MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Smart Toilets : టాయిలెట్స్ తెలుసు.. మరి ఈ వాష్ లెట్స్ ఏంటి?

Smart Toilets : టాయిలెట్స్ తెలుసు.. మరి ఈ వాష్ లెట్స్ ఏంటి?

ఆఫీసులు, ఇంట్లోకే కాదు ఇప్పుడు బాత్రూమ్‌లలోకి కూడా టెక్నాలజీ వచ్చేసింది. వ్యక్తిగత పరిశుభ్రతను పెంచే స్మార్ట్ టాయిలెట్లు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ స్మార్ట్ టాయిలెట్ల ప్రత్యేకతలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Arun Kumar P
Published : Aug 12 2026, 10:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
స్మార్ట్ టాయిలెట్స్ ట్రెండ్
Image Credit : Gemini AI

స్మార్ట్ టాయిలెట్స్ ట్రెండ్

ఒకప్పుడు లగ్జరీ హోటళ్లు, జపాన్ లాంటి దేశాల్లో మాత్రమే హైటెక్ బాత్రూంలు కనిపించేవి. కానీ ఇప్పుడు ఇండియన్ ఇళ్లలోకి హైటెక్ సౌకర్యాలతో బాత్రూంలు వచ్చేశాయి. అందుకే ప్రస్తుతం బాత్రూమ్ అంటే కేవలం రోజువారీ అవసరాలు తీర్చుకునే చోటు మాత్రమే కాదు… లగ్జరీ, టెక్నాలజీని కేంద్రాలు. ముఖ్యంగా 'స్మార్ట్ టాయిలెట్లు', 'వాష్‌లెట్లు' ఆధునిక ఇళ్లలో కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అసలేంటి వాష్ లెట్?
Image Credit : AI Image

అసలేంటి వాష్ లెట్?

టాయిలెట్, బిడెట్ (నీటితో శుభ్రపరిచే సిస్టమ్) రెండింటినీ ఒకే యూనిట్‌లో కలిగినవే ఈ స్మార్ట్ టాయిలెట్లు. వీటిలో నీటి ఉష్ణోగ్రత, ప్రెజర్, నీరు వచ్చే దిశను మనకు నచ్చినట్టు మార్చుకోవచ్చు. కొన్ని మోడళ్లలో హీటెడ్ సీట్లు, గోరువెచ్చని గాలితో ఆరబెట్టే డ్రైయర్, ఆటోమేటిక్ సెన్సర్లు కూడా ఉంటాయి. ఇలా టెక్నాలజీ సాయంతో పనిచేసే స్మార్ట్ టాయిలెట్స్ నే వాష్ లెట్స్ అనికూడా అంటారు.

Related Articles

Related image1
Bathroom Cleaning: బాత్రూమ్ టైల్స్ మురికి పట్టాయా? దీనితో తుడిస్తే.. కొత్త వాటిలా మెరుస్తాయి
Related image2
Bathroom Plants: బాత్రూమ్ లో ఈ మొక్కలు ఉంటే.. దుర్వాసన రాదు..!
34
స్మార్ట్ టాయిలెట్లతో లాభాలెన్నో..
Image Credit : AI Image

స్మార్ట్ టాయిలెట్లతో లాభాలెన్నో..

స్మార్ట్ టాయిలెట్స్ లేదా వాష్ లెట్స్ ప్రధాన ప్రయోజనాలు ఇవే…

టాయిలెట్ పేపర్ అవసరం లేదు : నీటితో శుభ్రం చేసే వ్యవస్థ ఉండటంతో టాయిలెట్ పేపర్‌పై ఆధారపడాల్సిన పనిలేదు. ఇది పర్యావరణానికి కూడా మంచిది.

మెరుగైన పరిశుభ్రత : పేపర్‌తో పోలిస్తే నీటితో కడుక్కోవడం చాలా ప్రభావవంతంగా, శుభ్రంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

తక్కువ స్పర్శ, ఎక్కువ భద్రత : ఆటోమేటిక్ సెన్సర్లు ఉండటంతో టాయిలెట్‌ను పదేపదే చేత్తో తాకాల్సిన అవసరం ఉండదు. ఇది బ్యాక్టీరియా వ్యాప్తిని అరికడుతుంది… ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

పర్యావరణ హితం : టాయిలెట్ పేపర్ తయారీకి చాలా చెట్లు నరకాల్సి వస్తుంది. ఈ టెక్నాలజీ వాడకం వల్ల కాగితం వాడకం తగ్గి, సహజ వనరులను కాపాడవచ్చు.

సౌకర్యం : చలికాలం లేదా వర్షాకాలంలో టాయిలెట్ సీటును వేడిగా మార్చుకోవచ్చు. నీటిని కూడా మనకు నచ్చిన టెంపరేచర్ లో వాడుకోవచ్చు. దీంతో చాలా సౌకర్యవతంగా ఉంటుంది.

44
స్మార్ట్ టాయిలెట్స్ లో జాగ్రత్తలు తప్పనిసరి
Image Credit : AI Image

స్మార్ట్ టాయిలెట్స్ లో జాగ్రత్తలు తప్పనిసరి

స్మార్ట్ టాయిలెట్లలో సెల్ఫ్-క్లీనింగ్ (స్వయంగా శుభ్రం చేసుకునే) వ్యవస్థ ఉన్నప్పటికీ, వాటిని అప్పుడప్పుడు మాన్యువల్‌గా శుభ్రపరచడం చాలా ముఖ్యం. బ్యాక్టీరియా, దుర్వాసన రాకుండా ఉండాలంటే డిస్‌ఇన్‌ఫెక్షన్ చేయడం తప్పనిసరి.

భవిష్యత్తులో స్మార్ట్ హోమ్ కాన్సెప్ట్ పెరిగేకొద్దీ సాధారణ ఇళ్లలో కూడా ఈ స్మార్ట్ టాయిలెట్లు తప్పనిసరి కానున్నాయి. ఇది జీవనశైలిని సులభతరం చేయడమే కాకుండా, పరిశుభ్రత ప్రమాణాలను కూడా పెంచుతుంది. ఇలా స్మార్ట్ ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్స్ మాదిరిగానే స్మార్ట్ టాయిలెట్స్ అందుబాటులోకి వచ్చేశాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
కుబేర యోగంతో రాబోయే 3 నెలల్లో ఈ 3 రాశులువారికి డబ్బే డబ్బు
Recommended image2
స్వీట్లపై మెరిసే వెండి పూతను తినేస్తున్నారా? అసలు అది నిజమైన వెండేనా?
Recommended image3
Eggs: ఒక గుడ్డులో రెండు పచ్చ సొనలు ఎప్పుడైనా చూశారా? ఇలాంటి గుడ్లు తినొచ్చా? తినకూడదా?
Related Stories
Recommended image1
Bathroom Cleaning: బాత్రూమ్ టైల్స్ మురికి పట్టాయా? దీనితో తుడిస్తే.. కొత్త వాటిలా మెరుస్తాయి
Recommended image2
Bathroom Plants: బాత్రూమ్ లో ఈ మొక్కలు ఉంటే.. దుర్వాసన రాదు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved