MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Boiled Eggs: ఉడికించిన కోడిగుడ్లు ఎన్ని రోజులు తాజాగా ఉంటాయి..?

Boiled Eggs: ఉడికించిన కోడిగుడ్లు ఎన్ని రోజులు తాజాగా ఉంటాయి..?

Boiled Eggs: కోడి గుడ్లు ఉడికించిన తర్వాత వెంటనే తినేయాలి లేకపోతే.. పాడైపోతాయి అని చాలా మంది నమ్ముతుంటారు. అది నిజమేనా? ఉడికించిన గుడ్డు లైఫ్ స్పాన్ తగ్గిపోతుందా?

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 12 2026, 10:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Eggs
Image Credit : istock

Eggs

ఉడికించిన కోడిగుడ్డు ఆరోగ్యానికి ఎంత మంచిదో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ప్రోటీన్ కి బెస్ట్ సోర్స్. అంతేకాదు, తక్కువ ధరకే అందరికీ ఈజీగా లభించేస్తుంది. అయితే, ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితం కావడంతో.. తీరికగా వండుకోవడానికి ఎవరికీ సమయం ఉండటం లేదు.దీంతో ఒకేసారి వండేస్తూ ఉంటారు. కానీ, ఉడికించిన గుడ్లు ఎన్ని రోజులు తాజాగా ఉంటాయి? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఉడికించిన గుడ్లను ఎన్నిరోజులు తాజాగా ఉంటాయి..?
Image Credit : Getty

ఉడికించిన గుడ్లను ఎన్నిరోజులు తాజాగా ఉంటాయి..?

అమెరికా వ్యవసాయ శాఖ సమాచారం ప్రకారం, బాగా ఉడికించిన గుడ్లను రిఫ్రిజిరేటర్ లో వారం రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు. గుడ్డును ఉడకపెట్టినప్పుడు దానిపై ఉండే సహజ రక్షణ పొర తొలగిపోతుంది. అందుకే, ఉడికించిన గుడ్డు పైన షెల్ తొలగించినా, తొలగించకపోయినా కూడా.. పాడవ్వకుండా ఉండాలంటే, బ్యాక్టీరియా చేరకుండా ఉండాలంటే కచ్చితంగా ఫ్రిజ్ లోనే స్టోర్ చేయాలి.

ఫ్రిజ్ లో ఎలా స్టోర్ చేయాలి..?

పెంకు ఉన్న గుడ్లు : గుడ్డు పెంకు ఇతర వాసనలు, మలినాలు లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటుంది. వీటిని శుభ్రమైన, గాలి చొరబడని డబ్బాలో (Airtight container) పెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి.

పెంకు తీసిన గుడ్లు : పెంకు తీసిన గుడ్లు ఎండిపోకుండా ఉండాలంటే, డబ్బాలో ఒక తడి పేపర్ టవల్ ఉంచి దానిలో వీటిని నిల్వ చేయాలి. లేదా శుభ్రమైన చల్లటి నీటిలో ముంచి ఉంచి, రోజూ నీటిని మారుస్తుంటే వారం రోజులు తాజాగా ఉంటాయి.

33
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
Image Credit : Getty

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

వెంటనే ఫ్రిజ్‌లో పెట్టండి: గుడ్లను ఉడకబెట్టిన 2 గంటల లోపే ఫ్రిజ్‌లో పెట్టాలి. బయట ఎక్కువసేపు ఉంచితే బ్యాక్టీరియా త్వరగా చేరుతుంది.

గాలి చొరబడని డబ్బాలు వాడండి: ఇవి తేమ ఆవిరి కాకుండా నిరోధించడమే కాకుండా, ఫ్రిజ్‌లోని ఇతర పదార్థాల వాసనలు గుడ్డుకు పట్టకుండా చూస్తాయి.

ఫ్రిజ్ వెనుక భాగంలో ఉంచండి: డోర్ వైపు కాకుండా రిఫ్రిజిరేటర్‌లో బాగా చల్లగా ఉండే మధ్య అర వెనుక భాగంలో ఉంచాలి.

డేట్ లేబుల్ వేయండి: గుడ్లను ఉడకబెట్టిన తేదీని డబ్బాపై రాసుకోవాలి. డేట్ రాసిపెట్టుకొని ఉంటే.. 7 రోజులు దాటకుండా జాగ్రత్తగా వాటిని తినే అవకాశం ఉంటుంది. దీని వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా ఉండవు.

ఈ పొరపాటు చేయకూడదు..

ఉడికించిన గుడ్లను సరైన పద్ధతిలో నిల్వ చేసినప్పటికీ, కొన్నిసార్లు గాలి తగలడం లేదా ఉష్ణోగ్రతల్లో మార్పుల వల్ల వారంలోపే అవి పాడైపోయే ప్రమాదం ఉంది. కాబట్టి గుడ్డును తినే ముందు అది మంచిగా ఉందో లేదో గుర్తించడం చాలా ముఖ్యం. మొదటగా గుడ్డు నుంచి ఏదైనా అసాధారణమైన చెడు వాసన వస్తుంటే అది పాడైపోయిందని అర్థం. అలాగే గుడ్డు తెల్లసొన లేదా పచ్చసొన రంగు మారడం, ముట్టుకున్నప్పుడు జిగటగా లేదా సుద్దలా అనిపించడం కూడా గుడ్డు చెడిపోయిదనడానికి స్పష్టమైన సంకేతాలు. అంతేకాకుండా తింటున్నప్పుడు పుల్లగా లేదా సాధారణ రుచికి భిన్నంగా అనిపిస్తే వెంటనే తినడం ఆపేయాలి. ఆరోగ్య పరమైన ప్రమాదాలు తలెత్తకుండా ఉండాలంటే.. గుడ్డు విషయంలో కొద్దిగా అనుమానం వచ్చినా దాన్ని పారేయడమే అత్యంత సురక్షితమైన మార్గం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
ఆహారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Printed Saree: ఆఫీస్ వేర్ కి పర్ఫెక్ట్ గా సూటయ్యే ప్రింటెడ్ చీరలు
Recommended image2
Chapati Dough: చపాతీ పిండి కలిపిన కాసేపటికే నల్లగా ఎందుకు మారుతుంది? తాజాగా ఉండాలంటే ఏం చేయాలి?
Recommended image3
Silver Anklet:భారత్ లో కాకుండా ఏదేశంలో మహిళలు పట్టీలు ధరిస్తారో తెలుసా
Related Stories
Recommended image1
Over Cooked Rice: అన్నం మరీ మెత్తగా అయ్యిందా? మళ్లీ పొడి పొడిగా మార్చేయచ్చు..!
Recommended image2
Potato: బంగాళదుంపలు తొందరగా మొలకెత్తుతున్నాయా? ఇలా చేస్తే మొలకలు రావు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved