MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Weight Loss Tips : నోరు కట్టుకుని, కడుపు మాడ్చుకోవాల్సిన పనిలేదు.. ఆడుతూ పాడుతూ హాయిగా బరువు తగ్గండి

Weight Loss Tips : నోరు కట్టుకుని, కడుపు మాడ్చుకోవాల్సిన పనిలేదు.. ఆడుతూ పాడుతూ హాయిగా బరువు తగ్గండి

Weight Loss : లావుగా ఉన్నవారు బరువు తగ్గాలని వివిధ ప్రయత్నాలు చేస్తుంటారు.. నోరు కట్టుకుని, కడుపు మాడ్చుకుంటారు. ఇలా కాదు… హాయిగా ఆడుతూ పడుతూ బరువు తగ్గడం ఎలాగో తెలుసా?  

6 Min read
Amarnath Vasireddy
Published : Dec 18 2025, 09:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
లావై పోతారెందుకు?
Image Credit : stockPhoto

లావై పోతారెందుకు?

తినే ఆహారం ద్వారా మనకు శక్తి అందుతుంది.

ఈ శక్తిని రోజు వారీ పనులకు శరీరం వినియోగించుకుంటుంది .

పురుషులకు రోజుకు 2200 - 2400 కిలో క్యాలరీల శక్తి అవసరం .

అదే స్త్రీ అయితే 1800 - 2000 .

కాయకష్టం చేసేవారికి జిమ్ లో వ్యాయామం చేసేవారికి క్రీడలు ఆడేవారికి ఎక్కువ శక్తి అవసరమవుతుంది .

ఆఫీస్ లో పని చేసేవారికి రిటైర్ అయ్యి పెద్దగా పని లేకుండా ఇంటిపట్టునే ఉండేవారికి తక్కువ శక్తి అవసరం .

మనం తినే ఆహారం ద్వారా శరీరంలోకి ఎక్కువ శక్తిని పంపి, తక్కువ వినియోగిస్తే ?

శక్తి కొవ్వుగా మారుతుంది .

లావై పోతారు.

ఏదో ఒక్క రోజైతే పరవాలేదు .

రోజూ శరీరంలోకి ఎక్కువ శక్తి ని పంపి తక్కువ వియోగిస్తే ?

క్రమంగా లావెక్కుతారు .

లావు తగ్గాలంటే ఏమి చెయ్యాలి ?

శరీరంలోకి తక్కువ శక్తిని పంపాలి .

ఎక్కువ శక్తిని వినియోగించాలి.

అప్పుడే ఇది వరకే శరీరంలో పేరుకున్న కొవ్వు కరుగుతుంది .

తినడం ఒక భోగం... . అది ఒకప్పుడు

తినడం ఒక రోగం ... నేడు కోట్లాది మంది స్థితి.

శరీర బరువులో ఎంత కొవ్వు ఉండాలి ?

శరీర బరువులో కనీసం 10 % కొవ్వు ఉండాలి .

ఇంతకంటే తగ్గితే అనారోగ్యం .

సిక్స్ పాక్ పేరుతొ కొంతమంది కొవ్వు తగ్గించుకొంటూ వెళుతారు .

ఇది 5 % శాతానికి తగ్గిపోతే వ్యక్తి కోమాలోకి వెళ్లిపోతారు.

శరీర బరువులో కొవ్వు ఎంత వరకు గరిష్ఠంగా ఉండాలి ?

పురుషుల్లో 25 % , మహిళల్లో ౩౦% .

ఇంతే . ఇంతకు దాటకూడదు .

దాటితే అధిక బరువు .

ఊబ ఖాయంతో ... గుండెపోటు , మెదడు పోటు, కీళ్ల నొప్పులు, స్లీప్ అప్నియా, అధిక బిపి , గౌట్ , నడుం నొప్పి , ఫాటీ లివర్ వ్యాధి, డయాబెటిస్ , కాన్సర్ , డిప్రెషన్ లాంటి అనేక వ్యాధులు.

25 { పురుషులు } 30 { మహిళలు } ఒంట్లో కొవ్వు ఇంతకంటే దాటకూడదు ... అని చెప్పుకొన్నాం కదా ?

నేటి స్థితి ఏంటంటే చాలా మందికి ఇది 50 దాటి 60 శాతానికి చేరుకొంది .

26
వెయిట్ లాస్ పేరుతో దోపిడీ...
Image Credit : stockPhoto

వెయిట్ లాస్ పేరుతో దోపిడీ...

వెయిట్ లాస్ అనేది ఇప్పుడు బిలియన్ డాలర్ ఇండస్ట్రీ .

బరువు తగ్గేందుకు డబ్బాల్లో హెర్బల్ మందులు... ఇంజక్షన్ లు.

కిడ్నీ లివర్ వ్యాధులు కొని తెచ్చుకొని ఇంటిని గుల్ల చేసి.. ఆఖరి యాత్ర దారిలో ఇప్పుడు కోట్లాది మంది .

హై వే .. అంటే రాచ మార్గముంటుంది. జనాలకు అడ్డదారులు దొంగదారులు కావాలి .

వాటిల్లో వెళ్లి బుక్ అయ్యి పోతున్న వారు ఎందరో .

బరువు ఎలా తగ్గాలి ?

పైన చెప్పినట్టు తక్కువ కెలొరీ ల ఫుడ్ తినాలి .

ఎక్కువ కెలొరీ లు వినియోగించాలి .

ఇంతే . ఇంతకు మించి ఏదీ లేదు .

ఉంటే అది మోసం .. కుట్ర .. దగా .

పాయింట్ బ్లాంక్ చెబుతున్నాను .

లావు తగ్గడం పేరుతొ కడుపు మాడ్చుకోవద్దు .

హాయిగా తినండి .

కడుపు నిండా తినండి .

హ్యాపీగా ఆడుతూ పడుతూ బరువు తగ్గొచ్చు .

ఇది ఇంద్ర జాల మహేంద్ర జాల టక్కుటమారా నేపాలీ మంత్రం విద్య కాదు . ప్యూర్ సైన్స్ .

పైసా ఖర్చు పెట్టొద్దు .

ఎక్కడికీ పోవద్దు .

ఇంట్లో ఉంటూనే బరువు తగ్గొచ్చు .

డైట్ చార్ట్ అక్కర లేదు .

Related Articles

Related image1
Winter Health Tips: చలికాలంలో అస్సలు తినకూడని ఫుడ్స్ ఇవే! తింటే ఏమవుతుందో తెలుసా?
Related image2
Weight Loss: చలికాలంలో బరువు తగ్గడం చాలా ఈజీ, ఇవి చేస్తే చాలు..!
36
క్యాలరీ బాలన్స్ షీట్ గురించి తెలుసుకొందాము రండి
Image Credit : META AI

క్యాలరీ బాలన్స్ షీట్ గురించి తెలుసుకొందాము రండి

దైనందిన కార్యక్రమాలు .గంటకు వినియోగమయ్యే శక్తి కిలో కాలరీస్ లో.{ సరాసరి గా }

నిద్ర - 50 .

ఆఫీస్ లో పని - 75 .

నిలబడడం - 110 .

నెమ్మదిగా నడక - 160

గంటకు ఆరు కిలోమీటరు ల వేగం తో నడక - 350

సైక్లింగ్ - 275

పరుగెత్తడం { 8 కిలోమీటర్ ల వేగం తో } 650

ఇంటిపని వంటపని - 225

జిం లో వ్యాయామం - 500

యోగ - 175 .

ఈదడం - 550.

మనం తినే ఆహారం ద్వారా మనకు శక్తి అందుతుంది . అన్ని ఆహారాలు ఒకటే కాదు . కొన్ని ఎక్కువ కెలొరీ ల ఆహారం . కొన్ని తక్కువ .

ఎక్కువ కెలొరీ ఆహార పదార్థాలు .వంద గ్రాములకు ఎన్ని కిలో క్యాలోరిస్?

నెయ్యి - 920 . కొబ్బరి - 624 , బాదాం పప్పు/ జీడీ పప్పు - 600 .వేరుశనిగె - 520 .సమోసా - 260 , పూరి -300 , జిలేబి - 380 . పకోడా- 280 . ఇడ్లీ - 80 , దోస - 140 , చపాతి- 275 , తెల్లనం - 150 , బ్రౌన్ రైస్ - 125 .

46
కొంత మంది ఎంత చేసినా బరువు తగ్గరెందుకు?
Image Credit : Getty

కొంత మంది ఎంత చేసినా బరువు తగ్గరెందుకు?

వరాహ రావు గారున్నారు .

ఎలాగైనా బరువు తగ్గాలి అని కేబీఆర్ పార్క్ లో నడక మొదలెట్టారు . మొబైల్ చూస్తూ స్నేహితులతో రాజకీయ పిచ్చా పాటీ మాట్లాడుతూ { పార్టీ ని ఎలా నడపాలో దేశాన్ని ఎలా నడపాలో .. ఈ కేబీఆర్ టాక్స్ విని... మోదీ, చంద్రబాబు , కెసిఆర్ , జగన్ , కేటీఆర్ , పవన్, లోకేష్ లాంటి వారు ఎన్నో నేర్చుకోవచ్చు . వారు వినరు .. వీరు ఆపరు

పాపం ఇంతటి అమోఘ ప్రతిభా పాటవాలు ..కేబీఆర్ మొక్కల పాలవుతుంటుంది .. ప్రతి రోజు } ..

... ఒక రౌండ్ వేస్తారు .

అంటే నాలుగు కిలోమీటర్ లు .

"చించేసాను" అని ఫీలింగ్ తో ఇంటికి వెళ్లి డిన్నర్ సమయం లో రెండు రౌండ్స్ .. ఇంకా పకోడా .. సమోసా స్నాక్స్ గా .

కేబీఆర్ లో ఒక రౌండ్ లో ఖర్చయిన ఎనర్జీ - 200 .

ఇంటికెళ్ళాక రెండు రౌండ్స్ ద్వారా - 260 . స్నాక్స్ ద్వారా - ఇంకో 300 . ఇది కాకుండా బిర్యానీ లాంటి ఫుడ్స్ కూడా . అంటే గురువు గారు .. వరాహ రావు గారు ... కేబీఆర్ ఒక రౌండ్ సమరోత్సాహం ద్వారా ఒంటిలోకి రోజూఅదనంగా పంపుతున్న ఎనర్జీ 350 కెలొరీ లు .

7700 కిలో కాలరీస్ ద్వారా ఒక కిలో బరువు పెరుగుతుంది .

అంటే 25 రోజుల్లో ఒక కిలో బరువు పెరిగారు .

సంవత్సరం లో 15 కిలో ల బరువు పెరిగారు .

అదిగో అప్పుడే యూట్యూబ్ ఛానల్ లో ఒక ఫార్మసురుడు చెప్పిన వీడియో కనిపించింది .

" వాకింగ్ ఆరోగ్యానికి మా చెడ్డది . వాకింగ్ చేస్తే కీళ్ల నొప్పులు, ఎయిడ్స్, కుష్ఠు , రాచ పుండు , టిబి, మలేరియా, గనేరియా రోగాలొస్తాయి . వాకింగ్ మానెయ్యండి . మా దగ్గరకు రండి . ఓజంపిక్ సూది లేకుంటే మౌంజారో గుచ్చుతాము . జస్ట్ ఒక డోసు కు 8800 మాత్రమే . చీప్ . డెడ్ చీప్ . గ్యారెంటీ వెయిట్ లాస్స్"

. పాపం వరాహ రావు గారు కేబీఆర్ నడక ఆపి ఫార్మసురుడికి ఎటిఎం గా మారిపోయాడు .

ఇంకో మేడం గారు .

ఎత్తు 5 . 5 . బరువు 65 కిలోలు . జీరో సైజు సాధించాలని డైటింగ్ మొదలెట్టారు . పొద్దున్న అర పుల్కా . మధ్యాహం మిగిలిన అర పుల్కా . రాత్రికి మంచి నీరు .

సంవత్సరం గడిచింది .

ఇప్పుడు ఆమెకు మజిల్ లాస్ . బలహీనమయిన ఎముకలు . దాని పై పేలవమయిన చర్మం . ఇమ్మ్యూనిటి చచ్చింది . తరచూ దగ్గు జలుబు జ్వరం ... గాల్ బ్లాడర్ సమస్య , హార్మోన్ సమస్య , అసిడిటీ . మెంటల్ హెల్త్ సమస్య .

ఏమి చెయ్యాలి ?

56
 తక్కువ క్యాలోరిస్ ఆహారం తీసుకొండి...
Image Credit : Getty

తక్కువ క్యాలోరిస్ ఆహారం తీసుకొండి...

ఇదిగో .. లో- కెలొరీ ఫుడ్ ఐటమ్స్ .

సమోసా ద్వారా ఎన్ని క్యాలోరిస్ అనుకొన్నాము ?

పైన లిస్ట్ ఇంకో సారి చదవండి .

చదివారా ? ఇప్పుడు దీనితో కంపేర్ చెయ్యండి .

ఖీర - 16

టమాటో - 18

పాలకూర - 23

క్యాబేజ్ - 25

సొరకాయ - 12

బీన్స్ - 31

దీని అర్థం నెయ్యి బాదం పప్పు జీడీ పప్పు లాంటివి వద్దు అని కాదు .

కొన్ని రకాల ఆహార పదార్థాలలో కొన్ని పోషక విలువలుంటాయి . నెయ్యి ద్వారా బ్యుటిరిక్ ఆసిడ్ ఏ , డి, ఈ విటమిన్స్ హెల్తీ ఫ్యాట్స్ అందుతాయి .

కొబ్బరి ద్వారా లారిక్ ఆసిడ్, సి బి విటమిన్స్ , అంటి ఆక్సిడెంట్స్ . మీడియం చైన్ ట్రై గ్లిసెరైడ్స్ .

ఇడ్లీ తినొద్దు, దోస తినొద్దు అని కాదు .

బరువు తగ్గాలంటే .. ఒక ఇడ్లీ .. సాంబారులో ఇడ్లీ కి నాలుగైదు రెట్ల కాయగూరలు .. టమాటో వంకాయ మునక్కాయ నీరుల్లి .. ఇలా .

ఒక ముక్క లో చెప్పాలి అంటే ప్రతి పూట మీ ప్లేట్ లో అన్నం , చపాతి లాంటి పిండి పదార్థాలను ఇచ్చే ఫుడ్ ఐటమ్స్ ఎంత వుంటాయో .. అంతకు నాలుగు రెట్లు.. కాయగూరలు .. ఆకుకూరలు ఉండాలి .

ప్రోటీన్ కోసం తినే పదార్థాలు పిండి పధార్ధాలతో సమంగా ఉండాలి. దీనికి తోడు .. నడక ఒక గంట పాటు .. వీలుంటే జిమ్ .. లేదా కనీసం ఇంట్లో వ్యాయామం . యోగ .

ఇలా అయిదు నెలలు చేస్తే ఇరవై కిలోల కొవ్వు పోతుంది .

గుర్తు పెట్టుకోండి .

1 . తగ్గాల్సింది ఒంట్లో కొవ్వు . పెరగాల్సింది కండరాలు, ఎముకలు { బోన్ డెన్సిటీ } .

2. కడుపు నిండా తినాల్సింది లో క్యాలోరీ ఫుడ్ .కాయగూరలు . ఆకుకూరలు , కొంత మేర పళ్ళు

3. మితంగా తినాల్సింది పోషక విలువలున్న హై కెలొరీ ఫుడ్. నట్స్ , డ్రై ఫ్రూట్స్ ఇంకా అన్నం చపాతి లాంటివి .

4. పూర్తిగా మానాల్సింది ఎలాంటి పోషక విలువలు లేని హై క్యాలరీ ఫుడ్ .. కూల్ డ్రింక్స్ , పొటాటో చిప్స్ , పిజ్జా బర్గెర్, కేకులు , చిప్స్ , రిఫైన్డ్ ఆయిల్ { గానుగ నూనెలు వాడాలి } చాకొలేట్, బిస్కెట్ , ఐస్ క్రీం షుగర్ మైదా .

5 . ఇలా చేస్తే... డయాబెటిస్ బిపి ఊబ కాయం కీళ్ల నొప్పులు గౌట్ లాంటి అనేక సమస్యలు పోతాయి.

66
బరువు తగ్గాలంటే ఇంజెక్షన్లు అవసరంలేదు...
Image Credit : Getty

బరువు తగ్గాలంటే ఇంజెక్షన్లు అవసరంలేదు...

బరువు తగ్గడానికి ఇంజెక్షన్స్ వేసుకొంటే కిడ్నీ లు గాల్ బ్లాడర్ పాంక్రియాస్ పోతాయి . మెంటలెక్కుతుంది .

ఆకలిని చంపడం ద్వారా ఇవి వెయిట్ లాస్ చేస్తాయి అని ప్రచారం . ఇంతకన్నా సులభమయిన మార్గం ఒకటుందని ఈ ఇంజెక్షన్స్ కోసం పరుగులు తీస్తున్న వారికి చెప్పండి .

ఒక దబ్బనం తాడు తీసుకొని నోరు కుట్టుకోమని చెప్పండి .

మోస పొయ్యే బకరాలు ఉన్నత కాలం ఫార్మసురుల ఆటలు యథేచ్ఛగా సాగుతాయి .

పది మందిలో నిలబడండి ." మీరు కరోనా వాక్ సీన్ ముఖ్యంగా కోవిషీల్డ్ గుచ్చుకున్నాక ఎలాంటి సమస్యలు వచ్చాయి?" అని అడగండి .

కనీసం ఏడుగురు గగ్గోలు పెడుతూ రోగాల లిస్ట్ చెబుతారు .

జనాల్లో వాక్ సీన్ భయం ఉంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన దొంగ వాక్ సేన్ లు.. సెర్వికల్ కాన్సర్ ఇంకా అడల్ట్ వాక్ సీన్ లు అమ్ముడు పోవని .." అసలు కరోనా వాక్ సీన్ తో సమస్యే లేదు . రీసెర్చ్ చేసాము " అని బూటకాలతో బయటకు వచ్చారు

కరోనా దాక ఒక ఎత్తు .

కరోనా కాలం లో రుచి మరిగారు .

రక్తం పీల్చకపోతే వాడికి నిద్ర పట్టదు .

వాడు రాజకీయ నాయకుడి కంటే డేంజర్ .

వాడే ఫార్మసురుడు .

మీ ఆరోగ్యం మీ చేతుల్లో ..

శుభోదయం .

About the Author

AV
Amarnath Vasireddy
వాసిరెడ్డి అమర్‌ నాథ్‌ ప్రముఖ విద్యావేత్త. తన విద్యా సంస్థలతో వేలాది మంది IAS, IPS, గ్రూప్-Iతో పాటు ఇతర ప్రభుత్వ అధికారులను దేశానికి అందించారు. విద్యవేత్తగా, మీడియా విశ్లేషకుడిగా, పిల్లల మనస్తత్వవేత్తగా, మానవతావాదిగా, సంస్కరణవాదిగా, కాలమిస్ట్‌గా మంచి పేరు సంపాదించుకున్నారు. సోషియాలజీ, ఆంత్రోపాలజీలో ఎమ్‌.ఏ, ఎమ్‌ ఫిల్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం అమర్ నాథ్‌ స్లేట్- ది స్కూల్‌కి ఛైర్మన్‌గా ఉంటున్నారు. ఈయన్ను Amarnath_vasireddy@yahoo.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
ఆరోగ్యం
ఏషియానెట్ న్యూస్
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
Albert Einstein: ఐన్‌స్టీన్ మెదడును దొంగిలించి 240 ముక్కలు చేసిన వైద్యుడు
Recommended image2
Viral: ఒక్క ఫుల్ బాటిల్ ధ‌ర రూ. 30 కోట్లు.. ప్ర‌పంచంలో అత్యంత ఖ‌రీదైన వోడ్కా ఇదే
Recommended image3
Interesting Facts: ముస్లిం ప్రజలను సాయిబులు అని ఎందుకు పిలుస్తారు? దీని వెనుక కథ ఇదే
Related Stories
Recommended image1
Winter Health Tips: చలికాలంలో అస్సలు తినకూడని ఫుడ్స్ ఇవే! తింటే ఏమవుతుందో తెలుసా?
Recommended image2
Weight Loss: చలికాలంలో బరువు తగ్గడం చాలా ఈజీ, ఇవి చేస్తే చాలు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved