MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Pomegranate: రోజూ ఒక దానిమ్మ తింటే శరీరంలో జరిగే 5 అద్భుతమైన మార్పులు ఇవే!

Pomegranate: రోజూ ఒక దానిమ్మ తింటే శరీరంలో జరిగే 5 అద్భుతమైన మార్పులు ఇవే!

Pomegranate: ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఫుడ్ తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా పండ్లను రోజూవారీ డైట్ లో చేర్చుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. అలాంటి పండ్లలో దానిమ్మ ఒకటి. రోజుకో దానిమ్మ తింటే శరీరంలో ఎలాంటి మార్పులుంటాయో ఇక్కడ చూద్దాం.

1 Min read
Author : Kavitha G
Published : Jun 25 2026, 05:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రోజుకో దానిమ్మ తింటే కలిగే లాభాలు
Image Credit : Getty

రోజుకో దానిమ్మ తింటే కలిగే లాభాలు

ఆరోగ్యానికి మేలు చేసే పండ్లల్లో దానిమ్మ ఒకటి. ఇందులో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా రోజుకు ఒక దానిమ్మ తినడం వల్ల శరీరంలో అనేక సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. నిపుణుల ప్రకారం దానిమ్మలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు.. శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. దానివల్ల వృద్ధాప్య లక్షణాలు తగ్గుతాయి. చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
గుండె ఆరోగ్యానికి మేలు
Image Credit : Getty

గుండె ఆరోగ్యానికి మేలు

దానిమ్మ రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇందులో ఉండే సహజ సమ్మేళనాలు రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. దీనివల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారికి ఈ పండు చక్కగా ఉపయోగపడుతుంది.

Related Articles

Related image1
Mint Leaves Water: పరగడుపున పుదీనా నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా? 90 శాతం మందికి తెలియదు!
Related image2
Banana: రోజూ ఒక అరటిపండు తింటే శరీరంలో జరిగే 5 అద్భుతమైన మార్పులు ఇవే!
35
రక్త హీనత దూరం
Image Credit : Getty

రక్త హీనత దూరం

దానిమ్మలో ఐరన్, విటమిన్ C పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో హీమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ముఖ్యంగా అలసట, బలహీనంగా ఉన్నవారికి ఇది సహజమైన సపోర్ట్‌గా పనిచేస్తుంది. అయితే తీవ్రమైన రక్తహీనత ఉన్నవారు తప్పనిసరిగా వైద్యుల సలహాలు పాటించాలి.

45
జీర్ణ సమస్యలు దూరం
Image Credit : stockPhoto

జీర్ణ సమస్యలు దూరం

దానిమ్మలో ఉండే ఫైబర్ కంటెంట్ మలబద్ధకం తగ్గించడంలో, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. రోజువారీ ఆహారంలో సరైన ఫైబర్ లేకపోతే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దానిమ్మ వంటి పండ్లను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. అయితే ఈ పండును మితంగా తీసుకోవడం మంచిది.

55
చర్మ ఆరోగ్యం, ఇమ్యూనిటీ
Image Credit : stockPhoto

చర్మ ఆరోగ్యం, ఇమ్యూనిటీ

దానిమ్మలో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. దీనివల్ల సాధారణ జలుబు, ఇన్ఫెక్షన్లు వంటి సమస్యల నుంచి కొంత రక్షణ లభించవచ్చు. అలాగే చర్మం కాంతివంతంగా మారడంలో కూడా దానిమ్మ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది శరీరాన్ని లోపల నుంచి హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దానిమ్మను ఎంత మోతాదులో తీసుకోవాలో వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Ice Cubes: ఐస్ క్యూబ్స్ గడ్డకట్టడానికి 3 గంటలు పడుతుందా? ఇలా చేస్తే గంటలో తయారైపోతాయి..!
Recommended image2
Ginger Water: ఖాళీ పొట్టతో అల్లం నీళ్లు తాగి చూడండి.. ఎన్నో లాభాలు
Recommended image3
Glass Bangles: ప్లెయిన్ గాజులతో సూపర్ లుక్.. మళ్లీ వచ్చిన పాత ఫ్యాషన్!
Related Stories
Recommended image1
Mint Leaves Water: పరగడుపున పుదీనా నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా? 90 శాతం మందికి తెలియదు!
Recommended image2
Banana: రోజూ ఒక అరటిపండు తింటే శరీరంలో జరిగే 5 అద్భుతమైన మార్పులు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved