Diwali 2021 : దీపావళి పార్టీకి చిటికెలో రెడీ అయిపోయే టేస్టీ టేస్టీ..ఛాట్స్ ఇవే...
ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ దీపావళి ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోగలిగే వినూత్నమైన చాట్ వంటకాలతో మీ హౌస్ పార్టీని గుర్తుండిపోయేలా చేయచ్చు. సింపుల్ గా ఈజీగా చేసుకునే ఆ వంటకాలేంటో చూడండి..
దీపావళి అంటే అందరికీ ఇష్టమైన పండుగ. కొత్త బట్టలు, పటాకులు, స్వీట్లు, దీపకాంతులు, రంగవల్లులు, అలంకరణ.. వెరసి దీపావళిని అద్భుతంగా మార్చేస్తాయి. దీపావళినాడు పట్టుపరికిణీ వేసుకుని దీప తోరణాలను ముట్టించడమే కాదు... జాగ్రత్తగా తోక బాంబులను కాల్చడమూ సరదానే.
diwali lights
ఇలాంటి సరదాలు ఒక్కరే చేసుకుంటే మజా రాదు. బంధువులు, స్నేహితులతో కలిసి చేసుకుంటే అద్బుతంగా ఉంటుంది. దీనికోసం చాలామంది దీపావళి నాడు ఇంట్లోనే దీపావళి పార్టీ ఏర్పాటు చేస్తారు. దీనికోసం రకరకాల స్ట్రీట్ ఫుడ్స్ నూ ఆర్డర్ చేస్తుంటారు. అవి లేకుండా ఈ పార్టీ పూర్తి కాదు.
panjanga deepavali
ఇలాంటి సరదాలు ఒక్కరే చేసుకుంటే మజా రాదు. బంధువులు, స్నేహితులతో కలిసి చేసుకుంటే అద్బుతంగా ఉంటుంది. దీనికోసం చాలామంది దీపావళి నాడు ఇంట్లోనే దీపావళి పార్టీ ఏర్పాటు చేస్తారు. దీనికోసం రకరకాల స్ట్రీట్ ఫుడ్స్ నూ ఆర్డర్ చేస్తుంటారు. అవి లేకుండా ఈ పార్టీ పూర్తి కాదు.
అయితే, ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ దీపావళి ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోగలిగే వినూత్నమైన చాట్ వంటకాలతో మీ హౌస్ పార్టీని గుర్తుండిపోయేలా చేయచ్చు. సింపుల్ గా ఈజీగా చేసుకునే ఆ వంటకాలేంటో చూడండి..
chaat papdi
వేయించిన ఆలూ చాట్
4-5 ఉడికించిన బంగాళాదుంపలను ముక్కలుగా కోసి.. వాటిని బంగారు రంగులోకి, కాస్త క్రిస్పీగా మారే వరకు వేయించాలి. ఆ తరువాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని.. దీనికి కొంచెం పెరుగు, 1 టీస్పూన్ చాట్ మసాలా, 1 టీస్పూన్ జీలకర్ర పొడి, ఉప్పు, ఎండుమిర్చి, దానిమ్మ గింజలు, సెవ్ కలపాలి.. అంతే టేస్టీ టేస్టీ Fried Aloo Chaat రెడీ అయిపోయినట్టే..
పాప్డీ చాట్
ఒక ప్లేట్లో 7-9 పాప్డీలను చూరచూర చేయాలి. దీనిక ఉడకబెట్టిన తెల్ల శనగలు కలపాలి.. రుచికోసం ఉప్పు, మిరియాల పొడి వేసుకోవచ్చు. అలాగే కొంచెం ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, కారంపొడి, ఉప్పు, ½ tsp జీలకర్ర పొడి, 2-4 టేబుల్ స్పూన్లు గిలక్కొట్టిన పెరుగు కలపాలి.
దీని మీద గ్రీన్ చట్నీ, రెడ్ చట్నీ వేసి... 2 టేబుల్ స్పూన్లు తరిగిన ఉల్లిపాయ, కొత్తిమీర ఆకులు, నిమ్మరసం, సెవ్తో అలంకరిస్తే Papdi Chaat రెడీ..
స్వీట్ పొటాటో చాట్
ఒక ఉడకబెట్టిన కందగడ్డను తీసుకుని దాన్ని సన్నని ముక్కలుగా కట్ చేసి, ప్లేట్లో ఉంచండి. ఇప్పుడు, 2 టేబుల్ స్పూన్లు గిలక్కొట్టిన పెరుగు, రుచికి తగినంత ఉప్పు, ½ tsp నల్ల మిరియాలు పొడి, ¼ చాట్ మసాలా, 1 tsp జీలకర్ర పొడి, ½ tsp నిమ్మరసం, ½ tsp కారంపొడి కలపాలి. దీనిమీద పుదీనా చట్నీ, కొత్తిమీర ఆకులు, సెవ్ వేస్తే Sweet Potato Chaat రెడీ.
స్ప్రౌట్ సలాడ్
మొలకెత్తిన గింజలతో చేసే ఈ Sprout Saladకు కాస్త ముందుగా ప్రిపరేషన్ అవసరం. ఇది చేయాలనుకుంటే ముందు రోజు రాత్రే పెసర్లను నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం వాటిని ఉడకబెట్టండి. ఇప్పుడు, మిక్సింగ్ గిన్నెలో మొలకలు తీసుకుని, ½ తరిగిన ఉల్లిపాయ, టొమాటో, 1 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ కొత్తిమీర ఆకులు, ఉప్పు, మిరియాలు, ½ tsp చాట్ మసాలా, 1 tsp జీలకర్ర పొడి, ½ నిమ్మరసం వేసి అన్నింటినీ బాగా కలిపి.. తాజాగా సర్వ్ చేయడమే.
samosa Income
సమోసా చాట్
ఒక ప్లేట్లో రెండు సమోసాలు తీసుకుని.. వాటిని చూర్ణం చేయాలి. వీటికి ఉడికించిన చోలే, ½ తరిగిన ఉల్లిపాయ, 1 పచ్చిమిర్చి, ఉప్పు, మిరియాలు, 1 tsp జీలకర్ర, 1 tsp చాట్ మసాలా, ½ tsp ఎర్ర కారం పొడి, 1 tbsp గ్రీన్ చట్నీ,1 tbsp చింతపండు చట్నీ కలపాలి. ఆ తరువాత తాజా కొత్తిమీర ఆకులతో అలంకరించి సెవ్ వేసి వేడి వేడిగా చేయండి. వేడి వేడిగా Samosa Chaat వడ్డించడమే..
మఖానా చాట్
ఒక ప్లేట్లో రోస్టెడ్ మఖానా తీసుకుని.. దీనికి 2 టేబుల్ స్పూన్లు వేయించిన పల్లీలు, 2 టేబుల్ స్పూన్లు గిలక్కొట్టిన పెరుగు, ఉప్పు, ఎండుమిర్చి, ½ స్పూన్ చాట్ మసాలా, 1 tsp జీలకర్ర పొడి, ½ tsp ఎర్ర కారం పొడి, ¼ తరిగిన ఉల్లిపాయ కలపాలి. ఆతరువాత దీనికి తాజా కొత్తిమీర ఆకులు, నిమ్మరసం పైనుంచి వేసి Makhana Chaatను తాజాగా సర్వ్ చేయాలి.
వెజ్ స్ప్రింగ్ రోల్స్ ఇంట్లోనే ఎలా చెయ్యాలో తెలుసా... పూర్తి వివరాలు మీకోసం?