చాలా మంది పచ్చి పాలపై ఉన్న మీగడను తీసి దానితో దేశీ నెయ్యిని తయారు చేస్తారు. కానీ ఆ నెయ్యి ఎక్కువ కాలం నిల్వ ఉండదు. ఆ నెయ్యి అంత రుచిగా కూడా ఉండదు.
మీగడ ఎంత మందంగా ఉంటే, అంత సులభంగా నెయ్యి తయారు చేయొచ్చు. మందపాటి మీగడ కోసం ఏం చేయాలో తెలుసుకోండి.
మందపాటి మీగడ కోసం పాలలను ముందుగా సరైన పద్ధతిలో వేడి చేసుకోవాలి.
పాలను ఎప్పుడూ అధిక మంటపై మరిగించవద్దు. ఒకసారి వేడి చేశాక, తక్కువ మంటపై కాసేపు పాలను మరిగిస్తే, పాలు చిక్కబడి మందపాటి మీగడ వస్తుంది.
పాలలో కొన్ని పచ్చి బియ్యం గింజలు వేసి కలపండి. ఈ చిన్న గింజలు మీగడ గట్టిపడటానికి సహాయపడతాయి.
మీగడ మందంగా రావాలంటే ఫుల్ క్రీమ్ మిల్క్ ఎంచుకోవాలి. అంటే కొవ్వు తీయని పాలు. వీటితోనే మీగడ వస్తుంది.
ఇలా మందపాటి మీగడతో నెయ్యి తయారుచేస్తే చాలా రుచిగా, ఎక్కువ కాలం నిల్వ ఉండేలా నెయ్యి తయారుచేయచ్చు.
చేతుల అందాన్ని పెంచే బంగారు బ్రేస్లెట్స్.. లేటెస్ట్ డిజైన్లు ఇవిగో
క్రిస్మస్ పండుగకు గిఫ్ట్ ఇవ్వడానికి ఈ మొక్కలు బెస్ట్ ఆప్షన్
ఇవి తినడం మానేస్తే బరువు తగ్గడం చాలా ఈజీ
ఒక్క గ్రాములో బంగారు కమ్మలు.. డైలీవేర్ కి బెస్ట్ ఆప్షన్