MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Banana: రోజూ ఒక అరటిపండు తింటే శరీరంలో జరిగే 5 అద్భుతమైన మార్పులు ఇవే!

Banana: రోజూ ఒక అరటిపండు తింటే శరీరంలో జరిగే 5 అద్భుతమైన మార్పులు ఇవే!

Banana: చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఇష్టంగా తినే పండ్లల్లో అరటిపండు ముందుంటుంది. చాలామంది అరటిపండును ఆకలి తీర్చే పండుగా మాత్రమే చూస్తారు. కానీ ఈ పండులో దాగి ఉన్న పోషకాల గురించి తెలిస్తే రోజూ తినక మానరు. రోజుకో అరటిపండు తింటే ఏమవుతుందో చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Jun 23 2026, 03:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రోజుకో అరటిపండు తినడం వల్ల కలిగే లాభాలు
Image Credit : Getty

రోజుకో అరటిపండు తినడం వల్ల కలిగే లాభాలు

ఎక్కవమంది ఇష్టంగా తినే పండ్లలో అరటిపండు ఒకటి. తక్కువ ధరలో లభించడం, ఎక్కడైనా ఈజీగా దొరకడం, తక్షణ శక్తిని అందించడం వల్ల చాలామంది ఈ పండును తింటుంటారు. అరటిపండులో పొటాషియం, ఫైబర్, విటమిన్ B6, విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం రోజూ ఒక అరటిపండు తినడం వల్ల శరీరంలో అనేక సానుకూల మార్పులు  జరుగుతాయి. అవేంటో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
శరీరానికి తక్షణ శక్తి
Image Credit : Getty

శరీరానికి తక్షణ శక్తి

రోజూ ఒక అరటిపండు తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అరటిపండులో సహజ చక్కెరలు అయిన గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ ఉంటాయి. ఇవి శరీరానికి త్వరగా శక్తిని అందిస్తాయి. అందుకే చాలామంది క్రీడాకారులు, వ్యాయామం చేసే వారు అరటిపండును ప్రత్యేకంగా తీసుకుంటారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ తో పాటు ఒక అరటిపండు తింటే రోజంతా ఉత్సాహంగా ఉంటారు.

Related Articles

Related image1
Hair Growth: జుట్టు ఒత్తుగా పెరగాలా? అయితే ఈ జ్యూస్‌లు తాగాల్సిందే!
Related image2
Tamarind Leaves: చింత చిగురు తింటే ఎన్ని లాభాలో తెలుసా? ఒక్కసారైనా తినాల్సిందే!
36
గుండె ఆరోగ్యం
Image Credit : Getty

గుండె ఆరోగ్యం

అరటిపండులో సమృద్ధిగా ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మన శరీరంలో సోడియం ఎక్కువైతే రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. పొటాషియం ఆ ప్రభావాన్ని తగ్గించి రక్తనాళాలు సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది. తద్వారా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

46
జీర్ణవ్యవస్థకు మేలు
Image Credit : Getty

జీర్ణవ్యవస్థకు మేలు

అరటిపండులో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా మలబద్ధకం సమస్యతో బాధపడే వారికి ఇది కొంత ఉపశమనం కలిగించవచ్చు. ఫైబర్ పేగుల కదలికలను సక్రమంగా ఉంచి వ్యర్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. అలాగే ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. దానివల్ల అతిగా తినడం తగ్గుతుంది.

56
మానసిక ఆరోగ్యం
Image Credit : Getty

మానసిక ఆరోగ్యం

అరటిపండులో ఉండే విటమిన్ B6 శరీరంలో సెరోటోనిన్, డోపమైన్ వంటి న్యూరోట్రాన్స్మిటర్ల ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇవి మన మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన రసాయనాలు. కాబట్టి అరటిపండు.. మానసిక ఉల్లాసం, ఏకాగ్రత మెరుగుపడటానికి పరోక్షంగా సహాయపడుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

66
కండరాల ఆరోగ్యం
Image Credit : freepik

కండరాల ఆరోగ్యం

చాలామంది రాత్రి సమయంలో కాళ్లు పట్టేయడం లేదా కండరాల నొప్పులు రావడం వల్ల ఇబ్బంది పడుతుంటారు. దీనికి కొన్నిసార్లు ఖనిజాల లోపం కారణం కావచ్చు. అరటిపండులోని పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు కండరాల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. ముఖ్యంగా వ్యాయామం చేసే వారు లేదా శారీరక శ్రమ ఎక్కువగా చేసే వారికి అరటిపండు మంచి ఎంపిక. అయితే డయాబెటిస్ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా తర్వాత ఆహారంలో మార్పులు చేసుకోవడం మంచిది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mangalsutra pendant: 2 గ్రాముల్లో మంగళసూత్రాల పెండెంట్స్... చూసేయండి
Recommended image2
Raw Milk: పచ్చిపాలను ఇలా స్టోర్ చేస్తే ప్రమాదమే...పిల్లలకైతే అస్సలు ఇవ్వొద్దు
Recommended image3
Drop Earrings: అదిరిపోయే డ్రాప్ ఇయర్ రింగ్స్.. డైలీవేర్ కి బెస్ట్!
Related Stories
Recommended image1
Hair Growth: జుట్టు ఒత్తుగా పెరగాలా? అయితే ఈ జ్యూస్‌లు తాగాల్సిందే!
Recommended image2
Tamarind Leaves: చింత చిగురు తింటే ఎన్ని లాభాలో తెలుసా? ఒక్కసారైనా తినాల్సిందే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved