Weight Loss: చలికాలంలో బరువు తగ్గడం చాలా ఈజీ, ఇవి చేస్తే చాలు..!
Weight loss: చలికాలంలో బరువు తగ్గడం చాలా కష్టం ఇది చాలా మంది అభిప్రాయం. ఈ చలిలో బయటకు వెళ్లి వాకింగ్ చేయడం మా వాళ్ల కాదు.. అందుకే తగ్గిన బరువు కాస్తా మళ్లీ పెరిగిపోయాం అని మరికొందరు వాపోతూ ఉంటారు.కానీ, కొన్ని ఈ ట్రిక్స్ తో ఈజీగా బరువు తగ్గొచ్చు.

weight loss
చలికాలంలో మనకు తెలియకుండానే ఎక్కువ ఫుడ్ తీసుకుంటూ ఉంటాం. అంతేకాదు.. ఈ చలికి బయటకు వెళ్లడం, వాకింగ్ చేయడం, వ్యాయామం చేయడం కూడా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అసలు ఉదయం లేవడమే కష్టమౌతుంది. ఈ క్రమంలో చాలా మంది ఈ సమయంలో విపరీతంగా బరువు పెరిగిపోతూ ఉంటారు. కానీ.. ఈ సీజన్ లో కాస్త కొంచెం కష్టపడినా చాలా ఈజీగా బరువు తగ్గొచ్చు. దాని కోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం....
చలికాలంలో బరువు తగ్గేందుకు ఫాలో అవ్వాల్సిన చిట్కాలు...
బయటకు వెళ్లలేకపోతే ఇంట్లోనే వ్యాయామం...
చలి కారణంగా వాకింగ్, జాకింగ్ కి బయటకు వెళ్లడం మీకు కష్టం అనిపించినప్పుడు... ఇంట్లో వ్యాయామం చేయడం. ఇది బెస్ట్ ఆప్షన్. మీరు యోగా, లేదా చిన్నపాటి వ్యాయామాలు చేయాలి. మీకు సొంతగా చేసుకోవడం రాదు అంటే.. ఏవైనా ఆన్ లైన్ క్లాసుల్లో జాయిన్ అవ్వొచ్చు. ఇవి మీకు చాలా బాగా సహాయపడతాయి. ఇంట్లోనే ఉంటూ ఈజీగా బరువు తగ్గొచ్చు. మీరు ఆరోగ్యంగా కూడా ఉంటారు.
తీసుకోవాల్సిన ఆహారం....
చలికాలంలో, మనకు ఆకలి కంటే.. వేడి వేడి ఆహారం తినాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. దీంతో... ఆకలి వేయకపోయినా చాలా క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి. కానీ, బరువు తగ్గాలి అంటే ఆ క్రేవింగ్స్ ని కంట్రోల్ లో ఉంచుకోవాలి.
పోషకాలతో నిండిన ఆహారం... పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్- రిచ్ మాంసాలు, తృణధాన్యాలు అధికంగా ఉండే బ్యాలెన్స్డ్ ఆహారం తీసుకోవాలి.
హెల్దీ సూప్స్: సూప్‌లు శీతాకాలానికి ఓదార్పునిచ్చే, ఆరోగ్యకరమైన ఆహారం. అవి శరీరానికి అవసరమైన పోషకాలు, వెచ్చదనాన్ని అందిస్తాయి.
ఫైబర్ , ప్రోటీన్: మీ ఆహారంలో తగినంత ఫైబర్ , ప్రోటీన్ ఉండేలా చూసుకోండి. ఇవి మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి. అతిగా తినకుండా ఉండటానికి సహాయపడతాయి.
హైడ్రేషన్ అవసరం:
శీతాకాలంలో మనకు దాహం అనిపించదు. దీని కారణంగా, మనం త్రాగే నీటి పరిమాణం తగ్గే అవకాశం ఉంది. వాతావరణంతో సంబంధం లేకుండా మన శరీరానికి నీటిని అందించాలి. చలికాలంలో కూడా, బరువు తగ్గడానికి హైడ్రేటెడ్ గా ఉండటం చాలా అవసరం. హైడ్రేటెడ్ గా ఉండటం కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుందని చెబుతారు.
శీతాకాలంలో హైడ్రేటెడ్ గా ఉండటానికి మీరు గోరువెచ్చని నీరు లేదా నిమ్మకాయ నీరు తాగవచ్చు.మీరు హెర్బల్ టీ లేదా గ్రీన్ టీ తాగవచ్చు. మీరు నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లు, కూరగాయలను తినవచ్చు.
ఒత్తిడిని నియంత్రించాలి:
సహజంగానే, ఒత్తిడి పెరిగినప్పుడు, మానసిక సుఖం కోసం వెతుకుతూ అతిగా తినడం , బరువు పెరిగే అవకాశం ఉంది. నిద్ర లేకపోవడం జీవక్రియ , ఆకలిని నియంత్రించే హార్మోన్లను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అందువల్ల, రోజుకు 7 నుండి 9 గంటలు తగినంత నిద్రపోవడం చాలా ముఖ్యం.
ఒత్తిడిని తగ్గించే మార్గాలు: యోగా, ధ్యానం లేదా శ్వాస వ్యాయామాలను క్రమం తప్పకుండా సాధన చేయండి.ఇష్టమైన అభిరుచులలో పాల్గొనడం లేదా స్నేహితులతో మాట్లాడటం ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.

