Winter Tips:చలికాలమని నీళ్లు తాగడం లేదా..? అయితే ఈ పండ్లను తినండి.. లేదంటే?
Winter Tips: చలికాలం నీళ్ల తాగడమంటే ఓ పెద్ద సాహసం చేసినట్టుగా ఫీలవుతుంటారు చాలా మంది. ఎందుకంటే అసలే చలికాలం.. ఆపై చల్లగా ఉండే నీళ్లను తాగితే ఎక్కడ వణికిపోతామేమోనని తెగ భయం.. అందుకే నీళ్లను తాగడమే మానేస్తుంటారు. కానీ నీళ్లు ఆరోగ్యానికి, మన శరీరానికి ఎంతో అవసరం. అందుకే ఏకాలమైనా నీళ్లు శరీరానికి సరపడా అందితేనే ఆరోగ్యంగా ఉండేది.

Winter Tips: వింటర్ లో నీళ్లను తాగడానికి జంకుతుంటారు చాలా మంది. చలికాలం ఎక్కువగా నీళ్లు తాగకపోయినా పెద్దగా నష్టమేమీ జరగదని భావిస్తుంటారు. అందులోనూ చల్లటి గాలులకు నీళ్లను తాగలనిపించదు. అన్నం తింటుంటేనో, తిన్న తర్వాతనో కొద్దిగా మాత్రమే తాగుతారు. ఇక మిగతా టైంలో నీళ్లు తాగాలని అసలుకే అనుకోరు. అప్పుడు మనకు మంచిగానే అనిపించినా.. తర్వాత మనకు జరిగే నష్టం గురించి ఊహించలేము. body కి సరిపోయే నీళ్లను తాగకపోతే అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం పొంచి ఉంది.
అందులో ముఖ్యంగా Dehydration కు గురవుతారు. అనేక రోగాల భారిన పడకుండా ఉండాలంటే మాత్రం శరీరానికి సరిపడే నీళ్లను తాగుతూ ఉండాలి. అప్పుడే హెల్తీగా ఉండగలుగుతాం. అయితే చలికాలంలో చాలా మంది నీళ్లను తాగడానికి అస్సలు ఇష్టపడరు. కారణం Weather కూల్ గా ఉండటం. అందులో చల్లగా నీళ్లను తాగాలంటే భయపడటం సహజమే. కానీ ఆరోగ్యానికి నీళ్లు చాలా అవసరం. అందుకే నీళ్లను తాగడానికి వెనకాడేవారు ఈ పండ్లను తింటే డీహైడ్రేషన్ సమస్య నుంచి, అనేక రోగాల నుంచి గట్టెకొచ్చు. అవేంటో తెలుసుకుందాం పదండి.
Watermelon వేసవిలో ఎక్కువగా లభిస్తాయి. అయితే ఈ పండ్లను అప్పుడే జనాలు ఎక్కువగా తింటుంటారు. అయితే చాలా మంది ఈ పండ్లు వేసవిలోనే లభిస్తాయని పొరబడుతుంటారు. మీకు తెలియని విషయమేమిటంటే ఈ Watermelon లు సీజన్లతో సంబంధం లేకుండా లభిస్తాయి. అది కూడా తక్కువ ధరలోనే. శరీరం డీ హైడ్రేషన్ కు గురికాకుండా ఉండాలంటే వీటిని తినడం చాలా ఉత్తమం. ఈ పండులో 90 శాతం నీరే ఉంటుంది. సో నీళ్లను తాగని వారు ఈ పండుతో శరీరానికి కావాల్సిన నీటిని అందించొచ్చు. అలాగే ఈ పండుతో ఐరన్, ఫైబర్, విటమిన్లు, ఎ, బి, సి, మెగ్నీషియం, పొటాషియం లు పుష్కలంగా లభిస్తాయి. దీన్ని తినడం వల్ల శరీరానికి కావాల్సిన నీరు లభించడంతో పాటుగా కండరాలు బలంగా మారి, ఎముకలు గట్టిగా తయారవుతాయి. అలాగే అజీర్తి సమస్య కూడా తగ్గుతుంది. మన శరీరంలో రక్తం కూడా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
దాహాన్నీ తీర్చడంలో దోసకాయ (Cucumber) కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇది 80 శాతం కంటే ఎక్కువ నీటిని కలిగి ఉంటుంది. శరీరానికి కావాల్సిన నీటిని అందించాలంటే ఈ Cucumberను తినాలి. మీ రోజూ వారి ఫుడ్ లో దీన్ని చేర్చితే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. దీనిలో విటమిన్ సి, కె, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ వంటి అనేక రకాల పోషకాలు మెండుగా లభిస్తాయి. ముఖ్యంగా ఈ పండు మన రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అలాగే Bones ను గట్టిగా.. బలంగా మారుస్తుంది. ముఖ్యంగా మలబద్దక సమస్యను కూడా దూరం చేస్తుంది.
నారింజ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే వీటిని శీతాకాలంలో అస్సలు తినకూడదని భావిస్తుంటారు. ఎందుకంటే జలుబు చేస్తుందని అనుకుంటారు. కానీ ఇవి తినడం వల్ల జలుబు చేస్తుందనేది కేవలం మన అపోహ మాత్రమే. ఈ పండులో 92 కంటే నీటి శాతం ఎక్కువ ఉంటుంది. అలాగే ఇందులో పొటాషియం, కాల్షియం, విటమిన్లు ఎ, బి, సి లు పాస్పరస్ లు మెండుగా ఉంటాయి. దీన్ని తింటే శరీరానికి కావాల్సిన నీరు అందడంతో పాటుగా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు వెళ్లడిస్తున్నారు. అలాగే ముఖం నిగనిగ మెరిసిపోవడానికి కూడా ఈ పండు దివ్య ఔషదంగా పనిచేస్తుంది.