగా ఉన్న బ్రష్‌ను వెంటనే బాక్స్‌లో పెట్టి మూసేయడం చాలామంది చేసే పెద్ద తప్పు. బ్రష్ కుంచెలు వంగిపోయినా, పాడైనా వెంటనే మార్చేయాలి. సాధారణంగా కొన్ని నెలలకు ఒకసారి కొత్త బ్రష్ వాడటం మంచిది. జ్వరం లేదా ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత బ్రష్ మార్చడం మర్చిపోవద్దు.

58
ఎక్కువ రోజులు వాడకూడదు
Image Credit : Getty

ఎక్కువ రోజులు వాడకూడదు

వంటగదిలో వాడే స్పాంజ్ ఎప్పుడూ నీళ్లు, ఆహార పదార్థాలు, నూనెతో తడుస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాడిన ప్రతిసారీ నీళ్లు లేకుండా గట్టిగా పిండి, గాలి తగిలే చోట ఆరబెట్టాలి. స్పాంజ్ నుంచి వాసన వచ్చినా, మురికి ఎక్కువగా ఉన్నా, పాడైపోయినా వెంటనే కొత్తది వాడటం మంచిది. ఒకే స్పాంజ్‌ను ఎక్కువ రోజులు వాడకూడదు.

68
ఎవరిది వాళ్లు వాడుకోవాలి
Image Credit : chat gpt

ఎవరిది వాళ్లు వాడుకోవాలి

స్నానం చేశాక ఒంటిపై ఉన్న తడిని, మృతకణాలను బాత్ టవల్ పీల్చుకుంటుంది. అందుకే వాడిన తర్వాత దాన్ని సరిగ్గా ఆరబెట్టడం చాలా అవసరం. తడిగా ఉన్న టవల్‌ను గదిలో అలాగే వదిలేయడం మంచి అలవాటు కాదు. రెండు మూడు సార్లు వాడిన తర్వాత టవల్‌ను కచ్చితంగా ఉతికి ఎండబెట్టాలి. ఒకరి టవల్ మరొకరు వాడకుండా ఎవరిది వాళ్లు విడిగా ఉంచుకోవడం ఆరోగ్యానికి మంచిది.

78
అన్నింటికీ విడివిడిగా ఉండాలి
Image Credit : Asianet News

అన్నింటికీ విడివిడిగా ఉండాలి

కూరగాయలు, పండ్లు, మాంసం కోయడానికి వాడే కటింగ్ బోర్డ్‌ను వాడిన ప్రతిసారీ సబ్బు, నీళ్లతో శుభ్రంగా కడగాలి. ముఖ్యంగా పచ్చి మాంసం లేదా చేపలు కోసిన తర్వాత ఇంకాస్త జాగ్రత్తగా క్లీన్ చేయాలి. అన్నింటికీ ఒకే బోర్డ్ వాడకుండా.. కూరగాయలకు, మాంసానికి వేర్వేరుగా కటింగ్ బోర్డులు వాడటం మంచిది. బోర్డ్‌పై కత్తి గాట్లు ఎక్కువగా పడితే కొత్తది తీసుకోవడం ఉత్తమం.

88
వీటికి కూడా ఎక్స్ పెయిరీ ఉంటుంది
Image Credit : Pixabay

వీటికి కూడా ఎక్స్ పెయిరీ ఉంటుంది

ఇంట్లోని వస్తువులను శుభ్రం చేయడమే కాదు.. వాటిని పూర్తిగా ఆరబెట్టి సరైన చోట భద్రపరచడం కూడా అంతే ముఖ్యం. తడిగా ఉండే వస్తువుల్లో మురికి, బ్యాక్టీరియా త్వరగా పెరుగుతాయి. అందుకే వాటర్ బాటిల్, స్పాంజ్, టవల్ లాంటివి కడిగిన వెంటనే మూసేయకుండా గాలికి ఆరబెట్టాలి. చిన్న వస్తువులైనా సరే వాటిని సరిగ్గా చూసుకుంటేనే ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది. వస్తువుల తయారీ కంపెనీలు ఇచ్చిన సూచనలు ఉంటే వాటిని పాటించడం ఇంకా మంచిది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Chains: టాప్ ట్రెండింగ్ గోల్డ్ చైన్ డిజైన్స్ చూశారా
Recommended image2
Gold Nose Pin: బ్యూటిఫుల్ డిజైన్ లో బంగారు ముక్కుపుడకలు.. ఓ లుక్కేయండి
Recommended image3
Drumstick Soup: వేడి వేడి మునక్కాడల సూప్ తాగితే.. వానాకాలంలో అదిరిపోతుంది
Related Stories
Recommended image1
Smart Kitchen Gadgets: కిచెన్ లో పని తగ్గించే అదిరిపోయే స్మార్ట్ గ్యాడ్జెట్స్..క్షణాల్లో మీ పనులు కంప్లీట్
Recommended image2
Gold Price Hike: పండుగలు దగ్గర పడుతున్న వేళ బిగ్ షాక్ ఇచ్చిన పసిడి...కొనుగోలుదారులపై పెరిగిన మరింత భారం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved