- Home
- Life
- Mint Leaves Water: పరగడుపున పుదీనా నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా? 90 శాతం మందికి తెలియదు!
Mint Leaves Water: పరగడుపున పుదీనా నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా? 90 శాతం మందికి తెలియదు!
Mint Leaves Water: పుదీనా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సహజ ఔషధం. ముఖ్యంగా ఉదయం పరగడుపున పుదీనా ఆకుల నీళ్లు తాగడం వల్ల శరీరంలో అనేక సానుకూల మార్పులు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో, ఈ సింపుల్ డ్రింక్ ఎలా పనిచేస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.

పుదీన నీళ్లు తాగడం వల్ల కలిగే లాభాలు
పుదీనా ఆకులను మనం చాలా రకాల వంటల్లో ఉపయోగిస్తుంటాం. ఇవి వంటలకు మంచి రుచి, వాసన ఇవ్వడంతో పాటు అనేక ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఉదయం పరగడుపున పుదీనా నీళ్లు తాగడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
జీర్ణ సమస్యలు దూరం
పుదీనాలో ఉండే ముఖ్యమైన పదార్థం మెంటాల్. ఇది శరీరానికి కూలింగ్ ఎఫెక్ట్ ఇవ్వడమే కాకుండా జీర్ణవ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో పుదీనా నీళ్లు తాగితే కడుపులో జీర్ణరసాల ఉత్పత్తి మెరుగుపడుతుంది. దీనివల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు ఉన్నవారికి ఇది చక్కగా సహాయపడుతుంది.
శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో
ఆరోగ్య నిపుణుల ప్రకారం పుదీనా నీళ్లు శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడతాయి. రాత్రి నిద్ర తర్వాత శరీరం డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఉదయం ఒక గ్లాస్ పుదీనా నీళ్లు తాగడం వల్ల శరీరానికి తక్షణ ఫ్రెష్‌నెస్ లభిస్తుంది. ఇది మెదడును యాక్టివ్ చేయడంలో కూడా సహాయపడుతుంది. అలాగే పుదీనా నీళ్లు శరీరంలో ఉన్న టాక్సిన్స్‌ను బయటకు పంపే ప్రక్రియలో సహాయపడతాయని కొన్ని అధ్యాయనాలు చెబుతున్నాయి.
బరువు నియంత్రణకు
బరువు తగ్గాలనుకునే వారికి పుదీనా నీళ్లు బెస్ట్ డ్రింక్ అని చెప్పవచ్చు. ఇది మెటబాలిజాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే ఆకలిని కూడా కొంతమేర నియంత్రిస్తుంది. అయితే మంచి ఫలితాలు రావాలంటే మాత్రం ఈ డ్రింక్ తో పాటు సరైన ఆహారం, వ్యాయామం, జీవనశైలి మార్పులు కూడా అవసరం.
పుదీనా నీళ్లు శ్వాస సంబంధిత సమస్యలపై కూడా ప్రభావం చూపిస్తాయి. మెంటాల్ సహజంగా నాసిక మార్గాలను క్లియర్ చేయడంలో సహాయపడుతుంది. జలుబు, ముక్కు దిబ్బడ వంటి సమస్యలు ఉన్నప్పుడు ఇది కొంత ఉపశమనం ఇస్తుంది. అంతేకాదు నోటి దుర్వాసనను పోగొట్టడంలో పుదీనా నీళ్లు సహాయపడతాయి.
పుదీనా నీళ్లు ఎలా తయారు చేయాలంటే?
పుదీనా నీళ్లు తయారు చేయడం చాలా ఈజీ. కొన్ని తాజా పుదీనా ఆకులను శుభ్రంగా కడిగి ఒక గ్లాస్ నీటిలో వేసి రాత్రంతా నానబెట్టడం లేదా మరిగించి తాగడం సాధారణ పద్ధతి. కొంతమంది దీనికి నిమ్మరసం కలిపి కూడా తాగుతారు. దీనివల్ల విటమిన్ C ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అయితే పుదీనా నీళ్లు అందరకీ సెట్ కాకపోవచ్చు. వీటిని తాగడం వల్ల కొంతమందికి అసిడిటీ పెరగవచ్చు. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారికి జాగ్రత్త అవసరం. అలాగే ఎక్కువగా తీసుకుంటే శరీరంలో చలి స్వభావం పెరగవచ్చు. అందుకే మితంగా తీసుకోవడం మంచిది.

